Heart attack : గుండెపోటుకు కొలెస్ట్రాల్ మాత్రమే కారణం కాదు! అసలు విలన్ మీ కడుపులోనే..
Gut health : గుండెపోటుకు అసలు కారణం కొలెస్ట్రాల్ మాత్రమే కాదని అంటున్న ఓ ప్రముఖ వైద్యుడు. గట్ హెల్త్ సరిగ్గా లేకపోవడంతో సమస్యలు మొదలై, అనంతరం గుండెపోటుకు దారితీస్తాయని అంటున్నారు.
గుండెపోటుఅనగానే అందరికీ గుర్తొచ్చేది కేవలం కొలెస్ట్రాల్, బ్లాక్ అయిన రక్తనాళాలు మాత్రమే. కానీ, దీని వెనుక అసలు కథ చాలా భిన్నంగా ఉంటుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జాక్ వోల్ఫ్సన్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇటీవలే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ ప్రకారం.. హార్ట్ ఎటాక్స్‌కు అసలు మూలకారణం మన జీర్ణవ్యవస్థ లేదా పేగుల ఆరోగ్యంలోనే (గట్ హెల్త్) దాగి ఉందని అంటున్నారు.

వైద్య రంగంలో 16 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న కార్డియాలజిస్ట్ డాక్టర్ జాక్ వోల్ఫ్సన్.. గుండె ఆరోగ్యానికి సంబంధించి సమాజంలో ఉన్న అతిపెద్ద అపోహను బద్దలు కొట్టారు. "మనకు కొలెస్ట్రాల్ వల్లే గుండెపోటు వస్తుందని దశాబ్దాలుగా చెబుతున్నారు. కానీ మెజారిటీ కార్డియాలజిస్టులు నమ్మే ఈ సిద్ధాంతం పూర్తిగా నిజం కాదు. దీనికి సంబంధించిన సమస్యలు చాలా ముందుగానే మీ కడుపు (గట్) లోనే మొదలవుతాయి," అని ఆయన స్పష్టం చేశారు.
సాధారణ వైద్య విద్యలో గుండెకు, జీర్ణవ్యవస్థకు ఉన్న అంతర్గత బంధాన్ని పెద్దగా చర్చించరని, కానీ మానవ శరీరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అద్భుతమైన వ్యవస్థ అని ఆయన వివరించారు.
గట్ హెల్త్.. గుండెపోటుకు లింక్ ఏంటి?
డాక్టర్ జాక్ వోల్ఫ్సన్ ప్రకారం.. గుండెపోటు అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు. ఇది శరీరంలో కొన్ని సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా పెరిగే 'దీర్ఘకాలిక వాపు' (క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్, జీవక్రియ లోపాల (మెటబాలిక్ డిస్ఫంకన్ష్) ఫలితం!
మైక్రోబయోమ్ దెబ్బతినడం: మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా అనారోగ్యానికి గురైనప్పుడు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (వాపు) పెరుగుతుంది.
రక్తనాళాలపై ప్రభావం: కడుపులో మొదలయ్యే ఈ వాపు క్రమంగా రక్తనాళాలు, బ్లడ్ షుగర్ లెవెల్స్, హార్మోన్లు, మొత్తం కార్డియోవాస్కులర్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
గుండెను బలహీనపరిచే రోజువారీ అలవాట్లు..
కేవలం కొలెస్ట్రాల్ పెరగడం వల్లే కాకుండా, మన చుట్టూ ఉండే కొన్ని పర్యావరణ లోపాలు, జీవనశైలి అలవాట్లు గుండెను సైలెంట్‌గా ఖాళీ చేస్తున్నాయని డాక్టర్ హెచ్చరించారు.
కృత్రిమ రసాయనాలు: మనం పీల్చే కాలుష్య గాలిలోని టాక్సిన్స్, కెమికల్స్.
ఆహారపు అలవాట్లు: అతిగా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ తినడం.
మానసిక ఒత్తిడి: నిరంతర క్రానిక్ స్ట్రెస్, సరైన నిద్ర లేకపోవడం
డాక్టర్ ఇస్తున్న బెస్ట్ వెల్‌నెస్ సలహా..
లోపలి వాతావరణాన్ని మార్చండి: "గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే కేవలం మందులు వాడి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం మాత్రమే కాదు. అసలు రక్తనాళాలు దెబ్బతినడానికి కారణమవుతున్న శరీర అంతర్గత వాతావరణాన్ని మార్చాలి. మీ గుండె, కడుపు మీరు అనుకున్నదానికంటే చాలా ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నాయి," అని డాక్టర్ జాక్ వోల్ఫ్సన్ పేర్కొన్నారు.
కాబట్టి, గుండె పదిలంగా ఉండాలంటే కేవలం ఆయిలీ ఫుడ్స్ మానేయడమే కాదు.. ఒత్తిడి తగ్గించుకుంటూ, మంచి నిద్రతో పాటు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచే పీచు పదార్థాలు, ప్రోబయోటిక్స్ ఉన్న హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. వైద్య సందేహాల కోసం డాక్టర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


