...
...
Next Story

India Vs England: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20.. టాస్ ఆలస్యం.. మ్యాచ్ కూడా లేట్.. విచిత్రమైన కారణం.. అవాక్కవాల్సిందే!

India Vs England: ఇంగ్లాండ్‌తో ఇండియా అయిదో టీ20 మ్యాచ్ టాస్ ఆలస్యమవుతోంది. మ్యాచ్ కూడా లేట్ గా స్టార్ట్ కానుంది. అయితే దీని వెనుకాల విచిత్ర కారణముంది. అది తెలిస్తే అవాక్కవాల్సిందే.

Published on: Jul 11, 2026, 19:14:17 IST
Advertisement

India Vs England: క్రికెట్ ప్రపంచంలో టీమిండియా షెడ్యూల్, క్రమశిక్షణ చాలా పక్కాగా ఉంటాయి. కానీ శనివారం ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఊహించని విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. పర్యాటక భారత జట్టు మ్యాచ్ వేదికకు రావడంలో ఆలస్యం కావడంతో టాస్ వేయడం లేట్ అయింది.

రోడ్డుపై చిక్కుకున్న ‘వరల్డ్ ఛాంపియన్స్’

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20.. టాస్ ఆలస్యం.. మ్యాచ్ కూడా లేట్.. విచిత్రమైన కారణం.. అవాక్కవాల్సిందే! (ANI Pic Service)
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20.. టాస్ ఆలస్యం.. మ్యాచ్ కూడా లేట్.. విచిత్రమైన కారణం.. అవాక్కవాల్సిందే! (ANI Pic Service)

ఇంగ్లాండ్ తో ఐదో టీ20 మ్యాచ్‌కు వేదికైన ఏజియాస్ బౌల్ (Ageas Bowl) గ్రౌండ్ కు సకాలంలో చేరుకోవడంలో టీమిండియా విఫలమైంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ, టీమ్ బస్ తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

  • అసలు సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడాల్సి ఉంది.
  • మారిన సమయం: టీమిండియా స్టేడియానికి ఆలస్యంగా రావడం వల్ల టాస్‌ను రాత్రి 7:15 గంటలకు నెట్టేశారు.
  • మ్యాచ్ ప్రారంభం: దీనివల్ల మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

యూకే పర్యటన ఒక పీడకల!

ఈ యూకే టూర్ టీమిండియా చరిత్రలోనే అత్యంత దారుణమైన పర్యటనల్లో ఒకటిగా మిగిలిపోనుంది. ఈ మ్యాచ్‌కు ముందే భారత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను చేజార్చుకుంది (మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది).

అంతకుముందు నెలలో బెల్ఫాస్ట్‌లో కనీస అంచనాలు లేని ఐర్లాండ్ (Ireland) జట్టుతో ఆడిన రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ వరల్డ్ ఛాంపియన్ హోదాలో ఉన్న భారత్ షాకింగ్ ఓటములను చవిచూసింది.

భారత్ ఓటమలు ఇలా

ట్రెంట్ బ్రిడ్జ్ (3వ టీ20): 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటింగ్ లైన్-అప్ పేకమేడలా కూలిపోయింది. కేవలం 12వ ఓవర్లోనే 76 పరుగులకే ఆలౌట్ అయి, పరుగుల పరంగా (125 రన్స్ తేడాతో) అత్యంత అవమానకరమైన ఓటమిని మూటగట్టుకుంది.

బ్రిస్టల్ (4వ టీ20): గురువారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 158/7 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమవగా.. ఇంగ్లాండ్ ఆ స్కోరును కేవలం 14 ఓవర్లలోనే ఊచకోత కోస్తూ ఛేజ్ చేసింది.

శ్రేయస్ అయ్యర్ టార్గెట్

ప్రస్తుతం సోషల్ మీడియాలో Shreyas Iyer flop show UK tour అంటూ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సీనియర్ ఆటగాళ్లపై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే, కేవలం ఆటగాళ్లను మాత్రమే బలిపశువులను చేయడం కరెక్ట్ కాదనే టాక్ వినిపిస్తోంది. ఈ మొత్తం దారుణమైన పరాజయాల వెనుక బీసీసీఐ సెలెక్షన్, షెడ్యూలింగ్ బ్లండర్స్ కూడా ఉన్నాయని అంటున్నారు.

నిరంతర క్రికెట్ ఆడటం వల్ల ఆటగాళ్లకు సరైన విశ్రాంతి లేకపోవడం, ఇంగ్లాండ్ వంటి కండిషన్లలో తగినంత ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండా నేరుగా సిరీస్‌లోకి దించడం మేనేజ్‌మెంట్ వైఫల్యమే. దానికి తోడు ఈ రోజు మ్యాచ్‌కు కూడా కనీసం ట్రాఫిక్ అంచనా వేయకుండా మేనేజ్‌మెంట్ ఆలస్యంగా బయలుదేరడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe