Writer Manu Joseph Slams Vijay CM Speech On Poverty: చెన్నై వేదికగా ఆదివారం (మే 10) నాడు తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వేలాది మంది అభిమానులు, రాజకీయ ఉద్దండుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో దళపతి విజయ్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
తొలి ప్రసంగం

ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ చేసిన తొలి ప్రసంగం అక్కడ ఉన్నవారందరినీ కదిలించింది. ముఖ్యంగా హీరోయిన్ త్రిష కృష్ణన్, విజయ్ మాటలు వింటూ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
"ఆకలి అంటే ఏంటో నాకు తెలుసు"
అయితే, విజయ్ తన ప్రసంగంలో తన గతాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. "నాకు పేదరికం అంటే ఏంటో తెలుసు.. ఆకలి విలువ బాగా తెలుసు. నేను ఒక సామాన్య అసిస్టెంట్ డైరెక్టర్ కొడుకును. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను. నా వెనుక ఎలాంటి రాజవంశ చరిత్ర లేదు. నేను మీలో ఒకడిని.. మీ ఇంట్లోని కొడుకును, మీ సోదరుడిని" అంటూ విజయ్ పేర్కొన్నారు.
క్లాస్‌మేట్ బాంబు: "అదంతా వట్టి భ్రమ!"
తన పాలనలో సామాజిక న్యాయం, లౌకికవాదం ప్రధాన అజెండాగా ఉంటాయని దళపతి విజయ్ స్పష్టం చేశారు. అయితే, విజయ్ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే ఆయన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ రచయిత మను జోసెఫ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
"తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తన తొలి ప్రసంగంలో పేదరికంలో పెరిగానని చెప్పడం ఒక పెద్ద అబద్ధం. మేము లోయోలా స్కూల్లో మూడో తరగతి కలిసి చదువుకున్నాం. అతను నా క్లాస్‌మేట్. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ అప్పట్లోనే పేరున్న దర్శకుడు. తన కొడుకును హీరోగా నిలబెట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారు" అని క్రియేటర్ మను జోసెఫ్ బాంబ్ పేల్చారు.
{{/usCountry}}"తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తన తొలి ప్రసంగంలో పేదరికంలో పెరిగానని చెప్పడం ఒక పెద్ద అబద్ధం. మేము లోయోలా స్కూల్లో మూడో తరగతి కలిసి చదువుకున్నాం. అతను నా క్లాస్‌మేట్. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ అప్పట్లోనే పేరున్న దర్శకుడు. తన కొడుకును హీరోగా నిలబెట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారు" అని క్రియేటర్ మను జోసెఫ్ బాంబ్ పేల్చారు.
{{/usCountry}}"సినీ రంగంలో ఒడిదుడుకులు ఉండటం వేరు, అసలైన పేదరికం వేరు. ధనవంతులైన అబ్బాయిలు ఒక్కోసారి చేతిలో డబ్బులు లేకపోవడాన్ని పేదరికంగా పొరబడతారు" అంటూ మను జోసెఫ్ ఎద్దేవా చేశారు. మను జోసెఫ్ కూడా సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. ఆయన తండ్రి జోసెఫ్ మడపల్లి మలయాళ దర్శకుడు.
అవినీతిపై ఉక్కుపాదం
విమర్శలు ఎలా ఉన్నా, విజయ్ తన పరిపాలనపై స్పష్టమైన హామీ ఇచ్చారు. "ప్రజల సొమ్ము నుంచి ఒక్క పైసా కూడా నేను ముట్టుకోను. నా అవసరం ఏంటో మీకు బాగా తెలుసు. నా ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైనా సరే.. అవినీతికి పాల్పడితే అస్సలు సహించను" అని దళపతి విజయ్ హెచ్చరించారు.
ఎంజీఆర్, జయలలిత తరహాలో సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్.. ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి. మరోవైపు విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' త్వరలోనే విడుదల కానుంది. సెన్సార్ ఇబ్బందుల వల్ల ఆలస్యమైన ఈ సినిమాపై ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
రచయిత, స్క్రీన్ ప్లే రైటర్
ఇక సీఎం ప్రమాణస్వీకారంలో పేదరికంపై విజయ్ చేసిన కామెంట్స్ పచ్చి అబద్దం అన్న మను జోసెఫ్ రచయిత, స్క్రీన్ ప్లే రైటర్.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న డీకపుల్డ్ సిరీస్‌ను ఆయనే రూపొందించారు. ఆర్ మాధవన్, సుర్విన్ చావ్లా నటించిన ఈ ఓటీటీ సిరీస్‌కు హార్ధిక్ మెహతా దర్శకత్వం వహించారు.