భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కియా సెల్టోస్ తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే 6 లక్షల విక్రయాల మైలురాయిని దాటడమే కాకుండా, భరత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి సత్తా చాటింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో కంపెనీ సెల్టోస్ లైనప్‌లో మరో రెండు ప్రీమియం వేరియంట్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోందని సమాచారం అవే జీటీఎక్స్ (ఓ), ఎక్స్-లైన్ (ఓ).

ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీటీఎక్స్ (ఏ), ఎక్స్-లైన్ (ఏ) వేరియంట్లకు ఇవి మరింత అప్‌గ్రేడెడ్ వెర్షన్లుగా రానున్నాయి. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, భారత్ ఎన్సీఏపీ సేఫ్టీ టెస్ట్ పత్రాల్లో ఈ పేర్లు స్పష్టంగా కనిపించాయి.
కియా సెల్టోస్‌లో కొత్త వేరియంట్లు- కొత్తగా రానున్న ఫీచర్లు ఇవే..
బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీ కియా సెల్టోస్ కొత్త వేరియంట్లలో గతంలో మిస్ అయిన కొన్ని హై-ఎండ్ ఫీచర్లను సంస్థ మళ్లీ తీసుకువస్తోంది. అవి..
హెడ్-అప్ డిస్‌ప్లే (హెచ్యూడీ): పాత సెల్టోస్‌లో ఉండి, కొత్త జనరేషన్‌లో తీసేసిన ఈ ఫీచర్ మళ్లీ రానుంది.
డ్యాష్‌కామ్: ఫ్యాక్టరీ ఫిటెడ్ లేదా డీలర్ ద్వారా అమర్చే డ్యాష్‌కామ్ సౌకర్యం.
పవర్డ్ ప్యాసింజర్ సీట్: డ్రైవర్‌తో పాటు పక్కన కూర్చునే వారికి కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్.
సీట్ మెమరీ ఫంక్షన్: డ్రైవర్ సౌకర్యార్థం సీట్ పొజిషన్‌ను సేవ్ చేసుకునే ఆప్షన్.
ఎయిర్ ప్యూరిఫైయర్, ఇన్-బిల్ట్ నావిగేషన్ వంటి అదనపు వసతులు.
కియా సెల్టోస్‌లో కొత్త వేరియంట్లు- ఇంజిన్ వివరాలు..
కియా సెల్టోస్ జీటీఎక్స్ శ్రేణిలో అగ్రెసివ్ బంపర్లు, క్రిస్టల్-కట్ అలాయ్ వీల్స్, గ్రీన్ బ్రేక్ కాలిపర్లు ఉండగా.. ఎక్స్- లైన్ వేరియంట్ తన ట్రేడ్ మార్క్ మ్యాట్ ఫినిష్ పెయింట్, బ్లాక్డ్-అవుట్ స్టైలింగ్, రగ్గడ్ లుక్‌ను కొనసాగించనుంది. ఇక 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు అలాగే ఉంటాయి.
ఈ కొత్త వేరియంట్లు రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నాయి:
{{/usCountry}}ఈ కొత్త వేరియంట్లు రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నాయి:
{{/usCountry}}1.5ఎల్ టర్బో పెట్రోల్: 160 హెచ్‌పీ పవర్, 253 ఎన్ఎం టార్క్ (7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్).
1.5L డీజిల్: 116 హెచ్‌పీ పవర్, 250 ఎన్ఎం టార్క్ (6-స్పీడ్ ఆటోమేటిక్).
కియా సెల్టోస్ కొత్త వేరియంట్లు- లాంచ్ ఎప్పుడు?
కియా సెల్టోస్‌లో రెండు కొత్త వేరియంట్లు మే లేదా జూన్ 2026 నాటికి మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న టాప్ వేరియంట్ల కంటే కొంచెం ఎక్కువగా అంటే రూ. 19 లక్షల నుంచి రూ. 22 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండవచ్చని అంచనా.
ఫ్యామిలీ ఎస్‌యూవీ కియా సెల్టోస్‌కి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్..
మరో వార్తలో భారత్ ఎన్సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో 2026 కియా సెల్టోస్ ఎస్‌యూవీకి అద్భుతమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో 32 పాయింట్లకు గాను 31.70 పాయింట్లు, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు సాధించి మెరిసింది.
భారత్ ఎన్సీఏపీ ఈ పరీక్షల కోసం కియా సెల్టోస్ డీజిల్-ఆటోమేటిక్ వేరియంట్లు హెచ్‌టీఈ (ఓ), జీటీఎక్స్ వేరియంట్లను ఉపయోగించింది. అయితే, ఈ 5-స్టార్ రేటింగ్ సెల్టోస్‌లోని అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. విశేషం ఏంటంటే, ఈ నెల ప్రారంభంలో పరీక్షించిన టాటా సియెర్రా కంటే సెల్టోస్ స్వల్పంగా మెరుగైన స్కోరు సాధించింది! అంతేకాకుండా, ఇప్పటివరకు భారత్ ఎన్సీఏపీ పరీక్షించిన ఐసీఈ (ఇంధన శక్తితో నడిచే) వాహనాల్లో అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.