...
...
Next Story

Jharkhand protests : విద్యార్థుల డిమాండ్లకు ఓకే చెప్పిన ఝార్ఖండ్ ప్రభుత్వం- కానీ..

ఝార్ఖండ్‌లో విద్యార్థుల సుదీర్ఘ ఆందోళనల నేపథ్యంలో సీఎం హేమంత్ సోరెన్ జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్, జేపీఎస్సీ పరీక్షలతో పాటు టీడీపీఎల్ రిక్రూట్‌మెంట్లన్నీ రద్దు చేశారు. 2014 నుంచి జరిగిన పరీక్షలపై సీఐడీ విచారణకు ఆదేశించారు.

Published on: Aug 18, 2026, 05:33:06 IST
Advertisement

విద్యార్థులు, నిరుద్యోగుల సుదీర్ఘ పోరాటానికి ఝార్ఖండ్ ప్రభుత్వం తలొగ్గింది. రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన ఉద్యోగ నియామకాల వివాదంపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని.. జేపీఎస్సీ, జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్షలతో పాటు ప్రైవేట్ సంస్థ టీడీపీఎల్ నిర్వహించిన అన్ని రిక్రూట్‌మెంట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సోమవారం రాత్రి ప్రకటించారు. అంతేకాకుండా, ఈ పరీక్షల్లో అవకతవకలపై దర్యాప్తును 2014 నాటి నుంచి జరిగిన అన్నింటికి వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.

విద్యార్థుల నిరసనలకు తలొగ్గిన ఝార్ఖండ్ ప్రభుత్వం..
విద్యార్థుల నిరసనలకు తలొగ్గిన ఝార్ఖండ్ ప్రభుత్వం..

అయితే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చేత విచారణ జరిపించాలన్న డిమాండ్‌పై విద్యార్థులు తమ ఆందోళనను విరమించేందుకు నిరాకరించారు.

"లక్నోకు చెందిన టీఎస్​ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురించిన ఫలితాలు, ఆ సంస్థ ద్వారా ఎంపికైన అభ్యర్థులు లేదా పాల్గొన్న ప్రతి ఒక్కరి వివరాలు, అలాగే ఇక్కడ జరిగిన టీడీపీఎల్ కార్యకలాపాలన్నీ రద్దు అవ్వాలి," అని సోమవారం సాయంత్రం విద్యార్థులతో మాట్లాడుతూ సోరెన్ పేర్కొన్నారు.

"2014 నుంచి జరిగిన ప్రతి చిన్న, పెద్ద తప్పుపై సమగ్ర విచారణ జరుపుతాం. ఝార్ఖండ్‌లో గతంలో జరిగిన అన్ని పరీక్షలను సీఐడీ విచారిస్తుంది," అని సోరెన్ వెల్లడించారు. "మా ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ అధ్యక్షతన సంస్కరణల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించాము," అని ఆయన తెలిపారు.

విద్యార్థుల నిరసనలు తీవ్రం.. సీబీఐ విచారణే లక్ష్యం!

సోమవారం నాటికి 24 రోజులుగా నిరసన దీక్షలు సాగిస్తున్న విద్యార్థులు.. పరీక్షా విధానంలో సంస్కరణలు చేపట్టాలని, ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా 2024లో ప్రశ్నపత్రాలు లీకైన జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్షల రద్దు వారి ప్రధాన డిమాండ్లలో ఒకటి.

"సీబీఐ విచారణ డిమాండ్ ఇంకా అంగీకరించబలేదు, ఆ డిమాండ్ నెరవేరే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాము," అని ఆయన పేర్కొన్నారు.

"మేము ఒక పెద్ద పోరాటంలో గెలిచాం, కానీ దీని వెనుక ఇంకా చాలా ఉంది.. 24 రోజుల తర్వాత మా డిమాండ్​ను చివరికి పట్టించుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం, అయితే సీబీఐ విచారణ జరిగే వరకు మా నిరాహార దీక్ష కొనసాగుతుందనే ప్రశ్న అలాగే ఉంది," అని ఆయన అన్నారు.

మరోవైపు, విద్యార్థి నాయకుడు దేంద్రనాథ్ మహతో మాత్రం తన దీక్షను విరమించారు.

రాహుల్ గాంధీ లేఖ ప్రభావం..

నిరసన తెలుపుతున్న విద్యార్థులను కలవాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కోరిన కొద్ది రోజులకే హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 14న సోరెన్‌కు రాసిన లేఖలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నిరసనలు "శాంతియుతంగా" సాగుతున్నాయని, విద్యార్థుల డిమాండ్లు "న్యాయబద్ధమైనవి" అని పేర్కొన్నారు.

"ముఖ్యమంత్రి తన మాట వినకపోతే" సంకీర్ణ ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకోవాలని శనివారం నాడు నిరసనకారులు రాహుల్ గాంధీని కోరారు. గాంధీ మద్దతు తెలిపినప్పటికీ ప్రభుత్వం నుంచి "ఎలాంటి నిర్దిష్ట చర్యలు" లేవని వారు ఎత్తిచూపారు.

"భారత రాజ్యాంగంలో పొందుపరిచిన శాంతియుత నిరసన హక్కు మన ప్రజాస్వామ్యానికి ప్రధాన స్తంబాలలో ఒకటిగా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అందువల్ల, గత కొన్ని నెలలుగా పేపర్ లీక్‌లు, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మేము మా పూర్తి మద్దతును అందించాము," అని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks