JEE Mains 2027 : ఇంకొన్ని రోజుల్లో జేఈఈ మెయిన్స్ 2027 రిజిస్ట్రేషన్లు ఓపెన్- పూర్తి వివరాలు..

దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్​ 2027 సెషన్-1 దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరీక్ష తేదీలు, కావాల్సిన పత్రాలు, దరఖాస్తు విధానం వివరాలు ఇక్కడ పరిశీలించండి..

Published on: Oct 18, 2026, 09:12:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జేఈఈ మెయిన్స్ 2027 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. ఈ దఫా మెయిన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అతి త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అనేక మీడియా నివేదికల ప్రకారం జేఈఈ మెయిన్స్ 2027 సెషన్ 1 అప్లికేషన్ ప్రాసెస్ అక్టోబర్ చివరి వారంలో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్స్ 2027 అప్డేట్స్..
జేఈఈ మెయిన్స్ 2027 అప్డేట్స్..

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎన్​ఐటీలతో పాటు ఐఐటీల్లో చేరేందుకు రాయాల్సిన జేఈఈ అడ్వాన్స్​డ్​కు అర్హత పరీక్షగా ఈ జేఈఈ మెయిన్స్​ని పరిగణిస్తారన్న విషయం తెలిసిందే. అందుకు లక్షలాది మంది విద్యార్థులు ఈ కఠిన పరీక్షను అత్యంత సీరియస్​గా పరిగణిస్తుంటారు.

ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్​ 2027 రిజిస్ట్రేషన్​కి కావాల్సిన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ప్రక్రియ, పరీక్ష తేదీలు వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

జేఈఈ మెయిన్స్ 2027 పరీక్ష షెడ్యూల్..

ఎన్టీఏ అందించిన ముందస్తు సమాచారం ప్రకారం జేఈఈ మెయిన్స్ 2027 మొదటి విడత షెడ్యూల్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 2026 చివరి వారంలో ప్రారంభమై నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది.

సెషన్-1 పరీక్ష తేదీలు: 2027 జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (సీబీటీ) నిర్వహిస్తారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సర్దుబాటు చేయడానికి జనవరి 31ని బఫర్ డేగా ఉంచారు.

సెషన్-2 పరీక్షలు: రెండవ విడత పరీక్షలు 2027 ఏప్రిల్ నెలలో జరగనుండగా, దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది.

జేఈఈ మెయిన్స్ 2027కి కావాల్సిన డాక్యుమెంట్లు..

దరఖాస్తు నింపే సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేదా కంగారు లేకుండా ఉండేందుకు అభ్యర్థులు ఈ కింది వివరాలు, పత్రాలను డిజిటల్ రూపంలో స్కాన్ చేసి పెట్టుకోవాలి:

గుర్తింపు కార్డు: ఆధార్ కార్డ్ లేదా ఇతర చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ గుర్తింపు కార్డు.

10వ తరగతి మార్కుల మెమో: జన్మదిన తేదీ, విద్యా వివరాల నమోదు కోసం.

12వ తరగతి వివరాలు: బోర్డు పేరు, స్కూలు వివరాలు, ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం లేదా హాల్ టికెట్ నంబర్.

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్: ఇటీవల తీయించుకున్న రంగుల ఫోటో ఎన్టీఏ పేర్కొన్న సైజులో ఉండాలి.

అభ్యర్థి డిజిటల్ సంతకం: స్పష్టమైన సంతకం స్కాన్ కాపీ.

రిజర్వేషన్ సర్టిఫికేట్: ఓబీసీ-ఎన్​సీఎల్, ఈడబ్ల్యూఎస్, ఎ​స్సీ, ఎస్టీ) సంబంధించిన ధృవీకరణ పత్రం.

మొబైల్, ఈమెయిల్ ఐడీ: భవిష్యత్ సంప్రదింపులు, ఓటీపీల కోసం సొంత మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని మాత్రమే ఇవ్వాలి.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు మార్గం: నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు.

జేఈఈ మెయిన్స్ 2027 తెలుగుతో పాటు 13 భాషల్లో పరీక్ష..

జాతీయ విద్యా విధానం (ఎన్​ఈపీ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్టీఏ గత కొన్ని సంవత్సరాలుగా ప్రాంతీయ భాషల్లో కూడా ఈ జేఈఈ పరీక్షను నిర్వహిస్తోంది. అందులో భాగంగా జేఈఈ మెయిన్ 2027 పరీక్షను ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, పంజాబీ, ఉర్దూ భాషల్లో అభ్యర్థులు రాసే వెసులుబాటు ఉంది. ప్రాంతీయ భాషల్లో ప్రశ్నాపత్రాలు అందుబాటులో ఉండటం వల్ల గ్రామీణ. తెలుగు మీడియం విద్యార్థులకు జాతీయ స్థాయిలో రాణించడానికి మంచి అవకాశం లభిస్తుంది.

జేఈఈ మెయిన్స్ 2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

  • మొదటగా jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో ఉన్న 'JEE Main 2027 Registration' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని నమోదు చేసి ప్రాథమిక రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అప్లికేషన్ నంబర్ పొందుపరచాలి.
  • ఆ తర్వాత లాగిన్ అయి వ్యక్తిగత, విద్యా అర్హతలు, నచ్చిన పరీక్షా కేంద్రం వివరాలను నమోదు చేయాలి.
  • స్కాన్ చేసిన ఫోటో, సంతకం, కేటగిరీ సర్టిఫికేట్‌లను సరైన పరిమాణంలో అప్‌లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించి, భవిష్యత్ అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ లేదా పిడిఎఫ్ రూపంలో భద్రపరుచుకోవాలి.
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More