శరీరంలో మునుపటి లాంటి సత్తా లేదనో, లేక మోకాళ్ల నొప్పులనో వృద్ధాప్యం రాగానే చాలామంది శారీరక శ్రమకు దూరం జరుగుతారు. కానీ, వయసు పెరిగేకొద్దీ వ్యాయామం మరింత అవసరమని చెబుతున్నారు ముంబైకి చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆకాష్ సింగ్. ఆయన క్లినిక్‌కు వచ్చే ఒక 90ఏళ్ల వృద్ధుడు జిమ్‌లో కుర్రాళ్లకు పోటీగా కఠినమైన వ్యాయామాలు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వయసులోనూ ఆయన చూపిస్తున్న పట్టుదల, క్రమశిక్షణ చూసి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులను, నానమ్మ, తాతయ్యలను కూడా ఇలాంటి ఫిట్‌నెస్ వైపు ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఈ వీడియో గుర్తుచేస్తోంది.
జిమ్ అంటే కేవలం సిక్స్ ప్యాక్ కోసం కాదు!

"జిమ్ అనేది కేవలం సిక్స్ ప్యాక్ బాడీ బిల్డర్ల కోసం, యువత కోసం మాత్రమే అనుకోవడం ఒక పెద్ద అపోహ," అని డాక్టర్ ఆకాష్ పేర్కొన్నారు. ఈ 90 ఏళ్ల వృద్ధుడు జిమ్‌లో మొబిలిటీ డ్రిల్స్, అసిస్టెడ్ స్క్వాట్స్, రెసిస్టెన్స్ బ్యాండ్ రోయింగ్, డంబెల్స్ వంటి ఎన్నో రకాల స్ట్రెంత్, కోర్ బిల్డింగ్ వ్యాయామాలను అలవోకగా చేస్తున్నారని అన్నారు. వృద్ధాప్యంలో జిమ్‌కు వెళ్లడం అంటే అందంగా కనిపించడం కోసం కాదు, రోజువారీ పనులను ఎవరి సహాయం లేకుండా చేసుకోగలిగేలా కండరాల బలాన్ని పెంచుకోవడం కోసమని ఆయన వివరించారు.
వృద్ధులు వ్యాయామం చేయడం వల్ల కలిగే టాప్ 5 ప్రయోజనాలు:
వృద్ధాప్యంలో వ్యాయామం ఆపేయడం వల్లే శరీరం మరింత బలహీనపడుతుందని, నిరంతరం కదలికల్లో ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
{{/usCountry}}వృద్ధాప్యంలో వ్యాయామం ఆపేయడం వల్లే శరీరం మరింత బలహీనపడుతుందని, నిరంతరం కదలికల్లో ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
{{/usCountry}}ఆత్మవిశ్వాసం, స్వతంత్రత: ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకునే శారీరక బలం లభిస్తుంది.
కదలికల్లో చురుకుదనం: శరీరంలో నొప్పులు, కీళ్ల బిగుతు తగ్గి, నడవడానికి, వంగడానికి అవసరమైన ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
బలమైన ఎముకలు, కండరాలు: వయసుతో పాటు వచ్చే కండరాల క్షీణతను అడ్డుకుని, ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తుంది.
నొప్పుల నుంచి ఉపశమనం: దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల తీవ్రత తగ్గుతుంది.
దీర్ఘాయువు: శారీరక శ్రమ వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, బీపీ వంటి ముప్పులు తగ్గి, ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితాన్ని గడపవచ్చు.
"మనం ముసలివాళ్లం అయ్యామని వ్యాయామం ఆపము.. వ్యాయామం ఆపేయడం వల్లే ముసలివాళ్లం అవుతాం," అని డాక్టర్ ఆకాష్ వ్యాఖ్యానించారు. 18 ఏళ్ల వారైనా, 89 ఏళ్ల వారైనా స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది అందరికీ అవసరమని స్పష్టం చేశారు.
నెటిజన్లు ఏమంటున్నారంటే..
ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన కొద్దిసేపట్లోనే విపరీతంగా వైరల్ అయింది. ఈ వృద్ధుడి ఎనర్జీ లెవెల్స్ చూసిన ఒక నెటిజన్.. "ఈ తాత తన వయసును ఓ పదేళ్లు వెనక్కి నెట్టేసారు," అని కామెంట్ చేయగా.. "నిజమైన ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఈయనే, మన తల్లిదండ్రుల ఫోన్ ఫీడ్‌లో ఇలాంటి వీడియోలే రావాలి," అని మరొకరు రాసుకొచ్చారు. అమెరికాకు చెందిన ప్రముఖ ‘జాన్స్ హాప్‌కిన్స్’ నివేదిక ప్రకారం.. కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వృద్ధుల్లో నిద్రలేమి, ఒత్తిడి సమస్యలు తగ్గి, ప్రమాదవశాత్తు కిందపడిపోయే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని తేలింది.