Influencer : ఇన్​ఫ్లుయెన్సర్ అవ్వడం ఎలా? 0 నుంచి లక్షల ఫాలోయర్లు, లక్షల సంపాదన వరకు.. పక్కా ప్లాన్​ ఇది!

How to become an influencer : ఈ 2026లో మీరు ఇన్​ఫ్లుయెన్సర్​ అవ్వాలనుకుంటున్నారా? ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదా? మీకు ఇన్​స్టాగ్రామ్​ బెస్ట్​ ఆ? లేక యూట్యూబ్​లో జర్నీ స్టార్ట్​ చేయాలా? అసలు ఒక ఇన్​ఫ్లుయెన్సర్ ఎంత సంపాదిస్తారు? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Apr 13, 2026 7:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

How to become a lifestyle influencer : సోషల్​ మీడియాలో మీరు తరచూ ఇన్​ఫ్లుయెన్సర్లను చూస్తూనే ఉంటారు. లైఫ్​స్టైల్​ నుంచి వినోదం వరకు ఈ ఇన్​ఫ్లుయెన్సర్లు తమ అద్భుతమైన ‘స్టోరీ టెల్లింగ్​’తో ఫాలోవర్లను కట్టిపడేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు. లగ్జరీ కార్లు కొంటున్నారు. అవి చూసి మనకి కూడా ఇన్​ఫ్లుయెన్సర్​ అవ్వాలనిపిస్తూ ఉంటుంది. మన ప్రతిభను కనబరుచుకుని, డబ్బులు సంపాదించాలని ఉంటుంది. కానీ ఎలా మొదలుపెట్టాలి? ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? అన్న విషయాల్లో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. వీరులో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే.

ఈ 2026లో ఇన్​ఫ్లుయెన్సర్ అవ్వడం ఎలా?
ఈ 2026లో ఇన్​ఫ్లుయెన్సర్ అవ్వడం ఎలా?

ఇన్​ఫ్లుయెన్సర్​ అవ్వాలంటే ముందుగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి.. ఎవరైనా ఇన్​ఫ్లుయెన్సర్​ అవ్వొచ్చు. రెండు.. ఇన్​ఫ్లుయెన్సర్​ అవ్వడం అంత సులభం కాదు. మీరు గమనిస్తే చాలా లైఫ్​స్టైల్​ వ్లాగర్లు ఉంటారు. కానీ వారిలో కొద్ది మంది మాత్రమే లక్షల ఫాలోవర్స్​తో, లక్షల సంపాదనతో దూసుకెళుతుంటారు. వీరిలో ఒకరిగా నిలవాలంటే కొన్ని టిప్స్​ ఫాలో అవ్వాలి. వాటిని ఇక్కడ వివరంగా తెలుసుకోండి, మీరూ ఒక ఇన్​ఫ్లుయెన్సర్​ అయిపోండి..

అసలు ఆదాయం ఎంత ఉంటుంది?

ముందు డబ్బు గురించి మాట్లాడుకుందాము. చాలా మందికి ఉండే పెద్ద అనుమానం— ఈ ఇన్​ఫ్లుయెన్సర్లు అసలు నెలకు ఎంత సంపాదిస్తున్నారు? అని. ఇండియాలో లైఫ్‌స్టైల్ ఇన్​ఫ్లుయెన్సర్ సంపాదన మూడు రకాలుగా ఉంటుంది:

ఏ. యూట్యూబ్ యాడ్ రెవెన్యూ

ఇండియాలో లైఫ్‌స్టైల్ వ్లాగ్స్‌కు సగటున 1,000 వ్యూస్‌కు రూ. 20 నుంచి రూ. 60 వరకు వస్తుంది.

మీకు నెలకు 10 లక్షల వ్యూస్ వస్తే: రూ. 30,000 - రూ. 50,000 వరకు సంపాదించవచ్చు.

బీ. బ్రాండ్ కొలాబరేషన్స్ (పెద్ద ఆదాయం ఇక్కడే!)

ఇన్​ఫ్లుయెన్సర్లు కేవలం యూట్యూబ్​ యాడ్​ రెవెన్యూపై ఆధారపడరు. వీరికి ప్రత్యేకంగా బ్రాండ్​ కొలాబరేషన్స్​ ఉంటాయి. ప్రమోషన్స్​ కోసం ఇవి ఎక్కువ చెల్లిస్తుంటాయి.

