రేపటితో ముగియనున్న CUET PG 2026 రిజిస్ట్రేషన్లు- ఇలా అప్లై చేసుకోండి..

దేశవ్యాప్త కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీయూఈటీ పీజీ 2026 దరఖాస్తు గడువు రేపు, అంటే జనవరి 20తో ముగియనుంది. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది.

Published on: Jan 19, 2026, 05:37:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో పీజీ చేయాలనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ పీజీ) - 2026 దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 20వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అర్హత కలిగిన విద్యార్థులు ఆ లోపే ఫీజు చెల్లించి, తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

సీయూఈటీ పీజీ అప్డేట్స్​..
సీయూఈటీ పీజీ అప్డేట్స్​..

సీయూఈటీ పీజీ 2026 రిజిస్ట్రేషన్​- ఫీజు చెల్లిస్తేనే అప్లికేషన్ పూర్తి..

దరఖాస్తు ఫారమ్ నింపడమే కాకుండా, నిర్ణీత దరఖాస్తు రుసుమును విజయవంతంగా చెల్లించిన వారిని మాత్రమే సీయూఈటీ పీజీ 2026 అభ్యర్థులుగా పరిగణిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది.

"ఫీజు చెల్లించే ముందే అభ్యర్థులు తమ వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. ఒక్కసారి ఫీజు చెల్లించాక, వివరాల్లో ఎలాంటి మార్పులు చేసేందుకు అవకాశం ఉండదు," అని అధికారులు స్పష్టం చేశారు.

సీయూఈటీ పీజీ 2026 రిజిస్ట్రేషన్​- కావాల్సిన ముఖ్యమైన పత్రాలు..

సీయూఈటీ పీజీ 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి కావాలంటే అభ్యర్థులు ఈ కింది పత్రాలను ముందుగానే స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. అవి..

10వ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా.

పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం.

ఆధార్ కార్డు.

కుల ధృవీకరణ పత్రం (రిజర్వేషన్ వర్తించే వారైతే).

నివాస ధృవీకరణ పత్రం.

పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం.

  • ఇంకొన్ని రోజుల్లో JEE Mains 2026 సెషన్​ 1- మెరుగైన ఫలితాల కోసం రివిజన్​ టిప్స్​- పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

సీయూఈటీ పీజీ 2026 రిజిస్ట్రేషన్​ ఇలా..

స్టెప్​ 1- ముందుగా అధికారిక వెబ్‌సైట్ exams.nta.nic.in/cuet-pg ని సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో కనిపించే 'రిజిస్ట్రేషన్' లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- ప్రాథమిక వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి.

స్టెప్​ 4- అనంతరం మీకు వచ్చిన లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.

స్టెప్​ 5- దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలను జాగ్రత్తగా నింపండి.

స్టెప్​ 6 - అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.

స్టెప్​ 7- చివరిగా అప్లికేషన్ సబ్మిట్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ఒక ప్రింటవుట్ తీసి పెట్టుకోండి.

పరీక్షకు సంబంధించిన తాజా అప్‌డేట్స్, ఇతర సమాచారం కోసం విద్యార్థులు ఎప్పటికప్పుడు https://exams.nta.nic.in/cuet-pg/ వెబ్‌సైట్‌ను చూడాలని ఎన్టీఏ సూచించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More