బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ- కాంగ్రెస్‌తో కూడిన విపక్ష మహాఘటబంధన్, ప్రశాంత్ కిశోర్‌కి చెందిన జన్ సురాజ్ పార్టీలు అధికార ఎన్డీఏకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి! శుక్రవారం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్డీఏకి స్పష్టమైన ఆధిక్యం లభిస్తోంది. విపక్షాలు డీలా పడిన వేళ.. ఇప్పుడు 'అతిపెద్ద పార్టీ' పొజిషన్ కోసం ఎన్డీఏలోని బీజేపీ- జేడీయూలు తీవ్రంగా పోటీపడుతున్నాయి.
బీహార్ ఎన్నికల ఫలితాలు 2025- ఎన్డీఏ పార్టీల మధ్యే పోటీ!
బీహార్ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం సీట్లు 243లో మెజారిటీ మార్క్ 122గా ఉంది. ఉదయం 11 గంటల వరకు ఉన్న డేటా ప్రకారం..
ఎన్డీఏ- 182 సీట్లతో ముందంజలో ఉంది.
మహాఘటబంధన్- 56 చోట్ల ఆధిక్యంలో ఉంది.
జేఎస్పీ- ఇప్పటివరకు ఉన్న ఆధిక్యాన్ని (5 సీట్లల్లో) కూడా కోల్పోయింది!
ఇతరులు- 5 చోట్ల ముందంజలో ఉన్నారు.
- బీహార్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదిలా ఉండగా..
ఎన్డీఏలో ప్రధాన పార్టీలైన బీజేపీ, నితీశ్ కమార్కి చెందిన జేడీయూ మధ్య 'అతిపెద్ద పార్టీ' పేరు కోసం తీవ్ర పోటీ కొనసాగుతోంది!
జేడీయూ 80 సీట్లతో దూసుకెళుతుండగా, బీజేపీ 78 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రెండు పార్టీల మధ్య నువ్వా- నేనా అన్నట్టు జరుగుతున్న పోరులో సీట్ల ఆధిక్యం ఎప్పటికప్పుడు మారుతూనే వస్తోంది.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో పోల్చితే బీజేపీకే ఎక్కువ సీట్లు దక్కాయి.
మరోవైపు మహాఘటబంధన్‌లో కీలకమైన, తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 43 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక ఒకానొక దశలో 11 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న మరో కీలక పార్టీ కాంగ్రెస్.. ఇప్పుడు 5 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025: నేపథ్యం
{{/usCountry}}మరోవైపు మహాఘటబంధన్‌లో కీలకమైన, తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 43 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక ఒకానొక దశలో 11 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న మరో కీలక పార్టీ కాంగ్రెస్.. ఇప్పుడు 5 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025: నేపథ్యం
{{/usCountry}}ప్రధాన పోటీ: 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో ప్రధాన పోటీ బీజేపీ, జేడీయూ ఉన్న ఎన్డీఏ కూటమికి, ఆర్జేడీ- కాంగ్రెస్ ఉన్న మహాఘటబంధన్‌కు మధ్య నెలకొంది.
ముఖ్యమంత్రి అభ్యర్థి: మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్. ఎన్డీఏ కూటమి అధికారికంగా ఎవరి పేరును ప్రకటించకపోయినా, మద్దతుదారులు మాత్రం నితీశ్ కుమారే మళ్లీ సీఎం అవుతారని నమ్ముతున్నారు.
2020 ఎన్నికలు: 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తక్కువ మెజారిటీతో (125 సీట్లు) అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ 74 సీట్లతో డామినెంట్ భాగస్వామిగా నిలవగా, జేడీయూ 43 సీట్లు గెలుచుకుంది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘటబంధన్ 110 సీట్లు గెలిచి, సింగిల్-లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.
నితీష్ కుమార్ రాజకీయ మలుపులు: ప్రస్తుత అసెంబ్లీ కాలంలో నితీష్ కుమార్ రెండుసార్లు కూటమిని మార్చారు. 2022 ఆగస్టులో ఎన్డీఏ వీడి ఆర్జేడీతో జట్టు కట్టారు (తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు), ఆపై 2024 జనవరిలో మళ్లీ ఎన్డీఏలోకి తిరిగి వచ్చారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనా: చాలా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ సునాయాసంగా గెలుస్తుందని అంచనా వేశాయి. అయితే, 'యాక్సిస్ మై ఇండియా' వంటి కొన్ని సంస్థలు మాత్రం బీజేపీ-జేడీ(యూ) కూటమికి స్వల్ప ఆధిక్యతతో గట్టి పోటీ ఉంటుందని అంచనా వేశాయి.