Surya Namaskar Benefits : సూర్య నమస్కారంతో మెదడు పనితీరుపై అద్భుతమైన ప్రభావం - న్యూరో సర్జన్ ఆసక్తికర విశ్లేషణ!

Surya Namaskar benefits : సూర్య నమస్కారం కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. అది మెదడు పనితీరును మెరుగుపరిచే ఒక శక్తివంతమైన సాధనం. న్యూరో సర్జన్ డాక్టర్ ప్రశాంత్ కటకోల్ సూర్య నమస్కారం.. ఓ సహజ సిద్ధమైన యాంటిడిప్రెసెంట్ గా పని చేస్తుందని చెబుతున్నారు. 

Published on: Apr 15, 2026 1:01 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Surya Namaskar Benefits : యోగాలో సూర్య నమస్కారాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 12 విభిన్న భంగిమల కలయికగా ఉండే ఈ ప్రక్రియను చాలామంది కేవలం ఫ్లెక్సిబిలిటీ కోసం మాత్రమే చేస్తారు. అయితే… ఇది మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావం అద్భుతమని ప్రముఖ న్యూరో సర్జన్, డాక్టర్ ప్రశాంత్ కటకోల్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ (ఏప్రిల్ 14, 2026) ద్వారా పంచుకున్నారు.

సూర్య నమస్కారం (Unsplash)
సూర్య నమస్కారం (Unsplash)

'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ సైన్సెస్' ప్రచురించిన ఒక అధ్యయనాన్ని ఆయన ఉటంకించారు. 80 మంది వ్యక్తులపై ఆరు నెలల పాటు (వారానికి ఐదు రోజులు) చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి:

  • సెరోటోనిన్ పెరుగుదల: సూర్య నమస్కారం చేయడం వల్ల మెదడులో సెరోటోనిన్ స్థాయిలు గణనీయంగా పెరిగాయి.
  • మానసిక స్థితి: తేలికపాటి నిరాశ (Depression), తీవ్రమైన ఆందోళన (Anxiety), ఒత్తిడి గణనీయంగా తగ్గాయి.
  • శారీరక మార్పులు: బరువు, బిఎమ్ఐ (BMI), నడుము చుట్టుకొలత తగ్గడమే కాకుండా శరీర ఆకృతిలో మెరుగుదల కనిపించింది.

సెరోటోనిన్ అంటే ఏమిటి?

సెరోటోనిన్ అనేది మన మెదడులోని ఒక రసాయనం, ఇది మూడ్‌ను స్థిరంగా ఉంచుతుంది. "తక్కువ సెరోటోనిన్ నేరుగా డిప్రెషన్, దీర్ఘకాలిక ఒత్తిడికి దారితీస్తుంది. బయటి మందుల కంటే… మెదడు తనను తాను నయం చేసుకునేలా చేయడంలో సూర్య నమస్కారం తోడ్పడుతుంది" అని డాక్టర్ కటకోల్ వివరించారు.

సూర్య నమస్కారం - 12 భంగిమలు

సూర్య నమస్కారంలోని ప్రతి భంగిమ ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. 12 భంగిమల పేర్లను ఇక్కడ తెలుసుకోండి….

  1. ప్రాణమాసన (ప్రార్థన భంగిమ)
  2. హస్త ఉత్తానాసనం (చేతుల భంగిమ)
  3. పాదహస్తాసనం (పాదాల దగ్గరకు చేతులు)
  4. ఆశ్వ సంచలానాసన (గుర్రపు భంగిమ)
  5. దండాసన (పలక భంగిమ)
  6. అష్టాంగ నమస్కారం (ఎనిమిది భాగాలతో నమస్కారం)
  7. భుజంగాసన (నాగుపాము భంగిమ)
  8. అధోముఖ స్వానాసన (క్రిందికి చూసే కుక్క భంగిమ)
  9. ఆశ్వ సంచలానాసన (మరోసారి గుర్రపు భంగిమ)
  10. పాదహస్తాసన (పాదాల దగ్గరకు చేతులు)
  11. హస్త ఉత్తానాసనం (ఎత్తిన చేతుల భంగిమ)
  12. తదాసన (పర్వత భంగిమ)

ఆరోగ్య ప్రయోజనాలు

సూర్య నమస్కారం చేస్తే… గుండె ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థ ఉత్తేజమవుతుంది. రోగనిరోధక శక్తి పెరగటంతో పాచు క్యాలరీలను ఖర్చు చేసి ఊబకాయాన్ని తగ్గిస్తుందని డాక్టర్ కటకోల్ వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More