గౌహతిలోని బార్‌సపారా స్టేడియం సోమవారం (మార్చి 30) రాత్రి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌కు సాక్ష్యంగా నిలిచింది. ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించాడు. చెన్నై బౌలర్లను ఉతికేస్తూ, కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
వైభవ్ దంచుడు

ఐపీఎల్ 2025 సీజన్ లో వైభవ్ సూర్యవంశీ అనే పేరు ప్రపంచానికి తెలిసింది. ఈ చిన్నోడు చెలరేగిపోయాడు. ఇప్పుడు ఐపీఎల్ 2026లోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ మ్యాచ్ లోనే క్రీజులోకి వచ్చినప్పటి నుంచి వైభవ్ దంచుడు మొదలెట్టాడు. రికార్డులు బ్రేక్ చేశాడు.
రికార్డుల వేటలో
ఐపీఎల్ 2026లో తన ఫస్ట్ మ్యాచ్ లోనే వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత మోగించాడు. కేవలం 15 బాల్స్ లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసిన ఈ యంగ్ సెన్సేషనల్ ప్లేయర్.. ఐపీఎల్ హిస్టరీలో మూడో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించాడు. ఐపీఎల్ లో ఈ కుర్రాడికి ఇదే వేగవంతమైన అర్ధశతకం.
గత ఏడాది జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 17 బంతుల్లో సాధించిన తన సొంత రికార్డును వైభవ్ అధిగమించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఇది సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. యశస్వి జైస్వాల్ (13 బాల్స్) ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
విధ్వంసమే
వైభవ్ క్రీజులోకి వస్తే విధ్వంసమే. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో అతని బ్యాటింగ్ అలాగే సాగింది. ఆరంభంలో కార్తీక్ శర్మ తన క్యాచ్ డ్రాప్ చేయడంతో వచ్చిన ఛాన్స్ ను వైభవ్ పూర్తిగా యూజ్ చేసుకున్నాడు. తర్వాతి బంతినే సిక్సర్‌గా మలిచి తన ఉద్దేశాన్ని చాటాడు. చివరికి 17 బంతుల్లో 305 స్ట్రైక్ రేట్‌తో 52 పరుగులు చేశాడు.
చెన్నై చిత్తు
రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై చిత్తయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.4 ఓవర్లలో 127 రన్స్ కే ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, జడేజా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఛేజింగ్ లో వైభవ్ సూర్యవంశీ చెలరేగడంతో రాజస్థాన్ విజయం నల్లేరుపై నడకలా మారింది.
{{/usCountry}}రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై చిత్తయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.4 ఓవర్లలో 127 రన్స్ కే ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, జడేజా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఛేజింగ్ లో వైభవ్ సూర్యవంశీ చెలరేగడంతో రాజస్థాన్ విజయం నల్లేరుపై నడకలా మారింది.
{{/usCountry}}రాజస్థాన్ 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ 4 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు.
అండర్-19 వరల్డ్ కప్ హీరో
వైభవ్ కేవలం ఐపీఎల్‌లోనే కాదు, జూనియర్ క్రికెట్‌లోనూ సంచలనాలు సృష్టించాడు. ఇటీవల జరిగిన U-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్ ఆరోసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. గత ఐపీఎల్ సీజన్‌లో 252 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించిన వైభవ్, ఈ సీజన్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగిస్తూ తనపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాడు.