Ultraviolette X 47 : 320 కి.మీ రేంజ్​తో కొత్త ఎలక్ట్రిక్​ బైక్​- మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు..

అల్ట్రావయోలెట్ సంస్థ తన ఎలక్ట్రిక్ బైక్​ శ్రేణిని ఎంతో అత్యాధునికంగా తీర్చిదిద్దింది. అయితే, ఇందులో ఉండే వేరియంట్లు, బ్యాటరీ సైజులు, ఫీచర్ల జాబితాను అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. ఈ నేపథ్యంలో అల్ట్రావయోలెట్​ఎక్స్​-47ని కొనుగోలు చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి..

Published on: Mar 11, 2026, 15:30:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మల్టిపుల్ వేరియంట్లు, రెండు రకాల బ్యాటరీ సైజులు, భారీ ఫీచర్ల జాబితాతో ఉన్న అల్ట్రావయోలెట్ ఎక్స్​-47 లైనప్‌ను మొదటి చూపులో అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఎంట్రీ లెవల్ 'ఒరిజినల్' నుంచి హై-ఎండ్ 'రీకాన్' వెర్షన్ల వరకు, వీటి మధ్య తేడాలు కేవలం బ్యాటరీ సామర్థ్యంలోనే కాదు, ఇతర అంశాల్లోనూ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్​ బైక్​ ధరలు రూ. 2.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. మీరు అల్ట్రావయోలెట్ ఎక్స్​-47ని కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన ఐదు కీలక విషయాలు ఇక్కడ ఉన్నాయి.

అల్ట్రావయోలెట్​ఎక్స్​-47 (Arjan Bahadur Singh/HT Auto)
అల్ట్రావయోలెట్​ఎక్స్​-47 (Arjan Bahadur Singh/HT Auto)

1. మీరు పొందే రేంజ్‌ను రెండు బ్యాటరీ ఆప్షన్లు నిర్ణయిస్తాయి..

ఎక్స్​-47 ఎలక్ట్రిక్​ బైక్​ రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. మీరు ఎంచుకునే బ్యాటరీని బట్టి బైక్ ఇచ్చే రేంజ్ పూర్తిగా మారిపోతుంది. బేస్ వేరియంట్లు 7.1 kWh బ్యాటరీని ఉపయోగిస్తుండగా, రీకాన్ వేరియంట్లు 10.3 kWh ప్యాక్‌ను కలిగి ఉంటాయి.

7.1 kWh బ్యాటరీ:

  • ఐడీసీ రేంజ్: 211 కి.మీ.
  • అంచనా వేసిన రేంజ్ (గ్లైడ్ మోడ్): 183 కి.మీ.
  • కాంబాట్ మోడ్: 144 కి.మీ.
  • బాలిస్టిక్ మోడ్: 128 కి.మీ.

10.3 kWh బ్యాటరీ:

  • ఐడీసీ రేంజ్: 323 కి.మీ.
  • అంచనా వేసిన రేంజ్ (గ్లైడ్ మోడ్): 266 కి.మీ.
  • కాంబాట్ మోడ్: 209 కి.మీ.
  • బాలిస్టిక్ మోడ్: 186 కి.మీ.

2. ఎలక్ట్రిక్ బైక్​గా దీని పర్ఫార్మెన్స్ చాలా పటిష్టమైనది!

అల్ట్రావయోలెట్ ఎక్స్​-47 ప్రధానంగా పర్ఫార్మెన్స్‌పై దృష్టి పెట్టింది. దీని బేస్ కాన్ఫిగరేషన్ కూడా చాలా వేగంగా ఉంటుంది.

పీక్ పవర్: బేస్ వెర్షన్లలో 27 kW (36.2 హెచ్​పీ) కాగా, హై-ఎండ్ వేరియంట్లలో 30 kW (40.2 హెచ్​పీ).

పీక్ టార్క్: వేరియంట్‌ను బట్టి 90 ఎన్​ఎం / 100 ఎన్​ఎం.

రియర్ వీల్ టార్క్: 610 ఎన్​ఎం వరకు.

యాక్సలరేషన్​:

0–60 కి.మీ/గం: 2.7–2.8 సెకన్లు.

0–100 కి.మీ/గం: 8.1–8.2 సెకన్లు.

గరిష్ట వేగం: 145 కి.మీ/గం.

రైడింగ్ మోడ్స్: ఇందులో గ్లైడ్, కాంబాట్, బాలిస్టిక్ అనే మూడు మోడ్స్ ఉన్నాయి.

హై-ఎండ్ వేరియంట్లలో 10 లెవల్స్ వరకు రీజెనరేటివ్ బ్రేకింగ్ సౌకర్యం ఉంది.

3. రాడార్ ఆధారిత భద్రత అన్ని వేరియంట్లలో స్టాండర్డ్..

అల్ట్రావయోలెట్ ఎక్స్​-47 ఎలక్ట్రిక్​ బైక్​లోని అతిపెద్ద హైలైట్ దాని 77 జీహెచ్​జెడ్​ రాడార్ ఆధారిత రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్. దీనిని అల్ట్రావయోలెట్ 'UV Hypersense' అని పిలుస్తుంది. ఇది అన్ని వేరియంట్లలోనూ లభిస్తుంది. ఇందులో:

లేన్ చేంజ్ అసిస్ట్

ఓవర్‌టేక్ అలర్ట్

బ్లైండ్ స్పాట్ డిటెక్షన్

రియర్ కొలీజన్ వార్నింగ్

దీనితో పాటు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్​, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

4. వేరియంట్‌ను బట్టి ఛార్జింగ్ ఆప్షన్లు మారుతాయి..

అల్ట్రావయోలెట్ ఎక్స్​-47లో ఛార్జింగ్ సౌలభ్యం వేరియంట్‌ను బట్టి మారుతుంది:

పోర్టబుల్ ఛార్జర్: 20–80% ఛార్జింగ్‌కు 3 గంటల 30 నిమిషాలు (7 kWh) నుంచి 5 గంటల (10 kWh) సమయం పడుతుంది.

బూస్ట్ ఛార్జర్: 20–80% ఛార్జింగ్‌కు 1 గంట 45 నిమిషాలు (7 kWh) నుంచి 2 గంటల 30 నిమిషాలు (10 kWh) సమయం పడుతుంది.

యూవీ సూపర్ నోవా+ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్: 20–80% ఛార్జింగ్‌ కేవలం 40 నిమిషాలు (7 kWh) నుంచి 60 నిమిషాల్లో (10 కేడబ్ల్యూహెచ్​) పూర్తవుతుంది.

5. బ్యాటరీ సైజు, ఎక్విప్‌మెంట్, వారంటీలో వ్యత్యాసాలు..

అల్ట్రావయోలెట్ ఎక్స్​-47 లైనప్ ప్రధానంగా మూడు వేరియంట్లుగా ఉంటుంది.

అల్ట్రావయోలెట్ ఎక్స్​-47 ఆరిజిన్​ (ఎక్స్​షోరూం ధర: రూ. 2.49 లక్షలు): 7.1 kWh బ్యాటరీ, స్టాండర్డ్ ఛార్జర్, 3 ఏళ్లు/60,000 కి.మీ బ్యాటరీ వారంటీ, బేసిక్ రీజెన్, ట్రాక్షన్ కంట్రోల్.

అల్ట్రావయోలెట్ ఎక్స్​-47 ఒరిజినల్​+ (ఎక్స్​షోరూం ధర: రూ. 2.99 లక్షలు): 7.1 kWh బ్యాటరీ, ఆన్-బోర్డ్ ఛార్జర్, అడ్వాన్స్‌డ్ రైడ్ కంట్రోల్ ప్యాక్, 5 ఏళ్లు/1,00,000 కి.మీ బ్యాటరీ వారంటీ.

అల్ట్రావయోలెట్ ఎక్స్​-47 రికాన్​ (ఎక్స్​షోరూం ధర: రూ. 3.49 లక్షలు): 10.3 kWh బ్యాటరీ, క్రాష్ ప్రొటెక్షన్ (నకిల్ గార్డ్ + బుల్‌బార్), అడ్వాన్స్‌డ్ రైడ్ కంట్రోల్ ప్యాక్, ప్రీమియం కనెక్టివిటీ.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More