OTT Romantic: ఓటీటీలోకి వచ్చిన పీరియాడిక్ రొమాంటిక్ రివేంజ్ లవ్ డ్రామా- కాలాతీత కథకు ఆధునిక హంగులు-స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Wuthering Heights OTT Streaming Details: ఓటీటీలోకి పీరియాడిక్ రొమాంటిక్ రివేంజ్ లవ్ డ్రామా చిత్రం వుదరింగ్ హైట్స్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అలాగే ఓటీటీ ట్రెండింగ్‌లో కూడా ఈ మూవీ స్థానం సంపాదించుకుంది. కాలాతీత కథకు ఆధునిక హంగులు అద్ది తెరకెక్కించిన వుదరింగ్ హైట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.

Published on: May 7, 2026, 14:44:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Wuthering Heights OTT Streaming Details: ప్రపంచ ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కిన ప్రేమ కావ్యం 'వుదరింగ్ హైట్స్' (Wuthering Heights) ఓటీటీలోకి వచ్చేసంది. హాలీవుడ్ స్టార్స్ మార్గోట్ రోబీ, జాకబ్ ఎలోర్డి ప్రధాన పాత్రల్లో నటించిన వుదరింగ్ హైట్స్ ఓటీటీలో ఆకట్టుకుంటోంది.

ఓటీటీలోకి వచ్చిన పీరియాడిక్ రొమాంటిక్ రివేంజ్ లవ్ డ్రామా- కాలాతీత కథకు ఆధునిక హంగులు-స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి వచ్చిన పీరియాడిక్ రొమాంటిక్ రివేంజ్ లవ్ డ్రామా- కాలాతీత కథకు ఆధునిక హంగులు-స్ట్రీమింగ్ ఎక్కడంటే?

థియేటర్ల తర్వాత డిజిటల్ విప్లవం

ప్రముఖ దర్శకురాలు ఎమెరాల్డ్ ఫెన్నెల్ దర్శకత్వంలో తెరకెక్కిన వుదరింగ్ హైట్స్ ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. పీరియడ్ రొమాంటిక్ లవ్ రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తన థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ఇప్పుడు ఓటీటీ వేదికపై అదరగొడుతోంది.

వుదరింగ్ హైట్స్ ఓటీటీ రిలీజ్

భారీ చిత్రాలను థియేటర్ల తర్వాత ఓటీటీలోకి తీసుకువచ్చే ట్రెండ్‌లో భాగంగానే వదరింగ్ హైట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఇంటర్నేషనల్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ హెచ్‌వో మ్యాక్స్‌లో వుదరింగ్ హైట్స్ ఓటీటీ రిలీజ్ అయింది. మే 1 నుంచి హెచ్‌బీవో మ్యాక్స్‌లో వుదరింగ్ హైట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ

అంతేకాకుండా హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో కూడా స్థానం సంపాదించుకుని అలరిస్తోంది ఈ రొమాంటిక్ ప్రేమ కావ్యం వుదరింగ్ హైట్స్. ఈ డిజిటల్ రిలీజ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లాసిక్ సాహిత్య ప్రియులకు ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీలోకి రావడం సాధారణమైంది.

కాలాతీత కథ.. ఆధునిక దృక్పథం

అదే బాటలో ఈ చిత్రం కూడా సగటు విడుదల నిబంధనలనే అనుసరిస్తూ డిజిటల్ ప్రేక్షకులను పలకరించింది. ఎమిలీ బ్రోంటే 1847లో రచించిన అద్భుత నవల 'వుదరింగ్ హైట్స్' ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. యార్క్‌షైర్ మూర్స్ నేపథ్యంలోని హీత్‌క్లిఫ్, కేథరీన్ అనే ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే తీవ్రమైన, సంక్లిష్టమైన సంబంధాన్ని ఈ కథలో చూపించారు.

అత్యధికంగా తెరకెక్కిన నవలల్లో

ఇంగ్లీష్ సాహిత్యంలో అత్యధికంగా వెండితెరపై తెరకెక్కించిన నవలల్లో ఇది ఒకటి. అయితే, ఎమెరాల్డ్ ఫెన్నెల్ ఈ కాలాతీత కథను నేటి తరం ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఆధునిక హంగులతో తెరకెక్కించారు. ప్రేమ, పగ, సామాజిక అంతరాలు వంటి అంశాలను ఇందులో లోతుగా చర్చించారు.

ఆకర్షణీయమైన తారాగణం

వుదరింగ్ హైట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మార్గోట్ రోబీ, జాకబ్ ఎలోర్డి. కేథరీన్‌గా మార్గోట్ రోబీ తనదైన శైలిలో నటనను పండించగా, హీత్‌క్లిఫ్ పాత్రలో జాకబ్ ఎలోర్డి ఒదిగిపోయారు.

ప్లస్ పాయింట్‌గా కెమిస్ట్రీ

మార్గోట్ రోబీ తన విభిన్న పాత్రల ఎంపికతో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగా, ఆమె ఈ క్లాసిక్ రోల్‌ను ఎలా పోషించిందనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More