...
...
Next Story

Ind Vs Pak: ఆడకున్నా పరువు దక్కేదేమో..పాక్ పై ట్రోల్స్..ఇండియా చేతిలో పాకిస్థాన్ చిత్తు..టీ20 ప్రపంచకప్ సూపర్ 8కు భారత్

ఇండియాతో మ్యాచ్ ఆడకున్నా పరువు దక్కేదే.. ఇదీ ఇప్పుడు పాకిస్థాన్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్. టీ20 ప్రపంచకప్ లో ఇండియా చేతిలో పాక్ చిత్తుగా ఓడింది. దీంతో తమ టీమ్ ఈ మ్యాచ్ ను బాయ్ కాట్ చేసినా బాగుండేదని పాక్ ఫ్యాన్స్ కుమిలిపోతున్నారు. హ్యాట్రిక్ విజయాలతో ఇండియా సూపర్ 8కు దూసుకెళ్లింది.

Published on: Feb 15, 2026, 22:17:57 IST
Advertisement

ఇది కదా గెలుపు అంటే.. ఇలా కదా పాకిస్థాన్ ను చిత్తు చేయాల్సింది. అవును.. ఇండియా అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేసింది. బౌలింగ్ లో సత్తాచాటి పాక్ నడ్డివిరిచింది. ఆదివారం (ఫిబ్రవరి 15) జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లో భారత్ 61 పరుగుల తేడాతో పాక్ పై గెలిచింది.

పాకిస్థాన్ పై ఇండియా విక్టరీ (PTI)
పాకిస్థాన్ పై ఇండియా విక్టరీ (PTI)

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 రన్స్ చేసింది. ఛేజింగ్ లో పాక్ 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. ఇండియన్ బౌలర్లలో బుమ్రా, అక్షర్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్య రెండేసి వికెట్లు తీశారు.

టీ20 ప్రపంచకప్ లో హ్యాట్రిక్ విజయాలతో ఇండియా సూపర్ 8కు అర్హత సాధించింది.

బుమ్రా అదుర్స్

టీమిండియా మెయిన్ పేసర్ బుమ్రా కొద్దికాలంగా ఫామ్ లో లేడు. కానీ పాకిస్థాన్ తో మ్యాచ్ అనగానే బుమ్రా రెచ్చిపోయాడు. ఒకే ఓవర్లో సయీమ్ అయూబ్ (6), సల్మాన్ అఘా (4)ను ఔట్ చేసి పాక్ కు డబుల్ షాకిచ్చాడు. అంతకంటే ముందు ఫస్ట్ ఓవర్లోనే ఫర్హాన్ (0) ను హార్దిక్ ఔట్ చేయడంతో ఒక్క రన్ కూడా రాకుండానే పాక్ వికెట్ కోల్పోయింది.

ఉస్మాన్ వికెట్ తో

ఇండియన్ స్పిన్నర్లు రంగంలోకి దిగి పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజాం (5)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ దశలో ఉస్మాన్ ఖాన్ (34 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్ తో 44) కాస్త పోరాడాడు. కానీ ఉస్మాన్ ను అక్షర్ ఔట్ చేయడంతో పాక్ పనైపోయింది.

అంతకంటే ముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ దిగిన ఇండియా ఇన్నింగ్స్ లో ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) ఆట హైలైట్. పాకిస్థాన్ తమ స్పిన్నర్లతో ఉచ్చు బిగించాలని చూసినా ఇషాన్ మాత్రం బ్యాటింగ్ లో అదరగొట్టాడు. అతను క్రీజులో ఉన్నప్పుడు ఇండియా ఈజీగా 200 కు పైగా స్కోరు చేస్తుందనిపించింది. కానీ ఇషాన్ వికెట్ తర్వాత సీన్ రివర్సైంది.

పాకిస్థాన్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. సయీమ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆఖర్లో శివమ్ దూబె (17 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 27), రింకు సింగ్ (4 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్ తో 11 నాటౌట్) కలిసి టీమ్ స్కోరును 170 దాటించారు.

పాక్ టీమ్ పై ట్రోల్స్

ఇండియా చేతిలో ఓటమితో పాకిస్థాన్ టీమ్ పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. నిజానికి టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ను పాక్ బాయ్ కాట్ చేస్తామని ప్రకటించింది. కానీ ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆడింది. ఇప్పుడు ఓటమిపాలైంది. దీంతో పాక్ ఆడకపోయినా పరువు దక్కేదేమో, బాయ్ కాట్ చేసినా బాగుండేదేమోనని ఆ టీమ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks