Solo Date : సోలో డేట్‌తో మీకు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

Solo Date : మీతో మీరు గడపడంలో వచ్చే కిక్కు చాలా బాగుంటుంది. దీనికి కాస్త ప్రాక్టీస్ కావాలి. ఇప్పుడు చాలా మంది ఇలా సోలో డేట్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.

Published on: May 7, 2026, 11:30:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతిరోజూ మనం కొత్త ట్రెండ్‌లను చూస్తూనే ఉంటాం. ఈ జెన్ జెడ్ యుగంలో ప్రతి ట్రెండ్ దానికంటూ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ముఖ్యంగా డేటింగ్ ట్రెండ్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల డేటింగ్ యాప్‌ల సంఖ్య కూడా పెరిగింది. తమకు సరిపోయే వ్యక్తులను చూసుకునే జనాలు ముందుకు వెళ్తున్నారు.

సోలో డేట్
సోలో డేట్

అయితే మీరు సోలో డేట్ గురించి ఎప్పుడైనా విన్నారా? అవును ఈ రోజుల్లో ఇది చాలా ఎక్కువగా వినిపిస్తున్న ఒక కొత్త ట్రెండ్. సోలో డేట్ అంటే ఒంటరిగా ఉండటం, ఒంటరిగా నడవడం. ఒకప్పుడు మీకు నచ్చిన అబ్బాయి లేదా అమ్మాయితో సినిమాకి, హోటల్‌కి, లేదా పర్యాటక ప్రదేశానికి వెళ్లే ట్రెండ్, ఇప్పుడు సోలో డేట్ అనే కొత్త రూపాన్ని సంతరించుకుంది.

ఈ మధ్య కాలంలో ప్రయాణాలు చేయడం, ఒంటరిగా జీవించడం ఒక ట్రెండ్‌గా మారింది. అదేవిధంగా ఈ సోలో డేట్ కూడా ఒక కొత్త తరం ట్రెండ్. ఈ సోలో డేట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సోలో డేట్‌కు వెళ్లడం మీ మొత్తం ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని అంటారు. దీని నుండి మీరు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది

ఒంటరిగా బయటకు వెళ్లడం లేదా కొత్త ప్రదేశాలను సందర్శించడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇది మీ అంతట మీరే నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. మీరు కొత్త ప్రదేశానికి ప్రయాణించేటప్పుడు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది.

ప్రశాంతంగా ఉండొచ్చు

ఒంటరిగా డేటింగ్ చేయడం ఒంటరితనాన్ని అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. చాలా మందికి ఒంటరితనం ఒక పెద్ద సమస్య. కానీ ఒంటరిగా డేట్‌కు వెళ్లడం ద్వారా ఒంటరితనాన్ని ఎలా ఎదుర్కోవాలో, మీ ఏకాంతంలో ఎలా సంతోషంగా ఉండాలో మీరు నేర్చుకోవచ్చు. ఇది ఒక భాగస్వామి కావాలనే భావనను లేదా ఒంటరితనం అనే భావనను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. మీతో మీరు గడపవచ్చు.

ఏదైనా ఎదుర్కొంటారు

మీరు ఎంత పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నా, దానిని పరిష్కరించుకోవడానికి మీరు ఇతరుల సహాయం కోరవచ్చు. కానీ సోలో డేటింగ్ ఈ విషయాలన్నింటిలో మీకు సహాయపడుతుంది. ఎలాంటి సమస్యనైనా ఒంటరిగా ఎదుర్కోవడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. సమస్యలు వ్యక్తుల నుండే వస్తాయి కాబట్టి, ఒంటరిగా ఉండటం వల్ల ఆ సమస్యలు తొలగిపోతాయి.

మానసిక సమస్యల నుంచి బయటకు

మీరు ఒంటరిగా ఉన్నట్లయితే.. ఈ సోలో డేట్ మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ పెద్ద మానసిక సమస్యల నుండి చిన్న చిన్న చికాకుల వరకు ఈ సోలో డేట్ ఒక సరైన పరిష్కారం. ఇది ఎవరి ఒత్తిడి లేకుండా మీ జీవితాన్ని నిర్మించుకోవడాన్ని సులభతరం చేస్తుంది. మీ చింతలను తగ్గించుకోవడానికి ఒంటరిగా ప్రయాణించడం ఉత్తమం అన్నదే దీని వెనుక ఉన్న ఆలోచన.

ఒక్క విషయం మీతో మీకు బోర్ కొట్టకుంటే.. ఇక ప్రపంచంలో మీరు ఎక్కడైనా బతికేస్తారు. చాలా మంది చెప్పేమాట.. ఒంటరిగా ఉండలేను అని.. మీతో మీరు గడపడానికే ఇష్టపడకపోతే.. అవతలివారు ఎలా మీతో గడుపుతారు చెప్పండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More