భారత్, చైనాల మధ్య మెరుగుపడుతున్న సంబంధాలను చూసి అమెరికా ఓర్వలేకపోతోందని, ఇరు దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని చైనా తీవ్ర ఆరోపణలు చేసింది. గురువారం జరిగిన మీడియా సమావేశంలో చైనా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. అమెరికా తన రక్షణ విధానాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ భారత్‌తో తమకున్న సత్సంబంధాలను దెబ్బతీసేందుకు చూస్తోందని మండిపడ్డారు.
భారత్‌తో బంధంపై చైనా ఏమందంటే?

ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో శాంతి నెలకొనడంపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు లిన్ జియాన్ సమాధానమిస్తూ.. తాము భారత్‌తో సంబంధాలను 'వ్యూహాత్మక, సుదీర్ఘ కాలం' పాటు కొనసాగే దృక్పథంతో చూస్తామని స్పష్టం చేశారు. అయితే, అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ఇటీవల కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదికలో.. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తన 'కీలక ప్రయోజనాల్లో' (Core Interests) భాగంగా పేర్కొందని తెలిపింది. 2049 నాటికి చైనాను తిరుగులేని శక్తిగా మార్చాలనే లక్ష్యంలో భాగంగానే ఈ ప్రాదేశిక వాదనలు చేస్తున్నట్లు పెంటగాన్ నివేదిక పేర్కొంది.
తైవాన్, దక్షిణ చైనా సముద్ర వివాదాలు, సెంకాకు దీవులతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌ను కూడా తన అంతర్భాగంగా చైనా భావిస్తోందని అమెరికా చెబుతోంది.
తైవాన్ ఒప్పందంపై యుద్ధ హెచ్చరిక
మరోవైపు, తైవాన్‌కు అమెరికా ప్రకటించిన భారీ ఆయుధ విక్రయ ఒప్పందంపై చైనా నిప్పులు చెరిగింది. గడిచిన వారం రోజుల్లో అమెరికా సుమారు 11.1 బిలియన్ డాలర్ల (దాదాపు ₹93,000 కోట్లు) విలువైన ఆయుధాల విక్రయానికి అంగీకరించింది. తైవాన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఒప్పందం.
దీనిపై చైనా రక్షణ శాఖ ప్రతినిధి జాంగ్ జియాగాంగ్ స్పందిస్తూ.. "అమెరికా చర్యలు తైవాన్ జలసంధిలో యుద్ధ ముప్పును వేగవంతం చేస్తున్నాయి. వాషింగ్టన్ వెంటనే తన తప్పుడు నిర్ణయాలను సరిదిద్దుకోవాలి, రెచ్చగొట్టే చర్యలను ఆపాలి" అని హెచ్చరించారు.
టిక్‌టాక్ డీల్, జపాన్‌తో వివాదం
అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలను ఇతర కంపెనీలకు (ఒరాకిల్ వంటి సంస్థలు ఉన్న కన్సార్టియం) బదిలీ చేయడంపై కూడా చైనా స్పందించింది. చైనా చట్టాలకు లోబడి, అన్ని పక్షాల ప్రయోజనాలను కాపాడే పరిష్కారం రావాలని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరింది. చైనీస్ కంపెనీలకు అమెరికాలో పక్షపాతం లేని వ్యాపార వాతావరణం కల్పించాలని సూచించింది.
{{/usCountry}}అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలను ఇతర కంపెనీలకు (ఒరాకిల్ వంటి సంస్థలు ఉన్న కన్సార్టియం) బదిలీ చేయడంపై కూడా చైనా స్పందించింది. చైనా చట్టాలకు లోబడి, అన్ని పక్షాల ప్రయోజనాలను కాపాడే పరిష్కారం రావాలని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరింది. చైనీస్ కంపెనీలకు అమెరికాలో పక్షపాతం లేని వ్యాపార వాతావరణం కల్పించాలని సూచించింది.
{{/usCountry}}ఇక జపాన్ ప్రధాని సనాయే తకైచి వ్యాఖ్యలపై చైనా అసహనం వ్యక్తం చేసింది. చైనాపై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం ఆపాలని జపాన్‌కు హితవు పలికింది. అయితే, చైనాతో చర్చలకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, నిర్మాణాత్మక సంబంధాలను తాము కోరుకుంటున్నామని తకైచి పేర్కొనడం గమనార్హం. గత నెలలో తైవాన్ అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు (చైనా దాడి చేస్తే జపాన్ సైన్యం జోక్యం చేసుకోవచ్చని) ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి.