India Post GDS : నిరుద్యోగులకు శుభవార్త! ఇండియా పోస్ట్‌లో 28,740 ఉద్యోగాలు- 10 పాసైతే చాలు..

దేశవ్యాప్తంగా 28,740 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్​), బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదో తరగతి పాసైన వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు లభిస్తుండటంతో ఇది ఒక అద్భుతమైన అవకాశం. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 31, 2026, 10:40:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిరుద్యోగులకు శుభవార్త! భారతీయ తపాలా శాఖ (ఇండియా పోస్ట్​) దేశవ్యాప్తంగా ఉన్న తన 23 పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 28,740 పోస్టుల భర్తీకి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇందులో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్​), బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ఏబీపీఎం) పోస్టులు ఉన్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ 'ఇండియా పోస్ట్ జీడీఎస్​ రిక్రూట్‌మెంట్ 2026' రిజిస్ట్రేషన్​ ప్రక్రియ జనవరి 31న ప్రారంభంకానుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక పోర్టల్ (https://indiapostgdsonline.gov.in/) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియా పోస్ట్​ జీడీఎస్​ రిక్రూట్​మెంట్​ 2026..
ఇండియా పోస్ట్​ జీడీఎస్​ రిక్రూట్​మెంట్​ 2026..

ఇండియా పోస్ట్​ జీడీఎస్​ రిక్రూట్​మెంట్​ 2026- వివరాలు..

ఇండియా పోస్ట్​ జీడీఎస్​ రిక్రూట్​మెంట్​ 2026లో మొత్తం ఖాళీలు: 28,740

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ మాత్రమే

ఎంపిక విధానం: మెరిట్ ఆధారితం (10వ తరగతి మార్కులు)

దరఖాస్తు తేదీలు: 31 జనవరి నుంచి 14 ఫిబ్రవరి 2026 వరకు

వేతన శ్రేణి: జీడీఎస్​/ఏబీపీఎం: రూ. 10,000 – రూ. 24,470; బీపీఎం: రూ. 12,000 – రూ. 29,380

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 16 ఫిబ్రవరి 2026

దరఖాస్తు సవరణ: 18–19 ఫిబ్రవరి 2026

మెరిట్ లిస్ట్ విడుదల: 28 ఫిబ్రవరి 2026

తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 1,060 ఖాళీలు, తెలంగాణ సర్కిల్‌లో 609 ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్ర (3,553), ఉత్తరప్రదేశ్ (3,169), పశ్చిమ బెంగాల్ (2,982) సర్కిళ్లలో పోస్టులు ఉన్నాయి.

ఇండియా పోస్ట్​ జీడీఎస్​ రిక్రూట్​మెంట్​ 2026- అర్హత..

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత. గణితం, ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి. అభ్యర్థి స్థానిక భాషను పదో తరగతి వరకు చదివి ఉండాలి.

వయస్సు: కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 40 ఏళ్లు.

అదనపు అవసరాలు: కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

ఇండియా పోస్ట్​ జీడీఎస్​ రిక్రూట్​మెంట్​ 2026- ఫీజు వివరాలు..

ఇండియా పోస్ట్​ జీడీఎస్​ రిక్రూట్​మెంట్​ 2026 ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి:

జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్: రూ. 100

ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / మహిళలు / ట్రాన్స్-ఉమెన్: ఎటువంటి ఫీజు లేదు (ఉచితం)

ఇండియా పోస్ట్​ జీడీఎస్​ రిక్రూట్​మెంట్​ 2026- రిజిస్ట్రేషన్​ ప్రక్రియ..

స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వాలి.

స్టెప్ 2: ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

స్టెప్ 3: లాగిన్ అయ్యి మీ సర్కిల్, డివిజన్ ప్రాధాన్యతలను ఎంచుకోవాలి.

స్టెప్ 4: పదో తరగతి మార్కుల జాబితా, ఫోటో, సంతకం వంటి పత్రాలను అప్‌లోడ్ చేసి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.

ఇండియా పోస్ట్​ జీడీఎస్​ రిక్రూట్​మెంట్​ 2026- ఎంపిక ప్రక్రియ..

ఇండియా పోస్ట్ ఈ ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తుంది. ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఎక్కువ మార్కులు ఉన్న వారికి ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పదో తరగతి ఉత్తీర్ణులై, ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ఒక స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఏటా నిర్వహించే ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఉద్యోగ ప్రకటనల్లో ఒకటిగా నిలుస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More