...
...
Next Story

IPL 2026: వాట్ ఏ థ్రిల్ల‌ర్‌.. లాస్ట్ బాల్‌కు ష‌మి సిక్స‌ర్‌.. ఐపీఎల్ 2026లో ఫస్ట్ సూపర్ ఓవర్.. లక్నో చెత్త రికార్డు

IPL 2026: వాట్ ఏ థ్రిల్లర్.. వాట్ ఏ మ్యాచ్! పేసర్ షమి లాస్ట్ బాల్ సిక్సర్ తో అదరగొట్టాడు. మ్యాచ్ ను సూపర్ ఓవర్ కు మళ్లించాడు. కానీ ఐపీఎల్ 2026లో ఫస్ట్ సూపర్ ఓవర్ లో చెత్త రికార్డు మూటగట్టుకున్న లక్నో చివరికి ఓటమి పాలైంది.

Published on: Apr 27, 2026, 06:13:21 IST
Advertisement

IPL 2026: హోరాహోరీ మ్యాచ్ లతో రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ 2026లో మరో అదిరిపోయే థ్రిల్లర్. ఆదివారం (ఏప్రిల్ 26) రాత్రి అద్భుతమే జరిగింది. ఐపీఎల్ 2026లో ఫస్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది. లాస్ట్ బాల్ కు మహ్మద్ షమి సిక్సర్ కొట్టి పోరును థ్రిల్లర్ గా మార్చాడు. కానీ ఏం లాభం? సూపర్ ఓవర్లో లక్నో చెత్త రికార్డు మూటగట్టుకుంది.

షమి సిక్సర్

మహ్మద్ షమి
మహ్మద్ షమి

ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. 156 రన్స్ ఛేజింగ్ లో లక్నో 20 ఓవర్లకు సరిగ్గా 155 పరుగులు చేసింది. లక్నో గెలవాలంటే లాస్ట్ ఓవర్లో 17 పరుగులు చేయాల్సి వచ్చింది.

కోల్ కతా బౌలర్ కార్తీక్ త్యాగి ఆ ఓవర్లో రెండు నో బాల్స్ వేశాడు. హిమ్మత్ సింగ్ వికెట్ పడగొట్టాడు. అయితే లాస్ట్ బాల్ కు ఏడు రన్స్ చేస్తే లక్నో గెలిచే పరిస్థితిలో నిలిచింది. అప్పుడే షమి అద్భుతం చేశాడు. లాంగాఫ్ లో సిక్సర్ కొట్టి మ్యాచ్ ను సూపర్ ఓవర్ కు తీసుకెళ్లాడు.

ఒకటే రన్

లాస్ట్ బాల్ కు షమి సిక్సర్ తో మ్యాచ్ పై హైప్ పెరిగింది. కానీ సూపర్ ఓవర్లో లక్నో చెత్త బ్యాటింగ్ తో చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. సూపర్ ఓవర్లో ఆ టీమ్ ఒకే రన్ చేసింది. నరైన్ ఫస్ట్ బాల్ కే పూరన్ ను బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన పంత్ సింగిల్ తీశాడు. వెంటనే మూడో బాల్ కు మార్ క్రమ్ ను నరైన్ ఔట్ చేయడంతో రెండు వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్ ఓవర్ ఇన్నింగ్స్ ముగిసింది.

చెత్త రికార్డు

అంతకుముందు మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 రన్స్ చేసింది. మోసిన్ ఖాన్ 5 వికెట్లతో చెలరేగడంతో 73 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ను రింకు ఆదుకున్నాడు. 51 బంతుల్లో 83 పరుగులు చేసిన నాటౌట్ గా నిలిచిన రింకు కేకేఆర్ కు మెరుగైన స్కోరు అందించాడు. రింకు 7 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe