టైటిల్: విష్ణు విన్యాసం

నటీనటులు: శ్రీవిష్ణు, నయన్ సారిక, బ్రహ్మాజీ, సత్య, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యాంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, గోపరాజు రమణ తదితరులు
దర్శకత్వం: యదునాథ్ మారుతి రావు
సంగీతం: రధన్
నిర్మాత: సుమంత్ నాయుడు జీ
విడుదల తేది: ఫిబ్రవరి 27, 2026
టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని పేరు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు నటించి లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ విష్ణు విన్యాసం. నయన్ సారిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహించారు. మరి ఇవాళ (ఫిబ్రవరి 27) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి విష్ణు విన్యాసం రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఒంగోలులోని ఓ జూనియర్ కాలేజీలో విష్ణు అలియాస్ చిన్ను (శ్రీవిష్ణు) జూనియర్ లెక్చర్‌గా వర్క్ చేస్తుంటాడు. జాతకాలను, వాస్తును బాగా నమ్ముతాడు. అదే కాలేజీలో హెచ్‌ఓడీగా పనిచేస్తున్న మనీషా అలియాస్ జున్ను (నయన్ సారిక)ను ప్రేమిస్తాడు. ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.
కానీ, మనీషా జాతకంలో పెద్ద దోషం ఉంటుంది. అది తెలిసి పెళ్లి చేసుకునేందుకు వెనుకాడతాడు విష్ణు. కొన్ని కారణాల వల్ల మనీషాను పెళ్లి చేసుకుంటాడు విష్ణు.
మరి ఆ తర్వాత ఏమైంది? మనీషాకు ఉన్న జాతక దోషం ఏంటీ? దోషం ఉందని తెలిసి కూడా విష్ణు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఇద్దరి జీవితంలో ఎదురైన పరిస్థితులు ఏంటీ? చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే? విష్ణు విన్యాసం చూడాల్సిందే.
విశ్లేషణ:
శ్రీవిష్ణు మరోసారి తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వచ్చిన సినిమా ఇది. కానీ, ఈ మూవీలో హీరోయిన్ పాత్రను చాలా డిఫరెంట్‌గా చూపించారు. అది చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కామెడీకి మంచి స్కోప్ ఉంటుంది. జాతకాలపై పలు సినిమాలను ఇదివరకు చూశాం. హీరోయిన్ జాతకంలో దోషం ఉండటం, దాని చుట్టు అల్లిన కథ బాగుంది.
{{/usCountry}}శ్రీవిష్ణు మరోసారి తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వచ్చిన సినిమా ఇది. కానీ, ఈ మూవీలో హీరోయిన్ పాత్రను చాలా డిఫరెంట్‌గా చూపించారు. అది చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కామెడీకి మంచి స్కోప్ ఉంటుంది. జాతకాలపై పలు సినిమాలను ఇదివరకు చూశాం. హీరోయిన్ జాతకంలో దోషం ఉండటం, దాని చుట్టు అల్లిన కథ బాగుంది.
{{/usCountry}}హీరోయిన్ జాతకంలో పెద్ద దోషం అనేది ఇంటర్వెల్‌లో రివీల్ అవడం పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. ఆ దోషం చూసి జాతకాలు, వాస్తును అతిగా నమ్మే విష్ణు ఎలా రియాక్ట్ అయ్యాడు వంటి సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. మీమ్స్ డైలాగ్స్‌తో వచ్చే సీన్స్ నవ్విస్తాయి. జాతకం చుట్టూ కథ సాగిన యూత్‌కు నచ్చే అంశాలను ఎలివేట్ చేశారు.
ఊహించే క్లైమాక్స్
ఫస్టాఫ్ అంతా డిఫరెంట్ సీన్స్, కామెడీ డైలాగ్స్‌తో చాలా బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్తా నెమ్మదిస్తుంది. దోషం తెలిసిన పెళ్లి చేసుకునే కారణాలు పర్వాలేదు. అయితే, సెకండాఫ్ అంతా ఊహించేలా సాగుతుంది. క్లైమాక్స్ ఏంటో చెప్పేసేలా ఉంటుంది. ఇంకాస్తా డిఫరెంట్‌గా క్లైమాక్స్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది.
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రధన్ సంగీతం ఓకే. ఎడిటింగ్ బాగుంది. అతి తక్కువ రన్‌టైమ్‌తో బాగా కథను చూపించారు. డైరెక్టర్ యదునాథ్ మారుతి రావు టేకింగ్ బాగుంది. సెకండాఫ్‌లో ఇంకాస్తా ఫోకస్ చేయాల్సింది. అదిరిపోయే ట్విస్టులు హైలెట్ కాగా సెకండాఫ్ స్లో నెరేషన్ కాస్తా మైనస్. నిర్మాణ విలువలు బాగున్నాయి.
హ్యాపీగా నవ్వుకునే సినిమా
కామెడీతో సినిమాను తన భుజాన మోసాడు శ్రీవిష్ణు. మరోసారి తన మార్క్ డైలాగ్స్, పంచ్‌లతో నవ్వించాడు. హీరోయిన్ నయన్ సారిక చాలా గ్లామర్‌గా అట్రాక్ట్ చేసింది. కథ అంతా తన చుట్టే సాగుతుంది. తన పాత్రలో చాలా ఒదిగిపోయి చేసింది. మిగతా నటీనటులంతా బాగా చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు లేకుండా హ్యాపీగా నవ్వుకునే సినిమా విష్ణు విన్యాసం.