Actor: 60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ ఎందుకు? నైపుణ్యానికి విలువ లేదు- బాలీవుడ్ హీరోలు, ప్రేక్షకుల తీరును ఎండగట్టిన నటుడు

Avinash Tiwary Slams Bollywood Six Pack Obsession: బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం టాలెంట్‌ను కాకుండా కేవలం బాక్సాఫీస్ లెక్కలను, శారీరక ఆకృతిని మాత్రమే నమ్ముకుంటోందని నటుడు అవినాష్ తివారీ మండిపడ్డారు. ముఖ్యంగా వయసు పైబడిన హీరోలు సిక్స్ ప్యాక్ మోజులో పడటంపై అవినాష్ తివారీ తీవ్ర విమర్శలు చేశారు.

Published on: Apr 26, 2026, 20:38:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Avinash Tiwary Slams Bollywood Six Pack Obsession: హిందీ చిత్ర పరిశ్రమలో నటన కంటే బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నటుడు అవినాష్ తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్ తివారీ, బాలీవుడ్ హీరోల తీరును ఇతర ఇండస్ట్రీలతో పోల్చారు.

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ ఎందుకు? నైపుణ్యానికి విలువ లేదు- బాలీవుడ్ హీరోలు, ప్రేక్షకుల తీరును ఎండగట్టిన నటుడు
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ ఎందుకు? నైపుణ్యానికి విలువ లేదు- బాలీవుడ్ హీరోలు, ప్రేక్షకుల తీరును ఎండగట్టిన నటుడు

వాళ్లు వెంపర్లాడటం చూశారా?

"ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా 60 ఏళ్ల వయసున్న వారు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ బాడీల కోసం వెంపర్లాడటం చూశారా? హాలీవుడ్‌లో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ గానీ, సిల్వెస్టర్ స్టాలోన్ గానీ ఇప్పుడు అలాంటి పనులు చేయడం లేదు. వారికి తమ శరీరాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. సౌత్ సినిమాల్లో కూడా నటనకే పెద్దపీట వేస్తారు. కానీ, హిందీలో మాత్రం కేవలం గ్లామర్, బాడీ బిల్డింగ్‌ను అమ్ముకుంటున్నారు" అని అవినాష్ తివారీ షాకింగ్ కామెంట్స్ చేశారు.

బాక్స్ ఆఫీస్ లెక్కల గోల ఏంటి?

ప్రేక్షకులు కూడా సినిమాల్లోని కళను చూడటం మానేసి, కేవలం కలెక్షన్ల లెక్కలనే గమనిస్తున్నారని అవినాష్ తివారీ విమర్శించారు. మన దగ్గర మనోజ్ బాజ్‌పాయ్, విక్రాంత్ మాస్సే, ప్రతీక్ గాంధీ వంటి అద్భుతమైన నటులు ఉన్నారని, వారందరినీ 'అండర్ రేటెడ్' అని పిలుస్తూనే, వారి సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్లకు మాత్రం వెళ్లడం లేదని ప్రేక్షకుల తీరును అవినాష్ తివారీ ఎత్తి చూపారు.

"నైపుణ్యానికి ఇక్కడ విలువ లేదు. ఎవరైనా చొక్కా విప్పేసి ఒక ఫోటో దిగితే చాలు, అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. కేవలం అందం మాత్రమే ప్రాధాన్యత అయితే, సినిమాల్లో మోడల్స్ సరిపోతారు, నటులు ఎందుకు?" అని అవినాష్ తివారీ ప్రశ్నించారు. ఈ ధోరణి వల్ల సినిమా అసలు ఉద్దేశ్యం దెబ్బతింటోందని ఆయన అభిప్రాయపడ్డారు.

సూపర్ స్టార్ల అభిమానుల ఆగ్రహం

అవినాష్ తివారీ తన వ్యాఖ్యల్లో ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. అయితే, 58 ఏళ్ల వయసులో 'పఠాన్', 'జవాన్' చిత్రాల కోసం సిక్స్ ప్యాక్ చూపించిన షారుఖ్ ఖాన్, ఎప్పుడూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్లను ఉద్దేశించే అవినాష్ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు.

ముఖ్యంగా రెడిట్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఈ స్టార్ హీరోల అభిమానులు అవినాష్ తివారీ ఎండగట్టిన తీరును టార్గెట్ చేస్తున్నారు. అనవసరంగా సీనియర్ హీరోలపై విమర్శలు చేయడం సరికాదని వారు కామెంట్ చేస్తున్నారు.

అవినాష్ తివారీ ప్రస్తుత పరిస్థితి

అవినాష్ తివారీ నటించిన తాజా చిత్రం 'గిన్నీ వెడ్స్ సన్నీ 2' ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైంది. మేధా శంకర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. మొదటి రోజు కేవలం 30 లక్షల రూపాయల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.

ప్రస్తుతం అవినాష్ తివారీ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తెరకెక్కిస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్ 'ఓ సాథీ రే'లో నటిస్తున్నారు. ఈ ఓటీటీ సిరీస్‌లో అదితి రావు హైదరీ, అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More