నానో ఇన్‌ఫ్లుయెన్సర్ (5 వేలు-20 వలు ఫాలోవర్స్): ఒక వీడియోకి రూ. 5,000 నుంచి రూ. 15,000.

మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్ (50వేలు- 200వేలు ఫాలోయర్స్): ఒక వీడియోకి రూ. 30,000 నుంచి రూ. 1.5 లక్షలు.

మెగా ఇన్‌ఫ్లుయెన్సర్ (1మిలియన్+ ఫాలోయర్స్): ఒక్కో ఇంటిగ్రేటెడ్ వీడియోకి రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు.

సీ. అఫీలియేట్ మార్కెటింగ్

మీరు వాడే మేకప్ కిట్, కిచెన్ గ్యాడ్జెట్స్ లేదా బట్టల లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం ద్వారా నెలకు అదనంగా రూ. 10,000 - రూ. 50,000 సంపాదించవచ్చు.

అంటే.. ఒక సగటు లైఫ్‌స్టైల్ వ్లాగర్ (సుమారు 1 లక్ష సబ్‌స్క్రైబర్లు ఉండి, మంచి వ్యూస్ వస్తుంటే) నెలకు అన్ని మార్గాల ద్వారా రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు సంపాదించవచ్చు.

ఈ 2026లో ఇన్​ఫ్లుయెన్సర్​ అవ్వాలా? ఇది మీకోసమే..
ఈ 2026లో ఇన్​ఫ్లుయెన్సర్​ అవ్వాలా? ఇది మీకోసమే..

ఈ 2026లో ఇన్​ఫ్లుయెన్సర్​ అవ్వడం ఎలా?

నేడు ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే కేవలం ఫోటోలు దిగే వ్యక్తి కాదు, అదొక పవర్ ఫుల్ పర్సనల్ బ్రాండ్! లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ, నెలకు లక్షల్లో సంపాదించే స్థాయికి చేరాలంటే మీరు ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లాలి. ఆ సూత్రాల వివరణ ఇక్కడ ఉంది:

1. ఇన్‌ఫ్లుయెన్సింగ్‌ను ఒక వ్యాపారంగా భావించండి

చాలా మంది దీనిని కేవలం సరదాగా మొదలుపెడతారు, కానీ మీరు దీనిని ఒక 'బిజినెస్' లా చూడాలి.

లక్ష్యాలు: మీరు దేని కోసం ఇన్‌ఫ్లుయెన్సర్ అవుతున్నారు? డబ్బు కోసమా? పాపులారిటీ కోసమా? స్పష్టత ఉండాలి.

2. మీ నిష్ (Niche) గుర్తింపు

ఏది పడితే అది పోస్ట్ చేస్తే ఎవరూ చూడరు. మీరు దేనిలో ఎక్స్‌పర్ట్?

ఉదాహరణకు: గార్డెనింగ్, బడ్జెట్ ట్రావెల్, వంటలు, లేదా టెక్నాలజీ. మీకంటూ ఒక ప్రత్యేక శైలిని ఎంచుకోండి.

3. మీ ఆడియన్స్‌ను అర్థం చేసుకోండి

మీరు ఎవరి కోసం వీడియోలు చేస్తున్నారు? వారి వయస్సు ఎంత? వారికి ఏ సమస్యలు ఉన్నాయి? ఇతర ఇన్​ఫ్లుయెన్సర్ పోస్టుల కింద వచ్చే కామెంట్లను చదవండి. అక్కడ జనం అడిగే ప్రశ్నలే మీ తదుపరి వీడియోకు టాపిక్స్!

4. పర్సనల్ బ్రాండ్‌ను సృష్టించండి

మీకంటూ ఒక ప్రత్యేకమైన 'వాయిస్' ఉండాలి. మీ పోస్టుల్లో వాడే రంగులు, ఫాంట్లు, మీరు మాట్లాడే తీరు చూస్తే.. పేరు చూడకుండానే ఇది మీ పోస్ట్ అని గుర్తుపట్టేలా ఉండాలి.

5. కంటెంట్ స్ట్రాటజీ అండ్ క్యాలెండర్

ముందస్తు ప్రణాళిక లేకపోతే సక్సెస్ రాదు! ఒక క్యాలెండర్ సెట్ చేసుకోండి:

సోమవారం: మోటివేషన్ లేదా మీ మార్నింగ్ రొటీన్.

