...
...
Next Story

Yesha Nagula Song Lyrics: యూట్యూబ్‌లో నెంబర్ 1, 16 మిలియన్ వ్యూస్- నాని, కీర్తి సురేష్ ఏష నాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్

The Paradise Yesha Nagula Song Lyrics Telugu: ది ప్యారడైజ్ సినిమా నుంచి ఏష నాగుల సాంగ్ తాజాగా విడుదలైంది. నాని, కీర్తి సురేష్ మాస్ బీట్స్‌తో దుమ్ములేపుతున్న ఈ సాంగ్ యూట్యూబ్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. మరి ఇంతటీ క్రేజ్ తెచ్చుకున్న ఏష నాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్‌పై ఓ లుక్కేద్దాం.

Published on: Aug 30, 2026, 08:10:45 IST
Advertisement

Nani Keerthy Suresh The Paradise Yesha Nagula Song Lyrics Telugu: నేచురల్ స్టార్ నాని, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదలైన ఆయా షేర్ సాంగ్ రికార్డ్ లెవెల్‌లో హిట్ కాగా తాజాగా మరో పాటను దించారు మేకర్స్.

సూపర్ హిట్ తెలంగాణ ఫోక్ సాంగ్

యూట్యూబ్‌లో నెంబర్ 1, 16 మిలియన్ వ్యూస్- నాని, కీర్తి సురేష్ ఏష నాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్
యూట్యూబ్‌లో నెంబర్ 1, 16 మిలియన్ వ్యూస్- నాని, కీర్తి సురేష్ ఏష నాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్

తెలంగాణలో సూపర్ హిట్ అయిన ఫోక్ సాంగ్ ఏష నాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్‌ను మార్చి ది ప్యారడైజ్‌ నుంచి తాజాగా విడుదల చేశారు. ఏష నాగుల కట్ట మీద హుక్ లైన్ వాడుకుని చాలా వరకు లిరిక్స్ మార్చి పాటను రాశారు ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్. జంగిరెడ్డి, ప్రభ అద్భుతంగా ఆలపించారు. అలాగే, అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్, మాస్ బీట్స్ ఆడియెన్స్‌ను హుషారెత్తించేలా ఉన్నాయి.

నెంబర్ 1గా ఏష నాగుల సాంగ్

ఆగస్ట్ 29న విడుదలైన ఏష నాగుల (Yeshanagula Song) సాంగ్ యూట్యూబ్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. విడుదలైన 16 గంటల్లో ఏష నాగుల సాంగ్ 16 మిలియన్ వ్యూస్ సాధించి సూపర్ హిట్‌గా దూసుకుపోతోంది. అంతేకాకుండా ఈ పాటలో నాని, కీర్తి సురేష్ వేసిన మాస్ బీట్స్, డ్యాన్స్ తెగ అలరిస్తున్నాయి. ఇంతటీ క్రేజ్ తెచ్చుకుంటోన్న ఏష నాగుల సాంగ్ లిరిక్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.

ఏష నాగుల సాంగ్ లిరిక్స్:

పల్లవి

గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో..

జిమ్మెదరీ పటేలో జిమ్మెదరీ పటేలా..

నీతోవల నా సూపులు కావలున్నయో..

అర్రల గుడ్డిదీపమయ్యిందిర పాణం..

ఒర్రిన ఇంట్ల లేదు ఏందీ పాపం..

బుడ్డపరకల కూర ఒండిన నీకోసం..

బుడమట్లబువ్వతోని తిని పో కొంచెం..

ఓ బుజ్జవ్వా మరి సద్దికట్టుకొని రారాదు..

ఎక్కడికో..

ఏష నాగుల... ఏష నాగుల... ఏష నాగుల... ఏష ఏష ఏష

ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల...

ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల...

ఏష నాగుల కట్ట మీద.. ఏష నాగుల కట్ట మీద.. ఏష నాగుల కట్ట మీద.. ఒహో ఏష నాగుల కట్ట మీద..

ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల...

ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల...

చరణం 1

మొన్న నువ్వు సెమటలు తుడుసుకున్న నా వాయిల్ చీర

సింగులే సెక్కంగ చిక్కున పడెరో...

నిన్న నీ వేలను తలుసుకొని నా జబ్బల రైక

హుక్కులే ఉట్టుట్టిగ తెగిపోయినరో...

మొన్న గుస గుస ముచ్చటంత గుర్తుకొస్తెరా

చెవి సత్తుకమ్మ నొప్పి జామ్మని మొత్తుకుందిరా...

నువ్వే దొర్లిపోయిన బొంతనింక సదురలేదురా..

ఇయ్యాల రాకపోతే పక్క మీద నేను సత్తరా...

ఘుమ ఘుమ నీ వాసన మోసిన నా ఒళ్లు...

ఇనడం మర్చిపాయె ఎచ్చని నీళ్లు...

గున గున నువ్ తిరిగిన నా ఇరుకు ఇళ్లు

ఏరుకుంటాందిరా నీ ఎంగిలి పూలు

నీ రంది తీర్చనీకీ నా దగ్గర మందుందే బుజ్జవ్వా..

ఏందో అది...

దొరల్ తాగే దొరల్ తాగే దొరల్ తాగే...

దొరల్.. దొరల్.. దొరల్.. దొరల్..

దొరల్ తాగే ఇప్పసారాయి తాగుదమే బాల... మనం ఊగుదమే బాల...

దొరల్ తాగే ఇప్పసారాయి తాగుదమే బాల... మనం ఊగుదమే బాల...

దొరల్ తాగే ఇప్పసారాయి.. దొరల్ తాగే ఇప్పసారాయి.. దొరల్ తాగే ఇప్పసారాయి.. దొరల్ తాగే ఇప్పసారాయి

ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల...

ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల...

ది ప్యారడైజ్ రిలీజ్ డేట్

ఇలా ఏష నాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, ది ప్యారడైజ్ సినిమాను ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో నానికి హీరోయిన్‌గా కయాదు లోహర్ హీరోయిన్‌గా చేయగా.. విలన్‌గా మోహన్ బాబు నటించారు. సెప్టెంబర్ 24న చాలా గ్రాండ్‌గా ది ప్యారడైజ్ సినిమా విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks