Constipation : మలబద్ధకానికి చెక్ పెట్టే ‘నేచురల్ మెడిసిన్’- ఇదొక్కటి చాలు..!
Constipation foods to eat : మీరు మలబద్ధకం సమసస్యతో బాధపడుతున్నారు? ఎన్ని ట్యాబ్లెట్లు తీసుకున్నా ప్రయోజనం లేదా? అయితే మీరు బ్లాక్ ప్రూన్స్ని ట్రై చేయాలని అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్. మలబద్ధకం విరుగుడుకు ఇదే అద్భుతమైన ఔషదం అని అంటున్నారు.
Black prunes for constipation : శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో చెప్పడానికి క్రమబద్ధమైన ప్రేగు కదలికలు (బోవెల్ మూవ్మెంట్) ఒక ముఖ్యమైన సూచిక. అయితే, నేటి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది మలబద్ధకం సమస్యతో సతమతమవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి లాక్సేటివ్స్ వాడటం కంటే, సహజ సిద్ధమైన ఇంటి చిట్కాలు పాటించడం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రముఖ న్యూట్రిషనిస్ట్, డయాబెటిస్ ఎడ్యుకేటర్ దీప్శిఖ జైన్, ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మలబద్ధకాన్ని వదిలించే ఒక అద్భుతమైన ఆహారం గురించి వివరించారు. అదే ‘బ్లాక్ ప్రూన్స్’. దీనినే ఎండిన ఆలూ బుఖారా అని కూడా అంటారు.
బ్లాక్ ప్రూన్స్: ఒక సహజ లాక్సేటివ్..
సాధారణంగా ప్లమ్ పండ్లను డీహైడ్రేట్ (ఎండబెట్టడం) చేయడం ద్వారా ఈ ప్రూన్స్ తయారవుతాయి. మనం బిర్యానీలు, కూరల్లో రుచి కోసం వాడే ఆలూ బుఖారానే ఇవి. దీప్శిఖ ప్రకారం.. "మలబద్ధకం ఉన్నవారికి ఇవి ఒక ఔషధంగా పనిచేస్తాయి."
ఇందులోని రహస్యం ఏంటి?
బ్లాక్ ప్రూన్స్‌లో 'సార్బిటాల్' అనే సహజ పదార్థం ఉంటుంది. ఇది ఒక నేచురల్ లాక్సేటివ్‌గా పనిచేసి, మలమును మెత్తబరుస్తుంది. తద్వారా ప్రేగు కదలికలు మెరుగుపడి, విసర్జన సులభంగా జరుగుతుంది.
బ్లాక్ ప్రూన్స్ ఎలా తీసుకోవాలి? (నిపుణుల సలహా)
బిర్యానీలో వేసినప్పుడు వీటిని తింటే పెద్దగా ప్రయోజనం ఉండదు. పూర్తి ఆరోగ్య ఫలితాల కోసం దీనిని ప్రత్యేక పద్ధతిలో తీసుకోవాలి:
- రాత్రి పడుకోబోయే ముందు 4 నుంచి 5 బ్లాక్ ప్రూన్స్‌ను నీటిలో నానబెట్టండి.
- మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తినాలి.
బ్లాక్ ప్రూన్స్- పోషకాల గని..
కేవలం మలబద్ధకం మాత్రమే కాదు, ఐదు ప్రూన్స్ (ఒక సర్వింగ్) తీసుకుంటే శరీరానికి అందే పోషకాలు ఇవే:
క్యాలరీలు: 104
పీచు పదార్థం (ఫైబర్): 3 గ్రాములు
పొటాషియం, విటమిన్ ఏ, సీ, కే, బీ6, ఐరన్, కాపర్ వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..
ఎముకల ఆరోగ్యం: ప్రూన్స్ తినడం వల్ల ఎముకల దృఢత్వం పెరుగుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్: శరీరంలోని హానికారక పదార్థాలను తొలగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
బీపీ నియంత్రణ: రక్తపోటును తగ్గించడంలో ఇవి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
గుట్ హెల్త్: మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఒకవేళ మీరు కూడా మలబద్ధకంతో బాధపడుతుంటే, కెమికల్ టాబ్లెట్స్ జోలికి వెళ్లకుండా ఈ సహజమైన ఆలూ బుఖారా చిట్కాను ప్రయత్నించి చూడండి!
(గమనిక- ఇది సమాచారం రూపొందించిన కథన మాత్రమే. వైద్యపరమైన విషయాల గురించి డాక్టర్ లేదా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. బ్లాక్ ప్రూన్స్ అంటే ఏంటి?
ప్లమ్ పండ్లను ఎండబెట్టినప్పుడు వాటిని ప్రూన్స్ అంటారు. తెలుగులో వీటినే ఎండిన ఆలూ బుఖారా అని పిలుస్తారు.
2. రోజుకు ఎన్ని ప్రూన్స్ తినవచ్చు?
జీర్ణక్రియ మెరుగుపడటానికి రోజుకు 4 నుంచి 5 ప్రూన్స్ తీసుకోవడం మంచిది. అతిగా తింటే డయేరియా (విరేచనాలు) అయ్యే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
3. వీటిని ఫ్రిజ్‌లో దాచుకోవచ్చా?
అవును. బయట ఉంచితే 6 నెలలు, అదే ఫ్రిజ్‌లో ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఉంచితే ఏడాది పాటు ఇవి పాడవకుండా ఉంటాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