బుధవారం: లైవ్ సెషన్ (ప్రశ్నలు-సమాధానాలు).

శుక్రవారం: ఒక ఉపయోగకరమైన ట్యుటోరియల్.

6. ఆన్‌లైన్ ఉనికిని మెరుగుపరచండి (ఆప్టిమైజేషన్)

మీ సోషల్ మీడియా అకౌంట్లను 'బిజినెస్/క్రియేటర్' అకౌంట్లుగా మార్చండి. వీలైతే ఒక సొంత వెబ్‌సైట్, ఈమెయిల్ మార్కెటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోండి. ఇది బ్రాండ్‌ల దృష్టిలో మీ క్రెడిబిలిటీని పెంచుతుంది.

7. సరైన ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకోండి

అన్నింటా ఉండటం కంటే, ఒకటి రెండు ప్లాట్‌ఫారమ్‌లపై పట్టు సాధించడం ముఖ్యం.

యూట్యూబ్ : వివరణాత్మక వీడియోలు, ట్యుటోరియల్స్ కోసం.

ఇన్​స్టాగ్రామ్​​ : ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఫోటోగ్రఫీ కోసం.

8. స్థిరత్వం (కన్సిస్టెన్సీ ఈజ్​ కింగ్)

ఫలితాలు వెంటనే రావు. వారం రోజులు పోస్ట్ చేసి ఆపేయకండి. నిరంతరం కొత్త కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ ఉంటేనే అల్గారిథమ్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది.

9. ఆడియన్స్‌తో మమేకం అవ్వండి (ఎంగేజ్​మెంట్)

కేవలం పోస్ట్ చేయడమే కాదు, మీ ఫాలోయర్లతో మాట్లాడండి.

వారి కామెంట్లకు రిప్లై ఇవ్వండి.

మీ స్టోరీల్లో పోల్స్ , ప్రశ్నలు అడగండి.

తోటి ఇన్​ఫ్లుయెన్సర్ పోస్టులపై స్పందించండి.

10. బ్రాండ్ కొలాబరేషన్స్

మీరు ఎదిగే కొద్దీ బ్రాండ్లు మిమ్మల్ని సంప్రదిస్తాయి. లేదా మీరే నేరుగా బ్రాండ్‌లకు ఈమెయిల్ చేయవచ్చు.

మీడియా కిట్: మీ ఫాలోయర్లు ఎంత మంది? ఎంగేజ్‌మెంట్ ఎంత? అనే వివరాలతో ఒక ప్రొఫైల్ సిద్ధంగా ఉంచుకోండి.

11. నిరంతరం నేర్చుకోండి

సోషల్ మీడియా ట్రెండ్స్ నిమిషానికోసారి మారుతుంటాయి. కొత్త ఫీచర్లు, టూల్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఏ వీడియో బాగా పనిచేస్తోంది? దేనిని జనం చూడటం లేదు? అనే అనలిటిక్స్ చూసి మీ స్ట్రాటజీని మార్చుకుంటూ ఉండండి.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. ఇన్​ఫ్లుయెన్సర్ఇన్​ఫ్లుయెన్సర్ కావడానికి లక్షల్లో ఫాలోవర్లు ఉండాలా?

అవసరం లేదు. ప్రస్తుతం బ్రాండ్లు 'మైక్రో-ఇన్‌ఫ్లుయెన్సర్ల' (10k-50k) వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే వీరి దగ్గర జెన్యూన్ ఆడియన్స్ ఉంటారు.

2. మొదటి ఆదాయం ఎప్పటి నుంచి మొదలవుతుంది?

సాధారణంగా 1000 మంది లాయల్ ఫాలోయర్లు ఉన్నా 'అఫిలియేట్ మార్కెటింగ్' ద్వారా సంపాదన మొదలుపెట్టవచ్చు. బ్రాండ్ డీల్స్ అనేవి మీ నిష్ మరియు ఎంగేజ్‌మెంట్‌పై ఆధారపడి ఉంటాయి.

3. కెమెరా భయం ఎలా పోగొట్టుకోవాలి?

అది మొదట్లో అందరికీ ఉంటుంది. చిన్న చిన్న 'షార్ట్స్' లేదా 'రీల్స్' తో మొదలుపెట్టండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More