Quick Weight Loss : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిదీ వేగంగా జరిగిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. బరువు తగ్గడం విషయంలోనూ ఇదే మాదిరిగా ఆలోచిస్తున్నారు. ఇందుకోసం వేగంగా బరువు తగ్గే పలు పద్ధతులపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే….. ఇలా వేగంగా బరువు తగ్గడం వల్ల శరీరానికి నష్టం జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదే విషయంపై హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇటీవల నిర్మాత బోనీ కపూర్ జిమ్‌కు వెళ్లకుండానే, రాత్రి భోజనం మానేసి కేవలం పండ్లను తింటూ 26 కిలోల బరువు తగ్గడం చర్చనీయాంశమైన నేపథ్యంలో డాక్టర్ సుధీర్ స్పందించారు.
ఏప్రిల్ 10న 'X' (ట్విట్టర్) వేదికగా డాక్టర్ సుధీర్ కుమార్ బరువు తగ్గడంపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. "ఊబకాయం అనేది ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య, కానీ అది హార్ట్ ఎటాక్ లాంటి 'మెడికల్ ఎమర్జెన్సీ' కాదు. వారాల్లోనో, రోజుల్లోనో బరువు తగ్గాలని శరీరాన్ని ఒత్తిడికి గురిచేయాల్సిన అవసరం లేదు. అలా బలవంతంగా బరువు తగ్గించడం వల్ల శరీరంలో ప్రతికూల జీవక్రియలు మొదలవుతాయి" అని ఆయన వివరించారు. క్రాష్ డైట్స్ (Crash Diets) అనుసరించడం వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
వేగంగా బరువు తగ్గడం - ప్రధాన సమస్యలు:
బరువు తగ్గటం అనేది స్కేల్ పై కనిపించే అంకెలకు సంబంధించినది మాత్రమే కాదని, అది శరీర అంతర్గత వ్యవస్థపై చూపే ప్రభావం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
{{/usCountry}}బరువు తగ్గటం అనేది స్కేల్ పై కనిపించే అంకెలకు సంబంధించినది మాత్రమే కాదని, అది శరీర అంతర్గత వ్యవస్థపై చూపే ప్రభావం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
{{/usCountry}}కండరాల క్షీణత (Muscle Wasting): వేగంగా బరువు తగ్గినప్పుడు శరీరంలోని కొవ్వు కంటే సన్నని కండరాల (Lean Muscle) నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియ రేటును గణనీయంగా తగ్గిస్తుంది.
హార్మోన్ల మార్పులు: బరువు వేగంగా తగ్గినప్పుడు ఆకలిని పెంచే హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీనివల్ల బాడీ ఎప్పుడూ ఆకలితో ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది, ఫలితంగా అతిగా తినకుండా నియంత్రించుకోవడం కష్టమవుతుంది.
యో-యో ఎఫెక్ట్ (Yo-Yo Effect): వేగంగా తగ్గిన బరువు అంతే వేగంగా తిరిగి పెరుగుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
సరైన విధానం ఏమిటి?
స్థిరమైన , ఆరోగ్యకరమైన మార్పులను డాక్టర్ సుధీర్ సూచించారు. "నిజమైన విజయం బరువు తగ్గే వేగంలో లేదు.. ఆ తగ్గిన బరువును ఎంతకాలం స్థిరంగా ఉంచుకున్నామనే దానిపైనే ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
ఆయన సూచనల మేరకు… 3 నుంచి 6 నెలల వ్యవధిలో కేవలం 5 నుంచి 10 శాతం బరువు తగ్గడం ఆరోగ్యకరమైన బరువు తగ్గే లక్ష్యం. ఈ తరహా విధానం… కార్డియోమెటబాలిక్ (గుండె మరియు జీవక్రియ) ప్రమాదాలను తగ్గిస్తుంది. దీనిని పాటించడం చాలా సులభమని ఆయన వివరించారు. అందం కోసం శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా… ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు.