భారతీయ రోడ్లపై సెడాన్ కార్ల విభాగంలో మారుతీ సుజుకీ డిజైర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ మెయింటెనెన్స్, మెరుగైన మైలేజీతో మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఫేవరెట్ ఛాయిస్. అందుకే 2025లో ఇది ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కారుగా అవతరించింది. అయితే, పాత మోడల్‌తో పోల్చితే లేటెస్ట్ వర్షెన్ చాలా భిన్నంగా, అత్యాధునికంగా మారింది. మీరు ఈ కారును కొనే ఆలోచనలో ఉంటే, ఈ కింది 5 విషయాలను ఖచ్చితంగా గమనించాలి.
1. మారుతీ సుజుకీ డిజైర్- ధర, వేరియంట్లు..

కొత్త తరం మారుతీ సుజుకీ డిజైర్ ధర రూ. 6.25 లక్షల నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ మోడల్ రూ. 9.31 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది ఎల్ఎక్స్ఐ, వీఎక్స్, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ+ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ (ఎల్ఎక్స్ఐ) కేవలం పెట్రోల్-మాన్యువల్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా.. వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ వేరియంట్లలో మాత్రం ఆటోమేటిక్ (ఏఎంటీ), సీఎన్జీ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.
2. మారుతీ సుజుకీ డిజైర్- సరికొత్త డిజైన్ అప్‌డేట్..
నవంబర్ 2024లో లాంచ్ అయిన ఈ కొత్త డిజైర్.. పాత మోడల్‌తో పోలిస్తే పూర్తిస్థాయి మార్పులకు గురైంది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ ఇప్పుడు మరింత షార్ప్‌గా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది. క్యాబిన్ లోపల కూడా డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ మార్చారు. ఇది పాత డిజైర్ కంటే ఆధునికంగా, నేటి తరం స్టైల్‌కు తగ్గట్టుగా ఉంటుంది.
3. మారుతీ సుజుకీ డిజైర్- కొత్త ఇంజిన్, అద్భుతమైన మైలేజీ..
డిజైర్‌లో ఇప్పుడు సరికొత్త 1.2-లీటర్, త్రీ-సిలిండర్ 'జెడ్-సిరీస్' పెట్రోల్ ఇంజిన్‌ను వాడారు. ఇది 80 బీహెచ్పీ పవర్‌ని, 112 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మైలేజీ: దీని పెట్రోల్-మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.79 కి.మీ ఇస్తుండగా, ఏఎంటీ వెర్షన్ 25.71 కి.మీ మైలేజీని ఇస్తుంది.
{{/usCountry}}మైలేజీ: దీని పెట్రోల్-మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.79 కి.మీ ఇస్తుండగా, ఏఎంటీ వెర్షన్ 25.71 కి.మీ మైలేజీని ఇస్తుంది.
{{/usCountry}}సీఎన్జీ: మైలేజీ ప్రియుల కోసం సీఎన్జీ వేరియంట్ కూడా ఉంది, ఇది కిలో గ్యాస్‌కు ఏకంగా 33.73 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ బుకింగ్స్ షురూ.. ఏప్రిల్ 15న మార్కెట్లోకి!
4. మారుతీ సుజుకీ డిజైర్- అదిరిపోయే ఫీచర్లు..
టెక్నాలజీ పరంగా మారుతీ సుజుకీ ఈసారి రాజీ పడలేదు. స్విఫ్ట్ తరహాలోనే ఇందులో 9- ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ కనెక్టివిటీ, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, డిజైర్ చరిత్రలో మొదటిసారిగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా టాప్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటితో పాటు వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్లు రైడర్ సౌకర్యాన్ని పెంచుతాయి.
5. మారుతీ సుజుకీ డిజైర్- సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్..
మారుతీ సుజుకీ కార్లంటే సేఫ్టీ తక్కువ అనే అపవాదును ఈ కొత్త డిజైర్ చెరిపివేసింది! గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టుల్లో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించి, మారుతి సుజుకీ నుంచి వస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్సీ, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి కార్లకు ఈ కొత్త డిజైర్ గట్టి పోటీనిస్తోంది.
Electric Cars : సిటీ డ్రైవ్ కోసం ఈ 5 ఎలక్ట్రిక్ కార్లు బెస్ట్- రేంజ్లో తోపులు..
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. కొత్త డిజైర్‌లో సీఎన్జీ ఆప్షన్ అన్ని వేరియంట్లలోనూ లభిస్తుందా?
లేదు, సీఎన్జీ ఆప్షన్ కేవలం వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది.
2. మారుతీ సుజుకీ డిజైర్ సేఫ్టీ రేటింగ్ ఎంత?
కొత్త తరం మారుతీ డిజైర్ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టుల్లో అత్యుత్తమంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది.