నేటి ఆధునిక కాలంలో థైరాయిడ్ సమస్య అనేది ప్రతి ఇంట్లోనూ సాధారణంగా మారిపోయింది. పురుషులతో పోలిస్తే ముఖ్యంగా మహిళలు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతున్నారు. మన గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి శరీరంలో T3, T4 థైరాక్సిన్ అనే కీలకమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

ఈ హార్మోన్లు మన శరీర జీర్ణక్రియ, హృదయ స్పందన రేటు, శ్వాసక్రియ మరియు శరీర ఉష్ణోగ్రతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా, కండరాలు, ఎముకల బలం, మానసిక ఆరోగ్యం మరియు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా ఇవే నియంత్రిస్తాయి. ఈ హార్మోన్ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు అది హైపర్ థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజానికి దారితీసి అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.
థైరాయిడ్ సమస్యను ఎదుర్కోవడానికి కేవలం మందులు వాడితే సరిపోదని, రోజువారీ జీవనశైలి మరియు అలవాట్లను మెరుగుపరుచుకోవడం ఎంతో అవసరమని ఆయుర్వేదం చెబుతోంది. థైరాయిడ్‌ను సహజంగా, పూర్తిగా నయం చేయడానికి 5 ముఖ్యమైన విషయాలలో మార్పులు చేసుకోవాలని ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ దీక్షా భావసర్ సూచిస్తున్నారు.
గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచండి:
మన శరీర రోగనిరోధక వ్యవస్థలోదాదాపు 70 శాతం గట్ లోనే ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. గట్ ఆరోగ్యంగా ఉంటే రోగనిరోధక శక్తి చురుగ్గా మారి, శరీరంలో మంట తగ్గుతుంది. దీనికోసం ఉదయాన్నే గోరువెచ్చని కొత్తిమీర నీటితో రోజును ప్రారంభించాలి. ఎల్లప్పుడూ తాజాగా వండిన వేడి ఆహారాన్ని మాత్రమే తినాలి.
నిల్వ ఉంచిన పాత ఆహార పదార్థాలను పూర్తిగా దూరం పెట్టాలి. ఎలాంటి పరధ్యానం (టీవీ, మొబైల్ చూడటం వంటివి) లేకుండా ఆహారాన్ని బాగా నమిలి ప్రశాంతంగా తినాలి. భోజనంతో పాటు కొద్దిగా కాల్చిన జీలకర్ర పొడి, రాతి ఉప్పు (సైంధవ లవణం) కలిపిన మజ్జిగ తాగడం చాలా మంచిది. మీకు విపరీతమైన కోపం, ఒత్తిడి లేదా ఆకలి లేనప్పుడు అస్సలు తినకూడదు. ఒక భోజనానికి, మరో భోజనానికి మధ్య కనీసం 3 నుండి 4 గంటల విరామం ఉండేలా చూసుకోవాలి.
ఒత్తిడిని తగ్గించుకోవటం…
{{/usCountry}}నిల్వ ఉంచిన పాత ఆహార పదార్థాలను పూర్తిగా దూరం పెట్టాలి. ఎలాంటి పరధ్యానం (టీవీ, మొబైల్ చూడటం వంటివి) లేకుండా ఆహారాన్ని బాగా నమిలి ప్రశాంతంగా తినాలి. భోజనంతో పాటు కొద్దిగా కాల్చిన జీలకర్ర పొడి, రాతి ఉప్పు (సైంధవ లవణం) కలిపిన మజ్జిగ తాగడం చాలా మంచిది. మీకు విపరీతమైన కోపం, ఒత్తిడి లేదా ఆకలి లేనప్పుడు అస్సలు తినకూడదు. ఒక భోజనానికి, మరో భోజనానికి మధ్య కనీసం 3 నుండి 4 గంటల విరామం ఉండేలా చూసుకోవాలి.
ఒత్తిడిని తగ్గించుకోవటం…
{{/usCountry}}శరీరంలో ఒత్తిడి స్థాయిలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు, అది థైరాయిడ్ గ్రంథిపై తీవ్ర ప్రభావం చూపి ఆటో ఇమ్యూన్ పరిస్థితులను మరింత దిగజారుస్తుంది. అందుకే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ యోగా లేదా ప్రాణాయామం సాధన చేయాలి. రోజూ కొంత సమయం ప్రకృతి ఒడిలో గడపడం, మనసుకు సంతోషాన్నిచ్చే పనులను చేయడం అలవాటు చేసుకోవాలి. రోజూ సులభంగా అనుసరించగలిగే దినచర్యను మాత్రమే ఎంచుకోవాలి. అనవసర సవాళ్లతో మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకుండా ఎల్లప్పుడూ రిలాక్స్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
పోషకాహార లోపాలను అధిగమించటం
విటమిన్ డి, విటమిన్ బి12, ఐరన్ (ఇనుము), సెలీనియం, జింక్, మెగ్నీషియం లోపాలు థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తాయి. విటమిన్ డి కోసం ప్రతిరోజూ ఉదయం 15-20 నిమిషాల పాటు సహజమైన సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. రోజువారీ ఆహారంలో నల్ల ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, బాదం, గుమ్మడికాయ గింజలు, నువ్వులు వంటి రకరకాల డ్రై ఫ్రూట్స్, విత్తనాలను చేర్చుకోవాలి.
శరీరంలో పోషకాలను గ్రహించే శక్తి పెరగడానికి రోజూ ఒకటి నుంచి రెండు టీస్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి తీసుకోవాలి. ప్యాక్ చేసిన జంక్ ఫుడ్స్ మానేసి, కాలానుగుణంగా దొరికే తాజా పండ్లు, కూరగాయలు తినాలి. శరీరానికి సహజంగా ఇనుము లభించాలంటే ఆహారాన్ని ఇనుప పాత్రలలో వండుకోవడం మంచిది. వైద్యుల సలహాతో రక్త పరీక్షలు చేయించుకుని…. లోపాలు ఉన్న పోషకాలకు తగిన సప్లిమెంట్లను వాడాలి.
ఆయుర్వేద మందులను వాడటం
పైన పేర్కొన్న జీవనశైలి మార్పులతో పాటు, థైరాయిడ్ సమస్య తీవ్రతను బట్టి వైద్యుల పర్యవేక్షణలో తగిన ఆయుర్వేద మందులను కూడా వాడాలి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును పునరుద్ధరించి, సమస్యను మూలాల నుండి నయం చేయడానికి అద్భుతంగా సహాయపడతాయి.
మన శరీరంలోని థైరాయిడ్, హార్మోన్లు, జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన జీవ గడియారం (బాడీ క్లాక్) ఆధారంగా పనిచేస్తాయి. నిద్ర సరిగ్గా లేకపోతే ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రి 10 నుంచి 10:30 గంటల లోపే నిద్రపోవాలి. నిద్రపోయే సమయానికి కనీసం ఒక గంట ముందే మొబైల్, టీవీ స్క్రీన్లను చూడటం ఆపివేయాలి. ఉదయాన్నే నిద్రలేచి కాసేపు ఎండలో గడపడం ద్వారా మీ నిద్ర, మేల్కొనే సమయాలను ఒక క్రమపద్ధతిలోకి తీసుకురావాలి.