...
...
Next Story

Who Is Avinash Agarwal: ట్రంప్‌గా కమెడియన్- ఓటీటీ షోలో అలియా భట్‌కు చుక్కలు- తెగ ట్రెండ్ అవుతున్న అవినాష్ అగర్వాల్ ఎవరు?

Who Is Avinash Agarwal Imitate Donald Trump In OTT Show: ఓటీటీ షో'ఇండియాస్ గాట్ లేటెంట్' సీజన్ 2 గ్రాండ్ ఓపెనింగ్‌లోనే స్టాండప్ కమెడియన్ అవినాష్ అగర్వాల్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అవతారంలో ఆయన వేసిన పంచ్‌లకు సెలబ్రిటీ జడ్జీలు సైతం క్లీన్ బౌల్డ్ అయ్యారు.

Published on: Jun 23, 2026, 12:59:22 IST
Advertisement

Who Is Avinash Agarwal Imitate Donald Trump In OTT Show: డిజిటల్ ప్రపంచంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ ఓటీటీ షో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ (India’s Got Latent) సీజన్ 2 అదిరిపోయే రేటింగ్‌లతో అడుగుపెట్టింది.

సెలబ్రిటీల కంటే కూడా

ట్రంప్‌గా కమెడియన్- ఓటీటీ షోలో అలియా భట్‌కు చుక్కలు- తెగ ట్రెండ్ అవుతున్న అవినాష్ అగర్వాల్ ఎవరు?
ట్రంప్‌గా కమెడియన్- ఓటీటీ షోలో అలియా భట్‌కు చుక్కలు- తెగ ట్రెండ్ అవుతున్న అవినాష్ అగర్వాల్ ఎవరు?

అయితే, మొదటి ఎపిసోడ్‌లోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, యంగ్ బ్యూటీ శార్వరీ వాగ్ వంటి సెలబ్రిటీల కంటే కూడా ఒక సాధారణ కమెడియన్ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఆయనే అవినాష్ అగర్వాల్. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను అచ్చం దించేస్తూ అవినాష్ అగర్వాల్ చేసిన పర్ఫార్మెన్స్ ఇంటర్నెట్‌లో ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

‘ఇండియన్ ట్రంప్’ అని

సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో తనను తాను ‘ఇండియన్ ట్రంప్’ అని పిలుచుకునే అవినాష్ అగర్వాల్‌కు ఈ ఓటీటీ షో ద్వారా రాత్రికి రాత్రే భారీగా ప్రజాదరణ దక్కింది. అయితే, ఆయనకు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఇదివరకే మంచి అనుభవం ఉంది.

కేవలం స్టాండప్ కమెడియన్‌గానే కాకుండా రైటర్, వాయిస్ ఆర్టిస్ట్, ఈవెంట్ హోస్ట్‌గా అవినాష్ అగర్వాల్ సుదీర్ఘ కాలంగా రాణిస్తున్నారు. థియేటర్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అవినాష్ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 200కు పైగా లైవ్ షోలలో ప్రదర్శనలు ఇచ్చారు.

సెలబ్రిటీలతో అనుబంధం..

సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది ప్రముఖుల ఈవెంట్లకు అవినాష్ హోస్ట్‌గా వ్యవహరించారు. మనీషా కోయిరాలా, అభయ్ డియోల్, జానీ లీవర్, అనురాగ్ కశ్యప్ వంటి దిగ్గజాల కార్యక్రమాలను అవినాష్ నడిపించారు. అంతేకాదు, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాలకు సంబంధించిన కొన్ని స్క్రిప్ట్ రైటింగ్ ప్రాజెక్టులలో కూడా ఆయన పనిచేశారు.

అంతర్జాతీయ గుర్తింపు

ఈ ఓటీటీ షోలో ట్రంప్ బాడీ లాంగ్వేజ్, మాట్లాడే శైలిని ఏమాత్రం వదలకుండా జడ్జీలపై అవినాష్ వేసిన రోస్ట్ పంచ్‌లు థియేటర్‌లో నవ్వులు పూయించాయి. గత సీజన్‌లో వివాదాలకు కారణమై షో అర్ధాంతరంగా ముగియడానికి కారణమైన రణ్‌వీర్ అల్లాబాడియాను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.

"షోలో ఆ రణ్‌వీర్ బర్బాడియా లేనందుకు సంతోషంగా ఉంది, అతడిని చూస్తేనే నాకు చిరాకేస్తుంది. అలియా.. నేను నీ రణ్‌బీర్ గురించి అనడం లేదు, అతను మంచివాడు" అని అవినాష్ కౌంటర్ ఇచ్చారు.

అలియా భట్‌కు చుక్కలు

అవినాష్ వేసిన ఒక జోక్‌కు అలియా భట్ సరిగ్గా స్పందించలేక ఇబ్బంది పడుతుంటే.. "ఎవరైనా ఆమెకు ఒక స్క్రిప్ట్, డైరెక్టర్‌ను ఇవ్వండి. అలాగే ఒక యాక్షన్ డైరెక్టర్‌ను కూడా ఇవ్వండి" అని అవినాష్ అనడంతో హాలంతా నవ్వులతో నిండిపోయింది.

మరో జడ్జ్ శార్వరీ వాగ్‌ను ఉద్దెక్కిస్తూ.. "అరవకు, మహిళలు సాధికారత సాధించడం నాకు నచ్చదు" అంటూ ట్రంప్ క్యారెక్టర్‌లోనే ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలకు జడ్జీలతో పాటు ఆడియన్స్ షాక్ తింటూనే ఎంజాయ్ చేశారు.

జడ్జీల నుంచి పర్‌ఫెక్ట్ స్కోర్.. నెట్‌ఫ్లిక్స్‌లో హల్చల్

ఈ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్‌కు జడ్జీల ప్యానెల్ ఫిదా అయిపోయింది. అలియా భట్, కమెడియన్ ఆశిష్ సోలంకి, బలరాజ్ ఘాయ్ ముగ్గురూ అవినాష్‌కు 10కి 10 పర్‌ఫెక్ట్ మార్కులు వేయగా.. శార్వరీ వాగ్ 9.5 పాయింట్లు ఇచ్చారు. దీంతో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ విజేతగా అవినాష్ అగర్వాల్ నిలిచారు.

సమయ్ రైనా హోస్ట్‌గా చేసిన ఈ పూర్తి ఎపిసోడ్ ప్రస్తుతం యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe