Toxic Accident: టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం- కూలిన భారీ స్పీకర్ స్టాండ్, ఇద్దరికి విరిగిన కాళ్లు- ఆరా తీసిన హీరో యశ్!

Accident In Toxic Pre Release Event Yash Reaction: యశ్ టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భారీ సౌండ్ బాక్స్ స్టాండ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు అభిమానులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఘటనను గమనించిన హీరో యశ్ వెంటనే తన ప్రసంగాన్ని నిలిపివేసి బాధితులకు సాయం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.

Published on: Aug 23, 2026, 11:15:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Accident In Toxic Pre Release Event Yash Reaction: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శనివారం (ఆగస్ట్ 22) హైదరాబాద్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుల్లపల్లిలోని మల్లారెడ్డి కాలేజ్ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.

టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం- కూలిన భారీ స్పీకర్ స్టాండ్, ఇద్దరికి విరిగిన కాళ్లు- ఆరా తీసిన హీరో యశ్!
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం- కూలిన భారీ స్పీకర్ స్టాండ్, ఇద్దరికి విరిగిన కాళ్లు- ఆరా తీసిన హీరో యశ్!

సౌండ్ బాక్స్ స్టాండ్ కూలి అభిమానులకు తీవ్ర గాయాలు

వేలాదిగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో సభ జరుగుతుండగా ఒక ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా వేదికపై ఉన్న దృశ్యాలను స్పష్టంగా చూడటం కోసం కొందరు అభిమానులు భారీ ఫ్లయింగ్ డీజే స్పీకర్ స్టాండ్ పైకి ఎక్కారు.

అంతేకాకుండా దానిపై నిలబడి కొందరు స్టంట్స్ చేసేందుకు ప్రయత్నించారు. ఓవర్ లోడ్ కావడంతో ఆ భారీ సౌండ్ బాక్స్ సెట్ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. పైనుంచి కిందపడటంతో ఇద్దరు వ్యక్తులకు కాళ్లు విరిగిపోగా, మరో ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి.

వీడియోలు వైరల్

ఈ హఠాత్ పరిణామంతో అక్కడ ఒక్కసారిగా తోక్కిసలాట వాతావరణం నెలకొంది. అలర్ట్ అయిన సైబరాబాద్ పోలీసులు, నిర్వాహకులు గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ప్రసంగాన్ని ఆపేసి సాయం కోరిన హీరో యశ్

అయితే, టాక్సిక్ ఈవెంట్ స్టేజ్‌పై మైక్ పట్టుకుని అభిమానులను ఉద్దేశించి హీరో యశ్ మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సౌండ్ బాక్స్ కూలిపోవడం చూసిన యశ్ వెంటనే తన స్పీచ్‌ను మధ్యలోనే ఆపేసి గాయపడ్డ వారి క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు.

"అక్కడ ఉన్నవారికి ఏమైనా అయిందా? ముందుగా వారిని వెళ్లి చూడండి. గాయపడిన వారికి సాయం అందించండి" అని నిర్వాహకులకు యశ్ వేదికపై నుంచే సూచించారు. అనంతరం మైదానంలో ఉన్న ఇతర స్పీకర్ స్టాండ్ల పైకి కూడా కొంతమంది అభిమానులు ఎక్కేందుకు ప్రయత్నించడం గమనించిన యశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రాణాలకంటే ఏది ఎక్కువ కాదు

ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదని, దయచేసి కిందకి దిగాలని అభిమానులను వేడుకున్నారు యశ్. అక్కడ వాతావరణం ప్రశాంతంగా మారిన తర్వాతే యశ్ తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

రికార్డు స్థాయి బుకింగ్స్‌తో 'టాక్సిక్' హవా!

ఇదిలా ఉంటే, కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ వంటి భారీ తారగణం నటిస్తోంది.

విడుదలకు ముందే టాక్సిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న టాక్సిక్ సినిమా ముందస్తు బుకింగ్స్ ఆరంభమైన మొదటి రోజే రూ.18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి రికార్డు నెలకొల్పింది.

ప్రేమ, ప్రతికారం

తండ్రీకొడుకుల అనుబంధం, ప్రేమ, ప్రతికారం నేపథ్యంలో తెరకెక్కిన టాక్సిక్ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో, మూడు డిఫరెంట్ గెటప్పులతో యశ్ ఏ విధంగా అట్రాక్ట్ చేస్తాడో వేచి చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More