ఓటీటీ ప్రియుల కోసం సరికొత్త వినోదం సిద్ధమైంది. గత వారం ఓటీటీ రిలీజ్ అయిన ‘వ్లాదిమిర్’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2022లో వచ్చిన పాపులర్ నవల ఆధారంగా తెరకెక్కిన బోల్డ్ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది.
ఆస్కార్ అవార్డ్ గ్రహిత

ఈ ఎనిమిది ఎపిసోడ్ల ఓటీటీ సిరీస్‌లో ఆస్కార్ అవార్డు గ్రహీత, స్టార్ హీరోయిన్ రాచెల్ వీజ్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 5 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న వ్లాదిమిర్ ప్రస్తుతం ఇండియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే ట్రెండింగ్‌లో సత్తా చాటుతోంది వ్లాదిమిర్ మూవీ.
వ్లాదిమిర్ ఓటీటీ రిలీజ్
మార్చి 5న నెట్‌ఫ్లిక్స్‌లో వ్లాదిమిర్ ఓటీటీ రిలీజ్ అయింది. కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లోనూ వ్లాదిమిర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 6 ప్లేసులో వ్లాదిమిర్ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. ఇవాళ (మార్చి 9) ఆరో స్థానంలో వ్లాదిమిర్ ఓటీటీ ట్రెండింగ్ అవుతూ దూసుకుపోతోంది.
మన నెటివిటీకి తగ్గట్టుగా తెలుగు డబ్బింగ్ కూడా ఉండటంతో ఓటీటీ ఆడియెన్స్ వ్లాదిమిర్ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వ్లాదిమిర్ సినిమా శృంగారం, వ్యామోహం, మోజుతో పరితపించే మధ్య వయస్కురాలైన రచయిత్రి, టీచర్ చుట్టూ సాగుతుంది.
కథా నేపథ్యం ఏమిటి?
దశాబ్దాలుగా ఒకే కాలేజీలో పనిచేస్తున్న ఎమ్ (రాచెల్ వీజ్) కు భర్త, కూతురు ఉంటారు. భర్త, కూతురు, తన స్టూడెంట్స్ అంతా ఇతరులతో శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. దాంతో ఎమ్‌లో కోరికలు ఒక్కసారిగా విచ్చలవిడిగా మారతాయి.
{{/usCountry}}దశాబ్దాలుగా ఒకే కాలేజీలో పనిచేస్తున్న ఎమ్ (రాచెల్ వీజ్) కు భర్త, కూతురు ఉంటారు. భర్త, కూతురు, తన స్టూడెంట్స్ అంతా ఇతరులతో శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. దాంతో ఎమ్‌లో కోరికలు ఒక్కసారిగా విచ్చలవిడిగా మారతాయి.
{{/usCountry}}అదే సమయంలో ఎమ్ జీవితంలోకి వ్లాదిమిర్ (లియో వుడాల్) అనే కొత్త సహోద్యోగి ప్రవేశించడంతో అంతా మారిపోతుంది. అతనిపై ఆమె పెంచుకున్న విపరీతమైన వ్యామోహం (Obsession), ఆమె కెరీర్‌ను, వివాహ బంధాన్ని ఎలా చిన్నాభిన్నం చేసింది? తన ఫాంటసీలను నిజం చేసుకోవడానికి ఆమె ఎంతటి సాహసం చేసింది? అనే అంశాలను డార్క్ హ్యూమర్‌తో, చాలా బోల్డ్‌గా చూపించారు.
రివర్స్ చేసి
"సాధారణంగా పురుషులు యువతులపై పెంచుకునే వ్యామోహం గురించి కథలు చూస్తుంటాం. కానీ, ఇక్కడ దాన్ని రివర్స్ చేసి, ఒక మహిళా కోణంలో ఈ కథను చెప్పాలనుకున్నాను" అని ఈ షో క్రియేటర్ జూలియా మే జోన్స్ పేర్కొన్నారు.
నటీనటుల ప్రతిభ
రాచెల్ వీజ్ తన నటనతో మరోసారి మాయ చేశారు. తన పాత్రలోని సందిగ్ధతను, ఆవేశాన్ని ఆమె అద్భుతంగా పండించారు. "జూలియా రాసిన స్క్రిప్ట్ చాలా అల్లరిగా, నిజాయితీగా, అప్పుడప్పుడు కాస్త వింతగా కూడా అనిపిస్తుంది. అదే ఈ కథలోని అసలు మజా వచ్చేది" అని రాచెల్ వీజ్ తెలిపారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
జాన్ స్లాటరీ ఎమ్ భర్త పాత్రలో నటించగా, ఇతర కీలక పాత్రల్లో జెస్సికా హెన్విక్, మాట్ వాల్ష్ కనిపించారు. నటీనటులు అద్భుతమైన నటనతో కూడి ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న వ్లాదిమిర్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు భాషలో ఎంచక్కా చూసేయొచ్చు. కానీ, పెద్దలకు మాత్రమే.