...
...
Next Story

VV Vinayak: ఆ కారణంతో చంద్రబోస్ ఒక్క రూపాయి తీసుకోకుండా పాటలన్నీ రాశారు.. ధర్మస్థల నియోజకవర్గంపై వీవీ వినాయక్ కామెంట్స్

VV Vinayak About Dharmasthala Niyojakavargam Chandrabose: వరుణ్ సందేశ్, వితికా షెరు, సాయి కుమార్, సుమన్ నటించిన లేటెస్ట్ మూవీ ధర్మస్థల నియోజకవర్గం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వీవీ వినాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ విశేషాలపై లుక్కేద్దాం.

Published on: Sep 1, 2026, 13:31:06 IST
Advertisement

VV Vinayak About Dharmasthala Niyojakavargam Chandrabose: తెలుగులో వస్తున్న లేటెస్ట్ పొలిటికల్ ఎంటర్‌టైనర్ సినిమా ధర్మస్థల నియోజకవర్గం. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మేరుం భాస్తర్ నిర్మించారు.

సెప్టెంబర్ 4న విడుదల

ఆ కారణంతో చంద్రబోస్ ఒక్క రూపాయి తీసుకోకుండా పాటలన్నీ రాశారు.. ధర్మస్థల నియోజకవర్గంపై వీవీ వినాయక్ కామెంట్స్
ఆ కారణంతో చంద్రబోస్ ఒక్క రూపాయి తీసుకోకుండా పాటలన్నీ రాశారు.. ధర్మస్థల నియోజకవర్గంపై వీవీ వినాయక్ కామెంట్స్

ఈ సినిమాలో సుమన్, సాయి కుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షెరు ప్రధాన పాత్రల్లో నటించగా.. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్‌గా ధర్మస్థల నియోజకవర్గం సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ధర్మస్థల నియోజకవర్గం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ వీవీ వినాయక్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో వీవీ వినాయక్, నటుడు రాజీవ్ కనకాల, హీరోయిన్ వితికా షెరు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

చంద్రబోస్ గారు కాల్ చేసి చెప్పారు

"చంద్రబోస్ గారు కాల్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా దర్శకుడు జై జ్ఞాన ప్రభ మంచి సినిమా చేశాడంటూ ఆయన చెప్పారు. కథ బాగా నచ్చి ఈ సినిమాకు ఒక్క రూపాయి తీసుకోకుండా సంతోషంగా అన్ని పాటలు రాసినట్లు చంద్రబోస్ గారు నాతో అన్నారు" అని వీవీ వినాయక్ తెలిపారు.

"నా మొదటి సినిమా ఆదిలో ఫస్ట్ పాట రాసింది చంద్రబోస్ గారే. డైరెక్టర్ జ్ఞాన ప్రభ మొదటి సినిమాకు కూడా చంద్రబోస్ గారే లిరిక్స్ రాశారు. ఈ సినిమా కూడా ఆది అంత ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని వెల్లడించారు దర్శకుడు వీవీ వినాయక్.

ఇదే ఈవెంట్‌లో నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. "ప్రొడ్యూసర్ భాస్కర్ గారు నాగ సినిమాకు మేనేజర్‌గా వర్క్ చేశారు. అప్పటి నుంచి నాకు పరిచయం. ఆ పరిచయంతో ఆయన ప్రొడ్యూసర్‌గా చేస్తున్న సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు" అని అన్నారు.

ఎక్కడో మిస్టేక్స్ చేస్తుంటారు

"కొత్త దర్శకులు కథ బాగా చెప్పినా అది రూపొందించడంలో ఎక్కడో మిస్టేక్స్ చేస్తుంటారు. కానీ, జ్ఞాన ప్రభ మంచి కథను అంతే బాగా తెరకెక్కించారు. ఈ రోజు యువత చూడాల్సిన చిత్రమిది. డ్రగ్స్ గురించి ఇప్పుడు జరుగుతున్నవి ముందే ఊహించి ఈ సినిమాలో తెరకెక్కించాడు జ్ఞాన ప్రభ. ఆయన మరెన్నో మంచి చిత్రాలు రూపొందించాలి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను" అని రాజీవ్ కనకాల ఆకాంక్షించారు.

హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ.. "ఇది నాకు మనసుకు దగ్గరైన సినిమా. నేను చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా. నిజంగా జరిగిన ఒక ఘటన నేపథ్యంగా సమాజానికి మంచిని చెప్పేలా రూపొందించిన ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి" అని చెప్పారు.

ఇది మొదటి సినిమా అనుకోరు

"మా సినిమాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ వెన్నెముకలా నిలిచారు. మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా అదే నమ్మకంతో వర్క్ చేస్తున్నారు. మీరు ఈ సినిమా చూశాక డైరెక్టర్ జ్ఞాన ప్రభ గారికి మొదటి సినిమా అనుకోరు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe