Wuthering Heights OTT Streaming Details: ప్రపంచ ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కిన ప్రేమ కావ్యం 'వుదరింగ్ హైట్స్' (Wuthering Heights) ఓటీటీలోకి వచ్చేసంది. హాలీవుడ్ స్టార్స్ మార్గోట్ రోబీ, జాకబ్ ఎలోర్డి ప్రధాన పాత్రల్లో నటించిన వుదరింగ్ హైట్స్ ఓటీటీలో ఆకట్టుకుంటోంది.
థియేటర్ల తర్వాత డిజిటల్ విప్లవం

ప్రముఖ దర్శకురాలు ఎమెరాల్డ్ ఫెన్నెల్ దర్శకత్వంలో తెరకెక్కిన వుదరింగ్ హైట్స్ ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. పీరియడ్ రొమాంటిక్ లవ్ రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తన థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ఇప్పుడు ఓటీటీ వేదికపై అదరగొడుతోంది.
వుదరింగ్ హైట్స్ ఓటీటీ రిలీజ్
భారీ చిత్రాలను థియేటర్ల తర్వాత ఓటీటీలోకి తీసుకువచ్చే ట్రెండ్‌లో భాగంగానే వదరింగ్ హైట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఇంటర్నేషనల్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ హెచ్‌వో మ్యాక్స్‌లో వుదరింగ్ హైట్స్ ఓటీటీ రిలీజ్ అయింది. మే 1 నుంచి హెచ్‌బీవో మ్యాక్స్‌లో వుదరింగ్ హైట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ
అంతేకాకుండా హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో కూడా స్థానం సంపాదించుకుని అలరిస్తోంది ఈ రొమాంటిక్ ప్రేమ కావ్యం వుదరింగ్ హైట్స్. ఈ డిజిటల్ రిలీజ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లాసిక్ సాహిత్య ప్రియులకు ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీలోకి రావడం సాధారణమైంది.
కాలాతీత కథ.. ఆధునిక దృక్పథం
అదే బాటలో ఈ చిత్రం కూడా సగటు విడుదల నిబంధనలనే అనుసరిస్తూ డిజిటల్ ప్రేక్షకులను పలకరించింది. ఎమిలీ బ్రోంటే 1847లో రచించిన అద్భుత నవల 'వుదరింగ్ హైట్స్' ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. యార్క్‌షైర్ మూర్స్ నేపథ్యంలోని హీత్‌క్లిఫ్, కేథరీన్ అనే ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే తీవ్రమైన, సంక్లిష్టమైన సంబంధాన్ని ఈ కథలో చూపించారు.
అత్యధికంగా తెరకెక్కిన నవలల్లో
{{/usCountry}}అదే బాటలో ఈ చిత్రం కూడా సగటు విడుదల నిబంధనలనే అనుసరిస్తూ డిజిటల్ ప్రేక్షకులను పలకరించింది. ఎమిలీ బ్రోంటే 1847లో రచించిన అద్భుత నవల 'వుదరింగ్ హైట్స్' ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. యార్క్‌షైర్ మూర్స్ నేపథ్యంలోని హీత్‌క్లిఫ్, కేథరీన్ అనే ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే తీవ్రమైన, సంక్లిష్టమైన సంబంధాన్ని ఈ కథలో చూపించారు.
అత్యధికంగా తెరకెక్కిన నవలల్లో
{{/usCountry}}ఇంగ్లీష్ సాహిత్యంలో అత్యధికంగా వెండితెరపై తెరకెక్కించిన నవలల్లో ఇది ఒకటి. అయితే, ఎమెరాల్డ్ ఫెన్నెల్ ఈ కాలాతీత కథను నేటి తరం ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఆధునిక హంగులతో తెరకెక్కించారు. ప్రేమ, పగ, సామాజిక అంతరాలు వంటి అంశాలను ఇందులో లోతుగా చర్చించారు.
ఆకర్షణీయమైన తారాగణం
వుదరింగ్ హైట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మార్గోట్ రోబీ, జాకబ్ ఎలోర్డి. కేథరీన్‌గా మార్గోట్ రోబీ తనదైన శైలిలో నటనను పండించగా, హీత్‌క్లిఫ్ పాత్రలో జాకబ్ ఎలోర్డి ఒదిగిపోయారు.
ప్లస్ పాయింట్‌గా కెమిస్ట్రీ
మార్గోట్ రోబీ తన విభిన్న పాత్రల ఎంపికతో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగా, ఆమె ఈ క్లాసిక్ రోల్‌ను ఎలా పోషించిందనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.