6 pack body : 3 పూటలు అన్నం తింటూ 6 ప్యాక్​ పెంచిన 'దేశీ బాడీబిల్డర్​'! సీక్రెట్​ ఇదే..

Chennai construction worker : ఖరీదైన జిమ్ మెంబర్‌షిప్‌లు, ప్రోటీన్ పౌడర్లు ఉంటేనే బాడీ వస్తుందని నమ్మే కాలమిది. కానీ చెన్నైకి చెందిన ఒక సాధారణ కార్మికుడు తన 'నేచురల్' కండలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. అసలు ఆయన డైట్ ఏంటి? ఆ బాడీ వెనుక ఉన్న కష్టం ఏంటో తెలుసా?

Published on: Apr 20, 2026 12:18 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chennai construction worker viral video : నేటి రోజుల్లో సిక్స్ ప్యాక్ సాధించాలంటే వేలకు వేలు ఖర్చు చేసి డైట్ ప్లాన్స్, సప్లిమెంట్స్ వాడాలని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ చెన్నైలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే ఒక యువకుడు ఈ అంచనాలను తలకిందులు చేస్తున్నాడు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళరసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా ఈ 'దేశీ బాడీబిల్డర్' కండల రహస్యం వెలుగులోకి వచ్చింది. పగలంతా ఎండలో కష్టపడి పని చేస్తూనే, అద్భుతమైన బాడీని ఎలా సాధించాడో ఆయన మాటల్లోనే వింటే ఆశ్చర్యం కలగక మానదు.

దేశీ బాడీ బిల్డర్..
దేశీ బాడీ బిల్డర్..

పగలు పని.. రాత్రి కసరత్తులు!

ఎముకలు విరిగేలా శ్రమించే నిర్మాణ రంగంలో ఉండి కూడా, ఆయన తన వర్కౌట్ విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదు. వారానికి ఐదు రోజుల పాటు పక్కాగా వ్యాయామం చేస్తున్నాడు.

సోమవారం: చెస్ట్ (ఛాతీ)

మంగళవారం: షోల్డర్ (భుజాలు)

బుధవారం: బ్యాక్ (వీపు)

గురువారం: బైసెప్స్, ట్రైసెప్స్

శుక్రవారం: లెగ్ వర్కౌట్ (కాళ్లు)

అయితే, పగలు పనిలో బరువులు మోయాల్సి ఉంటుంది కాబట్టి, కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు మాత్రం పరిమితంగానే చేస్తున్నట్లు ఆయన వివరించాడు. తన వృత్తిని, ఆరోగ్యాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఆయనకు తెలిసినంతగా బహుశా ఏ జిమ్ ట్రైనర్‌కూ తెలియదేమో!

ఇడ్లీ, దోశలకు నో.. కేవలం అన్నమే ముద్దు!

దక్షిణాది వారందరికీ ఇడ్లీ, దోశలు ఇష్టమైన ఆహారం. కానీ, ఈ 'కండల వీరుడు' మాత్రం వాటికి దూరంగా ఉంటాడు. ఆయన డైట్ ప్లాన్ చాలా విచిత్రంగా, పక్కాగా ఉంటుంది.

ముప్పొద్దులా అన్నమే: మూడు పూటలా కేవలం తెల్ల అన్నం, సాంబార్, రసం, కూరగాయలతో (బీట్‌రూట్, క్యారెట్ వంటివి) భోజనం ముగిస్తాడు.

నో జంక్ ఫుడ్: బయటి ఆహారం అస్సలు ముట్టడు. కేవలం ఇంటి వంట మాత్రమే తింటాడు.

నాన్-వెజ్: వారానికి ఒక్కసారి మాత్రమే మటన్ తింటాడు. చికెన్ లేదా చేపలను అస్సలు తీసుకోడు.

పండ్లు: అప్పుడప్పుడు ఎర్ర అరటిపండ్లు తింటాడు, ఇతర పండ్లు చాలా అరుదుగా తీసుకుంటాడు.

సప్లిమెంట్స్ లేవు.. స్టెరాయిడ్స్ అసలే వద్దు!

ఆయన కండల ఫినిషింగ్ చూసి చాలామంది స్టెరాయిడ్స్ వాడుతున్నావేమో అని అనుమానించారు. దానికి ఆయన నవ్వుతూ సమాధానమిచ్చాడు.

"నాకు స్టెరాయిడ్స్ అంటే ఏంటో కూడా తెలియదు. కనీసం వే ప్రోటీన్ కూడా వాడను. పగలు పని, రాత్రి జిమ్, సరైన నిద్ర.. ఇదే నా రహస్యం," అని స్పష్టం చేశాడు. రోజుకు కచ్చితంగా 7 గంటలు నిద్రపోవడం, మద్యం- ధూమపానానికి దూరంగా ఉండటమే తన శక్తికి కారణమని ఆయన తెలిపాడు.

ఈ యువకుడి కథ వింటుంటే ఒకటి మాత్రం స్పష్టమవుతోంది. ఫిట్‌నెస్ అనేది ఖరీదైన వ్యాపారం కాదు, అది ఒక క్రమశిక్షణ. ఖరీదైన జిమ్ములు లేకపోయినా, పౌష్టిక ఆహారం, పట్టుదల ఉంటే ఎవరైనా అద్భుతాలు సాధించవచ్చని ఆయన నిరూపించాడు. "ఇంటి భోజనం తినండి, వ్యసనాలకు దూరంగా ఉండండి," అని ఆయన ఇస్తున్న సందేశం ప్రతి యువకుడికి ఆదర్శం.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. ఈ చెన్నై కార్మికుడు ఎటువంటి డైట్ పాటిస్తున్నారు?

ఆయన మూడు పూటలా కేవలం తెల్ల అన్నం, సాంబార్, కూరగాయలనే తీసుకుంటారు. ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లకు ఆయన దూరంగా ఉంటారు.

2. బాడీ బిల్డింగ్ కోసం ఆయన ఏవైనా సప్లిమెంట్స్ వాడుతున్నారా?

లేదు, ఆయన ఎటువంటి ప్రోటీన్ పౌడర్లు లేదా స్టెరాయిడ్స్ వాడటం లేదు. కేవలం ఇంటి భోజనం, వ్యాయామం ద్వారానే ఈ శరీరాన్ని సాధించారు.

3. ఆయన వర్కవుట్ ప్లాన్ ఏంటి?

వారానికి ఐదు రోజులు జిమ్‌కు వెళ్తారు. ప్రతి రోజు ఒక్కో వ్యాయామానికి ప్రాధాన్యతనిస్తూ వర్కౌట్ చేస్తారు.

4. నాన్-వెజ్ ఆహారం విషయంలో ఆయన నియమం ఏంటి?

ఆయన వారానికి ఒక్కసారి మాత్రమే మటన్ తింటారు. చికెన్ లేదా చేపలను అస్సలు తీసుకోరు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More