...
...
Next Story

Virosh with PM: ప్ర‌ధానిని క‌లిసిన విరోష్‌.. వెడ్డింగ్ రిసెప్ష‌న్‌కు రావాలని న‌వ దంప‌తుల స్పెష‌ల్ ఆహ్వానం

Virosh with PM: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. గురువారం పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఈ రోజు ప్రధాని ఆశీర్వాదాలు తీసుకున్నారు. తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు ప్రధానిని ఆహ్వానించారు.

Published on: Feb 27, 2026, 13:46:35 IST
Advertisement

డ్రీమ్ వెడ్డింగ్ తో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26) ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ లో విరోష్ వెడ్డింగ్ గ్రాండింగ్ జరిగింది. మార్చి 4న హైదరాబాద్ లో విరోష్ రిసెప్షన్ జరుగుతుంది. ఈ రిసెప్షన్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్వయంగా వెళ్లి విజయ్, రష్మిక ఆహ్వానించారు.

ప్రధానితో విరోష్

ప్రధాని నరేంద్ర మోదీతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (instagram-Shreyas Media)
ప్రధాని నరేంద్ర మోదీతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (instagram-Shreyas Media)

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్నారు. తమ వివాహం తర్వాత ఈ కొత్త దంపతులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఉదయ్ పూర్ నుంచి ఢిల్లీ వెళ్లి పీఎం మోదీని విరోష్ జోడీ కలిసింది. తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు రావాలని స్వయంగా మోదీని విజయ్, రష్మిక ఆహ్వానించారు.

మోదీ ఆశీర్వాదం

కొత్త దంపతులు రష్మిక, విజయ్ కు మోదీ తన ఆశీర్వాదాన్ని అందించారు. మోడీతో ఈ న్యూ కపుల్ సరదాగా మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా విరోష్ పెళ్లి గురించి మోదీ అడిగినట్లు తెలిసింది.

మొదట తమ వివాహానికి ప్రధానిని విరోష్ ఆహ్వానించారు. కానీ పెళ్లికి వెళ్లలేకపోయిన మోదీ ఒక స్పెషల్ లెటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఇది కొత్త, అందమైన అధ్యాయం. సినిమాల్లో స్క్రిప్ట్ ప్రకారం రష్మిక, విజయ్ నటించారు. కానీ ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. సినిమాల్లో స్క్రిప్ట్ కంటే కూడా ఈ స్క్రిప్ట్ బెటర్ గా ఉండాలని ఆశిస్తున్నా’’ అని ఆ లెటర్ లో మోదీ పేర్కొన్నారు.

గ్రాండ్ గా రిసెప్షన్

ఉదయ్ పూర్ లో జరిగిన విరోష్ వెడ్డింగ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, సందీప్ రెడ్డి వంగా, ఆషికా రంగనాథ్, కల్యాణి ప్రియదర్శన్ తదితరులు అటెండ్ అయ్యారు. ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులైన ఫ్రెండ్స్ సమక్షంలో విరోష్ పెళ్లి జరిగింది. ఈ వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe