ఈ ఫిబ్రవరి 2026లో కొత్త కారు తీసుకునే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఇది మీకోసమే! దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా.. తన పోర్ట్‌ఫోలియోలోని కొన్ని మోడల్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. వీటి ద్వారా మీరు గరిష్ఠంగా రూ. 1.97 లక్షల వరకు పొదుపు చేసే అవకాశం ఉంటుంది! ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బెనిఫిట్, లాయల్టీ బోనస్ వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోండా కార్లు, వాటిపై లభిస్తున్న డిస్కౌంట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హోండా కార్లపై డిస్కౌంట్లు- మోడళ్ల వారీగా ఆఫర్లు..

1. హోండా ఎలివేట్
తగ్గింపు: రూ. 1.48 లక్షల వరకు.
ఇండియాలో హోండాకి ఉన్న బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ ఈ ఎలివేట్.
ఈ మిడ్‌సైజ్ ఎస్‌యూవీలో హోండా సిటీ పెట్రోల్ ఇంజనే ఉంటుంది. ఇది మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా సియెర్రా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి కార్లతో పోటీపడుతుంది.
2. హోండా సిటీ
హైబ్రిడ్ వెర్షన్ (e:HEV): ₹1.97 లక్షల వరకు తగ్గింపు.
పెట్రోల్ వెర్షన్: రూ. 1.28 లక్షల వరకు తగ్గింపు.
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ సెడాన్లలో ఒకటిగా కొనసాగుతోంది ఈ హోండా సిటీ.
ఫీచర్లు: హోండా సిటీ హైబ్రిడ్‌లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి (126 హెచ్‌పీ/253 ఎన్ఎం అవుట్‌పుట్). పెట్రోల్ వెర్షన్‌లో 121 హెచ్‌పీ పవర్ ఇచ్చే 1.5-లీటర్ ఇంజన్ ఉంటుంది. ఇది మాన్యువల్ లేదా సీవీటీ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
3. హోండా అమేజ్
సెకెండ్ జనరేషన్: రూ. 68,000 వరకు తగ్గింపు.
థర్డ్ జనరేషన్ : రూ. 57,000 వరకు తగ్గింపు.
వివరాలు: రెండు తరాల అమేజ్ మోడల్స్‌లోనూ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (90 హెచ్‌పీ/110 ఎన్ఎం) ఉంటుంది. ఇవి కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మారుతీ సుజుకీ డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్లకు పోటీగా నిలుస్తాయి.
ముఖ్య గమనిక:
{{/usCountry}}వివరాలు: రెండు తరాల అమేజ్ మోడల్స్‌లోనూ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (90 హెచ్‌పీ/110 ఎన్ఎం) ఉంటుంది. ఇవి కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మారుతీ సుజుకీ డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్లకు పోటీగా నిలుస్తాయి.
ముఖ్య గమనిక:
{{/usCountry}}* పైన చెప్పినవి ఎక్స్‌షోరూం ధరలు అని గుర్తుపెట్టుకోవాలి.
* హోండా కార్లపై ఈ ఆఫర్లు నగరం, వేరియంట్, స్టాక్ లభ్యతను బట్టి మారుతుంటాయి. ఖచ్చితమైన వివరాల కోసం మీ సమీప హోండా డీలర్‌ను సంప్రదించండి. మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి.
హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లు..
హోండా మాత్రమే కాదు హ్యుందాయ్ సంస్థ కూడా ఈ ఫిబ్రవరి 2026లో కస్టమర్స్‌ని ఆకర్షించేందుకు అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ని బట్టి అత్యధికంగా రూ. 73వేల వరకు తగ్గింపును ఇస్తోంది.
హ్యుందాయ్ వెర్నా: ఈ మిడ్‌సైజ్ సెడాన్‌పై ఫిబ్రవరిలో అత్యధికంగా రూ. 73,000 వరకు బెనిఫిట్స్‌ని ఇస్తోంది హ్యుందాయ్ సంస్థ. సౌకర్యవంతమైన ప్రయాణం, అత్యాధునిక ఫీచర్లు కోరుకునే వారికి వెర్నా ఎప్పుడూ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.
హ్యుందాయ్ ఐ20: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన ఐ20పై రూ. 48,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. దీనితో పాటు, ఐ20లోని కొన్ని వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలను హ్యుందాయ్ సవరించింది.
పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.