సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ హీరోలుగా, కథనాయకులు దర్శకులుగా రాణిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ కాగా పలువురు నటులుగా ఎదిగారు. అలాగే, యూట్యూబర్స్ కూడా నటులుగా తమను తాము నిరూపించుకుంటున్నారు.
నటుడిగా యూట్యూబ్ యాంకర్

అలా ఓ యూట్యూబ్ యాంకర్ కూడా నటుడిగా మారాడు. అతనే చందు. యూట్యూబ్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న చందు నటించిన లేటెస్ట్ మూవీ కిల్లర్. గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా అలరించిన నటి జ్యోతి పూర్వజ్. బ్యూటిపుల్ జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా చేస్తున్న కిల్లర్ మూవీలో చందు ఓ పాత్ర చేశాడు.
ఈ కిల్లర్ సినిమాకు సుకు పూర్వజ్ దర్శకత్వం వహించారు. ఆయన ఇంతకుముందు శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్, ఏ మాస్టర్ పీస్ రైజ్ ఆఫ్ సూపర్ హీరో సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా కిల్లర్ మూవీని డైరెక్ట్ చేశారు దర్శకుడు సుకు పూర్వజ్.
కిల్లర్ నటీనటులు
జ్యోతి పూర్వజ్, సుకు పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రూల్స్‌లో నటించిన కిల్లర్ మూవీలో చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, యాంకర్ చందు ఇతర పాత్రల్లో నటించారు. కిల్లర్ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి నిర్మించారు.
ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరించిన కిల్లర్ సినిమాను త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. అయితే, ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా కిల్లర్ మూవీ నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో యాంకర్ చందు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
జ్యోతి గారి నట విశ్వరూపం చూస్తారు
{{/usCountry}}ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరించిన కిల్లర్ సినిమాను త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. అయితే, ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా కిల్లర్ మూవీ నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో యాంకర్ చందు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
జ్యోతి గారి నట విశ్వరూపం చూస్తారు
{{/usCountry}}నటుడు చందు మాట్లాడుతూ.. "ఇప్పటిదాకా మీరు సినిమాల్లో చూడని కంటెంట్ ఈ కిల్లర్ మూవీలో చూస్తారు. జ్యోతి గారి నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూస్తారు" అని అన్నాడు.
"నేను పూర్వజ్ గారిని ఇంటర్వ్యూ చేసిన టైమ్‌లో నీకు యాక్టింగ్‌లో ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. ఆయన చేసిన నాలుగు సినిమాల్లో మూడింటిలో అవకాశం కల్పించారు. సుకు గారికి థ్యాంక్స్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక నన్ను యాక్టర్ చందుగా ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు" అని యూట్యూబ్ యాంకర్ చందు చెప్పాడు.
కిల్లర్ నిర్మాత కామెంట్స్
ప్రొడ్యూసర్ పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ.. "మనం లైఫ్‌లో గర్వపడే సందర్భాలు కొన్ని ఉంటాయి. పూర్వజ్‌ను ఇంట్రడ్యూస్ చేసినందుకు నేను గర్వపడుతున్నా. తనతో కెరీర్ ప్రారంభించిన వారందరినీ తన మూవీలో ఉండేలా చూసుకోవడం పూర్వజ్ ప్రత్యేకత" అని తెలిపారు.
"ఈ సినిమా ప్రారంభించినప్పుడు కూడా ఇంత బాగా అవుట్‌పుట్ వస్తుందని అనుకోలేదు. ఈ పాటలో చూపించినట్లు ఫైర్, ఐస్ తనలోనూ ఉన్నాయి. కిల్లర్ మూవీలోని విజువల్స్, సాంగ్స్ వంటి అవుట్‌పుట్ చూసి సర్‌ప్రైజ్ అయ్యాం. ఈ సినిమాలో కిల్లర్ పర్‌ఫార్మెన్స్‌లు చూస్తారు" అని కిల్లర్ నిర్మాత పద్మనాభ రెడ్డి అన్నారు.