...
...
Next Story

OTT Horror Telugu: ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్- పుర్రె విజిల్ ఊదితే మరణ మృదంగమే-4 భాషల్లో స్ట్రీమింగ్

Whistle OTT Streaming Telugu Today: ఓటీటీలోకి ఇవాళ భయపెట్టే హారర్ థ్రిల్లర్ మిస్టరీ సినిమా విజిల్ తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ విజిల్‌లో పురాతన కాలం నాటి ఒక భయంకరమైన కపాలపు ఈల చుట్టూ తిరుగుతుంది. ఓటీటీ హారర్ లవర్స్‌ను ఆకట్టుకునే విజిల్ ఎక్కడ చూడాలంటే..?

Published on: Jun 12, 2026, 12:27:04 IST
Advertisement

Whistle OTT Release Today In Telugu: హాలీవుడ్ హారర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. 'ది కంజురింగ్', 'ఇన్సిడియస్' వంటి చిత్రాలు థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ భారీ వ్యూస్‌ సాధించాయి.

ఓటీటీలోకి విజిల్

ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్- పుర్రె విజిల్ ఊదితే మరణ మృదంగమే- 4 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్- పుర్రె విజిల్ ఊదితే మరణ మృదంగమే- 4 భాషల్లో స్ట్రీమింగ్

తెలుగు రాష్ట్రాల్లోని సస్పెన్స్, హారర్, మిస్టరీ థ్రిల్లర్ అభిమానులను అలరించేందుకు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్న మరో సరికొత్త భయానక చిత్రం 'విజిల్' (Whistle) ఓటీటీలోకి అడుగుపెట్టింది. అజ్టెక్ నాగరికతకు చెందిన ఒక వింత వస్తువు ఆధారంగా రూపొందిన ఈ సినిమా హారర్ లవర్స్‌కు సరికొత్త భయాన్ని పరిచయం చేస్తోంది.

ఆ పుర్రె ఈల ఊదితే చావు ముంచుకొచ్చినట్లే!

విజిల్ సినిమా కథాంశం చాలా భిన్నంగా, ఆసక్తికరంగా సాగుతుంది. హైస్కూల్‌లో చదువుకునే కొందరు స్నేహితులకు అనుకోకుండా ఒక పురాతన వస్తువు దొరుకుతుంది. అది అజ్టెక్ నాగరికత కాలం నాటి ఒక పురాతన డెత్ విజిల్ (చావు ఈల).

మనుషుల కపాలం (పుర్రె) ఆకారంలో ఉన్న ఆ ఈలను చూసి సరదాగా భావించిన క్రిస్ (డాఫ్నే కీన్) అనే అమ్మాయి, తన స్నేహితులతో కలిసి దాన్ని ఊదుతుంది. ఆ ఈల నుంచి వచ్చే భయంకరమైన శబ్దం వారి జీవితాలు మరణ మృదంగంలోకి వెళ్తాయి.

ఒకరి తర్వాత మరొకరు

ఆ వింత శబ్దం విన్న తర్వాత వారి భవిష్యత్తు చావు రూపంలో వారిని వెంటాడటం మొదలవుతుంది. ఆ ఈలను ఊదిన ప్రతి ఒక్కరూ ఒకరి తర్వాత ఒకరు వింత పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతుంటారు.

ది ఇండిపెండెంట్ ఫిల్మ్ కంపెనీ నిర్మించిన ఈ చిత్రం 2025 ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 6న అమెరికా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన ఈ చిత్రం మార్చి 3, 2026న వీఓడీ (VOD), వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది. 'ది నన్' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హారర్ స్పెషలిస్ట్ దర్శకుడు కోరిన్ హార్డీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.

విజిల్ ఓటీటీ స్ట్రీమింగ్

ఓవెన్ ఎగర్టన్ అందించిన స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. 'లోగన్' సినిమా ఫేమ్ డాఫ్నే కీన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించగా.. సోఫీ నెలిస్సే, స్కై యాంగ్, జాలీల్ స్వాబీ, అలీ స్కోవ్‌బై, పర్సీ హైన్స్ వైట్, మిచెల్ ఫెయిర్లీ, నిక్ ఫ్రాస్ట్ వంటి హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

బ్లాక్ బేర్ పిక్చర్స్ వంటి సంస్థలు ఈ హారర్ థ్రిల్లర్‌ను అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించాయి. ఇంతటి క్రేజ్ ఉన్న విజివల్ ఓటీటీలో ఇదివరకే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో విజిల్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, తాజాగా ఇవాళ తెలుగు భాషలో విజిల్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీషుతోపాటు తెలుగు, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో విజిల్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. వీకెండ్‌లో విభిన్నమైన హారర్ కంటెంట్ చూడాలనుకునే తెలుగు ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోని విజిల్ ఒక మంచి థ్రిల్లింగ్ ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks