మచ్ అవైటెడ్ 2026 రెనాల్ట్ డస్టర్‌ని సంస్థ ఎట్టకేలకు ఇండియాలో లాంచ్ చేసింది. జనవరిలో ఈ ఎస్‌యూవీని ఆవిష్కరించిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.. మంగళవారం జరిగిన ఈవెంట్లో భాగంగా రెనాల్ట్ డస్టర్‌కి సంబంధించిన ధరలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఎస్యూవీ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
2026 రెనాల్ట్ డస్టర్ ఎస్యూవీ ఎక్స్‌షోరూం ధరలు..
రెనాల్ట్ డస్టర్ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధరను రూ. 10.49లక్షలుగా నిర్ణయించారు. కాగా, సంస్థకు చెందిన “ఆర్-పాస్”ని తీసుకున్న వారికి దీని ధర రూ. 10.29లక్షలకు తగ్గుతుంది.
ఇంజిన్ వారీగా ఎక్స్‌షోరూం ధరల వివరాలు-
టర్బో టీసీఈ 100 ఎంటీ-
ఆథెంటిక్:- స్టాండర్డ్- రూ. 10.49 లక్షలు, ఆర్- పాస్‌తో రూ. 10.29 లక్షలు
ఇవొల్యూషన్:- స్టాండర్డ్- రూ. 11.69 లక్షలు, ఆర్- పాస్‌తో రూ. 11.39 లక్షలు
టెక్నో:- స్టాండర్డ్- రూ. 13.49 లక్షలు, ఆర్- పాస్‌తో రూ. 13.19 లక్షలు
టర్బో టీసీఈ 160 ఎంటీ-
ఇవొల్యూషన్:- స్టాండర్డ్- రూ. 12.99 లక్షలు, ఆర్- పాస్‌తో రూ. 12.69 లక్షలు
టెక్నో:- స్టాండర్డ్- రూ. 14.49 లక్షలు, ఆర్- పాస్‌తో రూ. 14.19 లక్షలు
టెక్నో+ :- స్టాండర్డ్- రూ. 15.29 లక్షలు, ఆర్- పాస్‌తో రూ. 14.99 లక్షలు
ఐకానిక్:- స్టాండర్డ్- రూ. 16.99 లక్షలు, ఆర్- పాస్‌తో రూ. 16.59 లక్షలు
టర్బో టీసీఈ 160 డీసీటీ-
ఇవొల్యూషన్:- స్టాండర్డ్- రూ. 14.49 లక్షలు, ఆర్- పాస్‌తో రూ. 13.99 లక్షలు
టెక్నో:- స్టాండర్డ్- రూ. 15.89 లక్షలు, ఆర్- పాస్‌తో రూ. 15.49 లక్షలు
{{/usCountry}}టెక్నో:- స్టాండర్డ్- రూ. 15.89 లక్షలు, ఆర్- పాస్‌తో రూ. 15.49 లక్షలు
{{/usCountry}}టెక్నో+ :- స్టాండర్డ్- రూ. 16.69 లక్షలు, ఆర్- పాస్‌తో రూ. 16.29 లక్షలు
ఐకానిక్:- స్టాండర్డ్- రూ. 18.49 లక్షలు, ఆర్- పాస్‌తో రూ. 18.09 లక్షలు
చివరి
2026 రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీపై 7ఏళ్ల వారంటీ..
'రెనాల్ట్ ఫరెవర్ ప్రోగ్రామ్'లో భాగంగా ఈ కొత్త డస్టర్ ఎస్‌యూవీపై 7ఏళ్ల వారంటీని ఇస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. తద్వారా కస్టమర్లతో దీర్ఘకాలిక అనుబంధాన్ని పెంచుకునేందుకు సంస్థ ముందడుగు వేసింది. ఈ వారంటీ అనేది ప్రతి ఏటా పెరుగుతూ వెళుతుంది. అంతేకాదు, కారును అమ్మినప్పుడు కొత్త ఓనర్‌కి కూడా చేరుతుంది. ఫలితంగా ఈ మోడల్ రీసేల్ వాల్యూ కూడా పెరుగుతుంది.
2026 రెనాల్ట్ డస్టర్ ఇంటీరియర్ అండ్ ఫీచర్స్..
రెనాల్ట్ డస్టర్ ఎస్యూవీ క్యాబిన్ లోపల రెనాల్ట్ విలాసవంతమైన, టెక్-ఓరియెంటెడ్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించే ప్రయత్నం చేసింది.
పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ ఆకట్టుకుంటాయి. యాంబియంట్ లైటింగ్, స్పోర్టీ లుక్ కోసం ఫాక్స్ కార్బన్-ఫైబర్ ఇన్‌సర్ట్స్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
గూగుల్ ఓఎస్‌పై నడిచే 10.1- ఇంచ్ టచ్‌స్క్రీన్, 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ వంటివి ఇందులో ఉన్నాయి.
డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ టెయిల్‌గేట్, 360-డిగ్రీ కెమెరా వంటివి లభిస్తున్నాయి.
ఆరు ఎయిర్‌బ్యాగులు, లెవల్ 2 అడాస్ ఫీచర్లతో ఈ 2026 రెనాల్ట్ డస్టర్ ఎస్యూవీ సేఫ్టీకి తిరుగు లేదు.
ఈ మోడల్‌కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అనాటి డస్టర్- ఇప్పుడు కొత్తగా..
భారత ఆటోమొబైల్ సెగ్మెంటోల్ రెనాల్ట్ డస్టర్ ఓ వెలుగు వెలిగిందనే చెప్పుకోవాలి. ఎస్యూవీ ప్రభంజనం ఇంకా మొదలవ్వని కాలంలోనే ఈ మోడల్ బెస్ట్ సెల్లింగ్‌గా దూసుకెళ్లింది. భారతీయల్లో ఒక ఎమోషన్‌గా నిలిచిపోయింది. కాగా అనంతర కాలంలో మాత్రం ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని తట్టుకోలేకపోయింది. ఫలితంగా, కొన్నేళ్ల క్రితం ఈ మోడల్ని ఇండియాలో సంస్థ డిస్కంటిన్యూ చేసింది.
నేటి లాంచ్‌తో డస్టర్‌ని రెనాల్ట్ తిరిగి ఇండియాలో సరికొత్తగా, భారతీయుల ఇష్టాలకు తగ్గట్టుగా లాంచ్ చేసింది. మరి ఈ మోడల్ భారతీయులను ఏమేరకు ఆకర్షిస్తుందో చూడాలి.