...
...
Next Story

ITBP Recruitment : ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు - ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం

ITBP Head Constable Recruitment 2026 : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Sep 30, 2026, 11:02:28 IST
Advertisement

ITBP Head Constable Recruitment 2026 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) ఫోర్స్ మంచి గుడ్ న్యూస్ వచ్చింది. హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 37 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు
ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 27, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. పోస్టుల వివరాలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు రుసుము వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

ఖాళీల వివరాలు :

ఈ ప్రకటన ద్వారా రెండు వేర్వేరు విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు:

  • హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ & స్ట్రెస్ కౌన్సెలర్): 16 పోస్టులు
  • హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్): 21 పోస్టులు
  • హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ - స్ట్రెస్ కౌన్సెలర్) : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ (ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ (B.T) తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) : ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 10+2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.

ఎంపిక విధానం…

రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టుకు సంబంధించి నిర్వహించే వ్రాత పరీక్ష ప్రశ్నలు 12వ తరగతి స్థాయి ప్రమాణాలలో ఉంటాయి.

అన్‌‌రిజర్వ్‌డ్ (UR), ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ (SC), ఎస్టీ (ST) మరియు మాజీ సైనిక ఉద్యోగుల కేటగిరీల అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలి. ఇతర మార్గాల్లో చెల్లించే ఫీజులను ఆమోదించరు… అలాంటి దరఖాస్తులను వెంటనే తిరస్కరిస్తారు.

  1. ముందుగా ఐటీబీపీ అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in ను సందర్శించండి.
  2. హోమ్‌పేజీలోని రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి, మీ వివరాలతో నమోదు చేసుకోండి.
  3. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత మీ అకౌంట్‌‌లోకి లాగిన్ అవ్వండి.
  4. దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని నమోదు చేసి, దరఖాస్తు రుసుమును చెల్లించండి.
  5. వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని, సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
  6. కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకొని ఉంచుకోండి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks