...
...
Next Story

Bank holiday today : నేడు బ్యాంకులకు సెలవు.. తెలుగు రాష్ట్రాల్లోనూ క్లోజ్

హోలీ సందర్భంగా నేడు బ్యాంకులకు సెలవు ఉంటుంది. హైదరాబాద్​తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో మార్చి 3 2026 బ్యాంకులు పనిచేయవు. ఈ నెలలో మిగిలిన బ్యాంకు సెలవుల వివరాలను సైతం ఇక్కడ తెలుసుకుని మీ పనులను ప్లాన్​ చేసుకోండి..

Published on: Mar 3, 2026, 09:11:08 IST
Advertisement

మీరు ఈరోజు బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. నేడు (మార్చి 3, మంగళవారం) హోలీ, హోలికా దహన్, ధులండి వంటి పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ (హైదరాబాద్), ఆంధ్రప్రదేశ్ (విజయవాడ)లలో కూడా ఈరోజు బ్యాంకులు పనిచేయవు.

తెలుగు రాష్ట్రాల్లో నేడు బ్యాంకులకు సెలవు.. (File Photo )
తెలుగు రాష్ట్రాల్లో నేడు బ్యాంకులకు సెలవు.. (File Photo )

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం.. 2026 మార్చి నెలలో రెండో శనివారం, ఆదివారాలతో కలిపి మొత్తం 18 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వాటిల్లో హోలీ కూడా ఒకటి.

నేడు (మార్చి 3) ఏ ఏ నగరాల్లో బ్యాంకులు క్లోజ్?

నేడు హోలీ (రెండో రోజు), డోల్ జాత్రా, అట్టుకల్ పొంగాల వంటి ప్రాంతీయ పండుగల కారణంగా ఈ క్రింది నగరాల్లో బ్యాంకులు పనిచేయవు:

తెలుగు రాష్ట్రాలు: హైదరాబాద్, విజయవాడ సహా ఇతర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.

ఇతర నగరాలు: ముంబై, బెలాపూర్, నాగ్‌పూర్ (మహారాష్ట్ర), భోపాల్ (మధ్యప్రదేశ్), డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), గువహటి (అస్సాం), జైపూర్ (రాజస్థాన్), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్), లక్నో (ఉత్తరప్రదేశ్), పనాజీ (గోవా), పాట్నా (బీహార్), రాంచీ (జార్ఖండ్), తిరువనంతపురం (కేరళ).

అయితే, కొన్ని రాష్ట్రాల్లో (ఉదాహరణకు దిల్లీ, గుజరాత్, హర్యానా) హోలీ సెలవు రేపు, అంటే మార్చి 4 (బుధవారం) నాడు ఉంది. కాబట్టి మీ స్థానిక బ్యాంక్ షెడ్యూల్‌ను ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం.

మార్చి 2026 సెలవుల పూర్తి జాబితా:

మార్చి 1: ఆదివారం (దేశవ్యాప్తంగా సెలవు)

మార్చి 3: హోలీ/డోల్ జాత్రా (హైదరాబాద్, విజయవాడ, ముంబై సహా పలు నగరాలు)

మార్చి 4: ధులేటి/యాయోసాంగ్ (దిల్లీ, అహ్మదాబాద్, పాట్నా సహా పలు నగరాలు)

మార్చి 8: ఆదివారం

మార్చి 13: చాప్‌చార్ కుట్ (ఐజ్వాల్)

మార్చి 14: రెండో శనివారం

మార్చి 15: ఆదివారం

మార్చి 17: షాబ్-ఇ-ఖద్ర్ (జమ్మూ అండ్​ శ్రీనగర్)

మార్చి 19: ఉగాది/తెలుగు నూతన సంవత్సరం/గుడి పడ్వా (హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై)

మార్చి 20: ఈద్-ఉల్-ఫితర్/జుమత్-ఉల్-విదా (విజయవాడ, కొచ్చి, జమ్మూ)

మార్చి 21: రంజాన్ ఈద్ (హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాలు)

మార్చి 22: ఆదివారం

మార్చి 26: శ్రీరామ నవమి (ముంబై, కోల్‌కతా, లక్నో, జైపూర్)

మార్చి 27: శ్రీరామ నవమి (హైదరాబాద్, విజయవాడ, భోపాల్, పాట్నా)

మార్చి 28: నాలుగో శనివారం

మార్చి 29: ఆదివారం

మార్చి 31: మహావీర్ జయంతి (అహ్మదాబాద్, ముంబై, దిల్లీ, బెంగళూరు)

బ్యాంకులు సెలవు ఉన్నప్పుడు ఏం చేయాలి?

బ్యాంకులు మూతపడినా డిజిటల్ సేవలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి:

ఆన్‌లైన్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు.

యూపీఐ: ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు యధావిధిగా పనిచేస్తాయి.

ఏటీఎం: నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు తెరిచే ఉంటాయి.

గమనిక: చెక్కుల జారీ, క్లియరెన్స్ వంటి పనులు మాత్రం సెలవు రోజుల్లో జరగవు.

బ్యాంకులు మాత్రమే కాదు స్టాక్​ మార్కెట్​ కూడా!

ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు కీలక అలర్ట్​! ఈ రోజు దేశీయ స్టాక్​ మార్కెట్​లకు సెలవు. బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు మూతపడి ఉంటాయి. అంతేకాదు, ఈ నెలలోనే స్టాక్​ మార్కెట్​లకు మరో రెండు రోజులు సెలవులు లభిస్తున్నాయి. పూర్తి వివరాల తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks