...
...
Next Story

Yami Gautam Nayi Naveli: వదిన మాంత్రికురాలు, మరిది అన్వేషణ- దసరా బరిలో యామీ గౌతమ్ హారర్ కామెడీ ఫాంటసీ మూవీ నయీ నవేలి

Yami Gautam Nayi Naveli Release Date Announced: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం 'నయీ నవేలి' విడుదల తేదీ ఖరారైంది. అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 2026 దసరా బరిలో నిలవనుంది.

Published on: Aug 20, 2026, 12:36:11 IST
Advertisement

Yami Gautam Nayi Naveli Release Date Announced: పండుగ సీజన్ వస్తోందంటే చాలు బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి వినోదాన్ని ఆస్వాదించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే వచ్చే దసరా పండుగను టార్గెట్ చేస్తూ ఒక అద్భుతమైన హారర్ ఫాంటసీ కామెడీ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు బాలీవుడ్ వర్గాలు సిద్ధమయ్యాయి.

డైరెక్టర్ ఆదిత్య ధర్ సతీమణి

వదిన మాంత్రికురాలు, మరిది అన్వేషణ- దసరా బరిలో యామీ గౌతమ్ హారర్ కామెడీ ఫాంటసీ మూవీ నయీ నవేలి
వదిన మాంత్రికురాలు, మరిది అన్వేషణ- దసరా బరిలో యామీ గౌతమ్ హారర్ కామెడీ ఫాంటసీ మూవీ నయీ నవేలి

బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్, డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య యామీ గౌతమ్ ధర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'నయీ నవేలి'. దీనికి తెలుగులో నవ వధువు లేదా కొత్త పెళ్లికూతురు అని అర్థం వస్తోంది. అమెజాన్ ఎంజీఎమ్ స్టూడియోస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నయీ నవేలి సినిమాను 2026 అక్టోబర్ 16న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

వదినగారు మాంత్రికురాలా? నవ్వులు పూయించే వింత కథ!

నయీ నవేలి సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉండనుందట. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఉన్న ఒక కుటుంబంలోకి కొత్తగా పెళ్లై ఒక కోడలు అడుగుపెడుతుంది. ఆమె రాకతో ఆ ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, అందంగా మారిపోతుంది.

ఏదో రహస్యం దాగుంది

అయితే ఎంతో ఆదర్శంగా, పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్న తన వదినగారు మాంత్రికురాలు అని, ఆమె వెనుక ఏదో రహస్యం దాగి ఉందనే అనుమానం ఆమె మరిదికి మొదలవుతుంది. అసలు ఆమె ఏమైనా మాంత్రికురాలా అనే సందేహంతో మొదలైన ఆ అన్వేషణ, ఆ ఇంట్లో ఎలాంటి వింతలకు దారితీసింది? ఆ కుటుంబంలో ఎలాంటి నవ్వుల హంగామా సృష్టించింది? అనే అంశాలను దర్శకుడు బాలాజీ మోహన్ తెరపై ఎంతో సరదాగా ఆవిష్కరించనున్నారు.

యామీ గౌతమ్ పర్ఫెక్ట్ ఛాయిస్

బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిమాన్షు శర్మతో కలిసి దివ్య నిధి శర్మ ఈ వినోదాత్మక కథను అందించగా, దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ ఓ పాటకు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

వేరే ఏ తేది సినిమాకు పూర్తి న్యాయం చేయలేదు

"ఈ సినిమా చూశాక, ఇది కచ్చితంగా దసరా పండుగకే విడుదల చేయాల్సిన చిత్రమని మాకు అర్థమైంది. వేరే ఏ తేదీ ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయలేదు. యామీ గౌతమ్ తన అద్భుత నటనతో అలరించారు" అని అమెజాన్ MGM స్టూడియోస్ ప్రతినిధి నిఖిల్ మధోక్ తెలిపారు.

హారర్, కామెడీ, ఫాంటసీకి ఫ్యామిలీ ఎమోషన్

తెలుగునాట కూడా పండుగల సమయంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. వినోదం, హారర్, ఫాంటసీ, కుటుంబ భావోద్వేగాలు కలగలిసి వస్తున్న 'నయీ నవేలి' థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe