...
...
Next Story

Ind vs Eng: టీమిండియాకు చావోరేవో-నేడే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్‌తో సెమీస్‌-మ‌న‌దే పైచేయి-లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

Ind vs Eng: టీ20 ప్రపంచకప్ లో టీమిండియాకు మరో కఠిన సవాల్. ఫైనల్ చేరాలంటే చాావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో ఇండియా నేడు తలపడుతోంది. హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే మనదే పైచేయి. ఈ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ? చూడాలనే వివరాలు ఇక్కడున్నాయి.

Published on: Mar 5, 2026, 12:13:30 IST
Advertisement

టీ20 ప్రపంచకప్ లో మరో థ్రిల్లర్ కు రంగం సిద్ధమైంది. పొట్టి కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో ఇండియా తలపడుతోంది. నేడు ఈ డూ ఆర్ డై మ్యాచ్. గురువారం వాంఖడే స్టేడియంలో జరిగే సెమీస్ బలమైన ఇంగ్లిష్ జట్టును భారత్ ఢీకొడుతోంది. హెడ్ టు హెడ్ రికార్డు, మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలను ఇక్కడ చూసేయండి.

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్

సూర్యకుమార్ యాదవ్, హ్యారీ బ్రూక్ (PTI)
సూర్యకుమార్ యాదవ్, హ్యారీ బ్రూక్ (PTI)

ఇండియా, ఇంగ్లాండ్ టీమ్ మధ్య మరో రసవత్తర పోరు జరగబోతుంది. ఇవాళ (మార్చి 5) ఈ రెండు బలమైన జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ ఫైట్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే టీ20ల్లో ఇంగ్లాండ్ పై ఇండియాదే పైచేయి కావడం మన ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇచ్చేదే.

హెడ్ టు హెడ్ రికార్డు

టీ20ల్లో టీమిండియా, ఇంగ్లాండ్ హెడ్ టు హెడ్ రికార్డుపై ఓ లుక్కేద్దాం. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకూ జరిగిన టీ20ల్లో ఇండియా 17 గెలిచింది. ఇంగ్లాండ్ ఏమో 12 నెగ్గింది. గత ఆరు టీ20ల్లో ఏమో ఇండియా ఏకంగా అయిదు విజయాలు సాధించింది. ఇక టీ20 ప్రపంచకప్ చరిత్రలోనూ ఇంగ్లాండ్ పై ఇండియాదే డామినెన్స్. ప్రపంచకప్ ల్లో అయిదు మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ పై భారత్ మూడు గెలిచింది.

లైవ్ స్ట్రీమింగ్

టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేస్తారు. ముంబయిలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ సెమీస్ పోరును స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియోహాట్ స్టార్ లో చూడొచ్చు.

ఇండియా ఇలా

సంజు శాంసన్ మూడు ఇన్నింగ్స్‌లలో 71.50 సగటు, 195.89 స్ట్రైక్ రేట్‌తో 143 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 38.50 సగటుతో 231 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 185.12 స్ట్రైక్ రేట్‌తో 224 పరుగులు చేశాడు. శివం దూబె, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ కూడా రాణిస్తున్నారు.

బౌలింగ్ లో

బౌలింగ్ లోనే ఇండియా కాస్త బలహీనంగా కనిపిస్తోంది. విండీస్ తో మ్యాచ్ లో బుమ్రా మినహా మన బౌలర్లు అంచనాలు అందుకోలేకపోయారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు వరుణ్ చక్రవర్తి (12 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 9, అర్ష్‌దీప్ 8, అక్షర్ 7 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ తో పోరులో మన బౌలర్లు బెటర్ గా రాణిస్తేనే ఇండియాకు గెలిచే ఛాన్స్ ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks