Vishwanath And Sons 1st Day Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు జంటగా తెరకెక్కిన తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. 'లక్కీ భాస్కర్' విజయం తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో విడుదల ముందే అంచనాలు భారీగా పెరిగాయి.

సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిన్న (ఆగస్ట్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు కాస్తా మిశ్రమ స్పందన వస్తోంది. అయినా కానీ, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది.
ఇండియా వ్యాప్తంగా రూ. 15.5 కోట్లు
బాక్సాఫీస్ విశ్లేషణ సంస్థ శాక్‌నిల్క్ (Sacnilk) లెక్కల ప్రకారం.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా మొదటి రోజు భారతదేశ వ్యాప్తంగా రూ. 15.5 కోట్ల నెట్ కలెక్షన్స్ (Net Collection) రాబట్టింది. దేశవ్యాప్తంగా ప్రదర్శించిన 5,034 షోలలో సగటున 41.38 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
తెలుగు రాష్ట్రాల కంటే తమిళనాడులోనే విశ్వనాథ్ అండ సన్స్ సినిమాకు ఎక్కువ ఆదరణ లభించింది. తమిళ వెర్షన్ రూ. 9.15 కోట్లు వసూలు చేయగా, తెలుగు వెర్షన్ కేవలం రూ. 6 కోట్లు మాత్రమే రాబట్టింది.
మార్నింగ్, మ్యాట్నీ షోలలో కాస్త మందకొడిగా (29.85%, 33.54%) ప్రారంభమైనప్పటికీ, ఈవెనింగ్ (36.38%), నైట్ షోలలో (62.69%) ఊపందుకుంది. అయితే, లాంగ్ వీకెండ్ కలసిరానుండటంతో రాబోయే రోజుల్లో విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సూర్య గత సినిమాల బాక్సాఫీస్ ట్రాక్ రికార్డ్
సూర్య గత చిత్రాల ఓపెనింగ్స్‌తో పోలిస్తే 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాగానే కలెక్ట్ చేసింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 2025లో వచ్చిన 'రెట్రో' తొలి రోజే రూ. 19.25 కోట్లు సాధించినా, టాక్ తేడా కొట్టడంతో లైఫ్‌టైమ్‌లో రూ. 60.58 కోట్లతో సరిపెట్టుకుంది.
{{/usCountry}}సూర్య గత చిత్రాల ఓపెనింగ్స్‌తో పోలిస్తే 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాగానే కలెక్ట్ చేసింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 2025లో వచ్చిన 'రెట్రో' తొలి రోజే రూ. 19.25 కోట్లు సాధించినా, టాక్ తేడా కొట్టడంతో లైఫ్‌టైమ్‌లో రూ. 60.58 కోట్లతో సరిపెట్టుకుంది.
{{/usCountry}}అలాగే, ఆర్జే బాలాజీ తెరకెక్కించిన 'కరుప్పు' సినిమా తొలి రోజు రూ. 15.50 కోట్లు సాధించినప్పటికీ, పాజిటివ్ టాక్‌తో లైఫ్‌టైమ్‌లో ఏకంగా రూ. 198.18 కోట్ల భారీ వసూళ్లను సాధించి సూర్య కెరీర్‌కు మళ్లీ ప్రాణం పోసింది. ప్రస్తుతం 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా రూ. 15.5 కోట్లతో బోణీ కొట్టడంతో ఈ సినిమా లైఫ్‌టైమ్ రన్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
కొత్త కోణంలో ఫ్యామిలీ ఎమోషన్స్
ఇదిలా ఉంటే, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో సూర్య 'సంజయ్ విశ్వనాథ్' అనే పారిశ్రామికవేత్తగా, పిస్టల్ షూటర్‌గా కనిపించారు. తన కుమారుడికి అత్యవసర వైద్య పరిస్థితి ఏర్పడినప్పుడు, సరోగసి ద్వారా తల్లి అయిన మ్యాడీ (మమితా బైజు)ని కలవాల్సి వస్తుంది. ఆ తర్వాత వారి జీవితాల్లో చోటుచేసుకున్న పరిణామాల చుట్టూ కథ తిరుగుతుంది.
ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో అలరించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, హాస్యాన్ని జోడించి వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని మలిచిన తీరు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వీకెండ్ సెలవులు తోడవడంతో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.