Yami Gautam Nayyi Navelli Trailer Released: జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుని మంచి ఫామ్‌లో ఉన్న బాలీవుడ్ భామ యామీ గౌతమ్ మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మిస్టరీ ఫ్యామిలీ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ 'నయ్యి నవెల్లి' ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
కథేంటంటే?

ఇప్పటివరకు గంభీరమైన, సీరియస్ పాత్రలతో మెప్పించిన బ్యూటిఫుల్ యామీ గౌతమ్ ఈసారి కామెడీ, భయం కలగలిపిన సరికొత్త అవతారంలో అలరించేందుకు వస్తున్నారు. నయ్యి నవెల్లి ట్రైలర్ పరిశీలిస్తే, అవాస్థి కుటుంబంలోకి మోహిని (యామీ గౌతమ్) కొత్త కోడలిగా అడుగుపెట్టడంతో కథ ప్రారంభమవుతుంది.
కొత్త కోడలి రూపంలో వింత ప్రవర్తన..
ఇంట్లోని వారంతా కొత్త కోడలికి ఆనందంగా ఘన స్వాగతం పలుకుతారు. చూడటానికి ఎంతో పద్ధతిగా, అమాయకంగా కనిపించే ఆ కొత్త కోడలి ప్రవర్తనలో మెల్లమెల్లగా వింత మార్పులు మొదలవుతాయి. ఆమె సాధారణ మనిషి కాదని, ఏదో చేతబడి చేసే దెయ్యం (డాకిని) లేదా మంత్రగత్తె అయి ఉంటుందనే అనుమానాలు కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతాయి.
కుటుంబ బంధాలు, వినోదం మధ్య సాగే ఈ కథలో మోహిని అసలు నిజరూపం ఏమిటి? ఆమె చుట్టూ అల్లుకున్న రహస్యాలేంటి? అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్‌ను కట్ చేశారు. సీనియర్ నటీనటులు సునీతా రాజ్‌వర్, మీతా వసిష్ఠ్, సుస్మితా ముఖర్జీ, ఆదినాథ్ ఎం కోఠారే, అనురాగ్ ఠాకూర్, ఆదిత్య కులశ్రేష్ఠ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
హైలెట్ సీన్స్
ఇంట్లోని బామ్మ కాలికి మోహిని చేయి తగలగానే నయం కావడం, క్షణాల్లో ఇంటి సభ్యులందరికి భారీగా విందు రెడీ చేయడం వంటివి ఇంట్రెస్టింగ్గా చూపించారు. అలాగే, మోహిని అసలు స్వరూపం ఎలా ఉంటుందో చూపించే సీన్ కామెడీతోపాటు భయపెట్టేలా ఉంది. రావణాసూరుడితో జరిగే ఫైట్ సీన్ హైలెట్‌గా నిలిచింది.
"నా కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన పాత్ర" - యామీ గౌతమ్
{{/usCountry}}ఇంట్లోని బామ్మ కాలికి మోహిని చేయి తగలగానే నయం కావడం, క్షణాల్లో ఇంటి సభ్యులందరికి భారీగా విందు రెడీ చేయడం వంటివి ఇంట్రెస్టింగ్గా చూపించారు. అలాగే, మోహిని అసలు స్వరూపం ఎలా ఉంటుందో చూపించే సీన్ కామెడీతోపాటు భయపెట్టేలా ఉంది. రావణాసూరుడితో జరిగే ఫైట్ సీన్ హైలెట్‌గా నిలిచింది.
"నా కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన పాత్ర" - యామీ గౌతమ్
{{/usCountry}}ఈ సినిమాలో తాను పోషించిన మోహిని పాత్ర గురించి యామీ గౌతమ్ స్పందిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "మనం ఊహించిన దానికి పూర్తి భిన్నంగా మోహిని పాత్ర ఉంటుంది. పైకి ఎంతో ఆప్యాయంగా కనిపిస్తూనే, తనలో ఒక విచిత్రమైన రహస్య గుణాన్ని దాచుకుంటుంది. కుటుంబ బంధాలు, హాస్యం, భావోద్వేగాలు, ఫాంటసీ, యాక్షన్.. ఇలా అన్ని రకాల వేరియేషన్లు ప్రదర్శించే అవకాశం 'నయ్యి నవెల్లి' ద్వారా నాకు దక్కింది" అని యామీ గౌతమ్ తెలిపారు.
దసరా బరిలో భారీ పోటీ.. అక్టోబర్ 16న విడుదల
ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ సంయుక్తంగా నిర్మించిన నయి నవెల్లి చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ అందించిన స్క్రీన్‌ప్లే ఈ హారర్ డ్రామాకు ప్రధాన బలంగా నిలవనుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అజయ్ దేవగన్, రజనీకాంత్‌తో పోటీ
అయితే ఈ దసరా సీజన్‌లో అజయ్ దేవగన్ 'దృశ్యం: ది కన్‌క్లూజన్', రజనీకాంత్ 'జైలర్ 2' వంటి భారీ చిత్రాలు కూడా బాక్సాఫీస్ బరిలో దిగే అవకాశం ఉండటంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. అయినప్పటికీ, వినూత్నమైన కాన్సెప్ట్ కావడంతో నయీ నవేలి సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.