...
...
Next Story

Jiohotstar Trending: ఓటీటీలో వెబ్ సిరీస్‌ల డామినెన్స్‌.. టాప్ 7లో ఏకంగా ఆరు.. కామెడీ నుంచి క్రైమ్ థ్రిల్ల‌ర్ వ‌ర‌కు!

Jiohotstar Trending: ఓటీటీలో వెబ్ సిరీస్ ల డామినెన్స్ మామూలుగా లేదు. డిజిటల్ స్ట్రీమింగ్ లో సిరీస్ లు చూసేందుకు ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌ ట్రెండింగ్ టాప్ 7లో ఏకంగా ఆరు సిరీస్ లు ఉండటం విశేషం.

Published on: Oct 24, 2026, 15:50:43 IST
Advertisement

Jiohotstar Trending: ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం టాప్ 7 ట్రెండింగ్ లిస్ట్‌లో ఏకంగా ఆరు వెబ్ సిరీస్‌లు చోటు సంపాదించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

నంబర్ వన్ స్థానంలో బిగ్ బాస్ తెలుగు 10

ఓటీటీలో వెబ్ సిరీస్‌ల డామినెన్స్‌.. టాప్ 7లో ఏకంగా ఆరు.. కామెడీ నుంచి క్రైమ్ థ్రిల్ల‌ర్ వ‌ర‌కు!
ఓటీటీలో వెబ్ సిరీస్‌ల డామినెన్స్‌.. టాప్ 7లో ఏకంగా ఆరు.. కామెడీ నుంచి క్రైమ్ థ్రిల్ల‌ర్ వ‌ర‌కు!

తెలుగు బుల్లితెరపై అత్యంత క్రేజ్ పొందుతున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 10' ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌ తెలుగులో నంబర్ వన్ ట్రెండింగ్‌గా దూసుకుపోతోంది. సరికొత్త టాస్క్‌లు, కంటెస్టెంట్ల మధ్య డ్రామా, ఎమోషన్స్‌తో ఈ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ అగ్రస్థానంలో నిలిచింది.

వెబ్ సిరీస్ ల జోరు

బిగ్ బాస్ 10వ సీజన్ కు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే జియోహాట్‌స్టార్‌ ఓటీటీ తెలుగులో ఆ షో టాప్ లో ఉండటం ఎక్స్ పెక్ట్ చేసిందే. అయితే ఆ తర్వాత వరుసగా ఆరు స్థానాల్లోనూ వెబ్ సిరీస్ లు ఉండటం మాత్రం ఊహించనిదే.

పార్ట్ టైమర్స్ & హార్ట్ బీట్ సీజన్ 3

బిగ్ బాస్ తర్వాత వరుసగా 'పార్ట్ టైమర్స్' (Part Timers) వెబ్ సిరీస్ రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. యువతను ఆకట్టుకునే కథాంశంతో ఇది తెరకెక్కింది. దీని తర్వాత మెడికల్ డ్రామా నేపథ్యంలో వచ్చిన 'హార్ట్ బీట్ సీజన్ 3' (Heart Beat Season 3) మూడో స్థానాన్ని కైవసం చేసుకుని ప్రేక్షకులను అలరిస్తోంది.

ఆసక్తి రేపుతున్న కోర్ట్, వరం

ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న యానిమేషన్ సిరీస్ 'ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7' (The Legend of Hanuman Season 7) ట్రెండింగ్ లో ఆరవ స్థానంలో నిలిచింది. అద్భుతమైన విజువల్స్‌తో ఈ సీజన్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే 'బ్రదర్స్ అండ్ సిస్టర్స్' (Brothers and Sisters) వెబ్ సిరీస్ ఏడవ స్థానంలో నిలిచి టాప్ 7 ట్రెండింగ్ లిస్ట్‌ను పూర్తి చేసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks