యూరప్‌లోని అందమైన ఆల్ప్స్ పర్వత ప్రాంతాల్లోని రోడ్డుపై వెళ్తున్న ఒక కొత్త కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే.. ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కియా సెల్టోస్ హైబ్రిడ్! ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌లో వస్తున్న ఈ ఎస్‌యూవీని కంపెనీ తొలిసారి రోడ్డు పరీక్షలకు పంపింది. ఈ నేపథ్యంలో ఎస్‌యూవీకి సంబంధించిన కొన్ని విషయాలు బయటపడ్డాయి.

ఈ ఏడాది చివరి నాటికి ఈ కియా సెల్టోస్ హైబ్రిడ్ కారు గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇక మన దేశంలోని కార్ల ప్రియుల కోసం 2027 నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పెట్రోల్, డీజిల్ సెల్టోస్ మోడళ్లతో పాటు ఇది కూడా విక్రయానికి రానుంది. కియా ఇండియా లైనప్‌లో ఇదొక కీలకమైన మోడల్‌గా నిలవనుంది.
కియా సెల్టోస్ హైబ్రిడ్- డిజైన్‌లో చిన్నపాటి మార్పులు..
సాధారణ సెల్టోస్ మోడల్‌తో పోలిస్తే హైబ్రిడ్ వెర్షన్ రూపంలో పెద్దగా తేడాలు కనిపించవు. ముందు, వెనుక డిజైన్ అలాగే ఉంది. అయితే, ఈ టెస్ట్ కార్‌లో కనిపించిన కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ మాత్రం ప్రత్యేకంగా ఉంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌కు తగినట్లు దీన్ని తీర్చిదిద్దారు. సాధారణ ఐసీఈ వెర్షన్ నుంచి దీన్ని సులభంగా గుర్తించడానికి వీలుగా హైబ్రిడ్ బ్యాడ్జింగ్‌ను కూడా జోడించారు. మిగతా బాడీ డిజైన్, ఫీచర్లు మాత్రం స్టాండర్డ్ సెల్టోస్‌ను పోలి ఉంటాయి.
అంతర్జాతీయ మార్కెట్ల కోసం 1.6 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్!
కొన్ని యూరోపియన్ మార్కెట్లలో సెల్టోస్ హైబ్రిడ్ ఎస్‌యూవీ 1.6 లీటర్ టీ-జీడీఐ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌తో రానుంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ తో పాటు 1.5 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటాయి.
ఈ అంతర్జాతీయ వెర్షన్ సుమారు 141 పీఎస్ పవర్, 265 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా శక్తి చక్రాలకు అందుతుంది. మెరుగైన మైలేజ్, సాఫీగా సాగే రోడ్డు ప్రయాణమే లక్ష్యంగా ఈ హైబ్రిడ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు.
కియా సెల్టోస్ హైబ్రిడ్‌లో ఈ సౌకర్యం!
{{/usCountry}}ఈ అంతర్జాతీయ వెర్షన్ సుమారు 141 పీఎస్ పవర్, 265 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా శక్తి చక్రాలకు అందుతుంది. మెరుగైన మైలేజ్, సాఫీగా సాగే రోడ్డు ప్రయాణమే లక్ష్యంగా ఈ హైబ్రిడ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు.
కియా సెల్టోస్ హైబ్రిడ్‌లో ఈ సౌకర్యం!
{{/usCountry}}గ్లోబల్ సెల్టోస్ హైబ్రిడ్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లలో ఎలక్ట్రానిక్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఒకటి. సాంప్రదాయ మెకానికల్ ఏడబ్ల్యూడీ లా కాకుండా, ఈ సిస్టమ్ వెనుక చక్రాలను తిప్పడానికి ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగిస్తుంది. దీనివల్ల ఫ్రంట్, రియర్ యాక్సిల్స్ మధ్య ఎలాంటి మెకానికల్ కనెక్షన్ లేకుండానే ఆల్-వీల్ డ్రైవ్ అనుభూతిని పొందవచ్చు.
అయితే, భారత్‌లో విడుదల అయ్యే సెల్టోస్ హైబ్రిడ్‌కు ఈ-ఏడబ్ల్యూడీ ఫీచర్ వస్తుందా? లేదా? అనేది ఇంకా స్పష్టత లేదు. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఫ్రంట్-వీల్ డ్రైవ్ లేదా ఈ-ఏడబ్ల్యూడీ ఆప్షన్లను కియా అందించే అవకాశం ఉంది.
భారత్ కోసం ప్రత్యేకమైన హైబ్రిడ్ ఇంజిన్?
గ్లోబల్ మోడల్‌కు, ఇండియా-స్పెక్ సెల్టోస్ హైబ్రిడ్‌కు మధ్య హుడ్ కింద ప్రధాన తేడా ఉండే అవకాశం ఉంది. భారత్ కోసం 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆధారిత బలమైన హైబ్రిడ్ సిస్టమ్‌ను కియా తీసుకురావొచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇదే హైబ్రిడ్ టెక్నాలజీని నెక్ట్స్ జెన్ హ్యుందాయ్ క్రెటాలో కూడా వాడే అవకాశం ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు ఈ హైబ్రిడ్ ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. దీనివల్ల కస్టమర్లకు మరింత ఎక్కువ ఇంజిన్ ఛాయిస్ దొరుకుతుంది.
కియా సెల్టోస్ హైబ్రిడ్- ఈ ప్రత్యేకమైన ఫీచర్లు!
స్టాండర్డ్ మోడల్‌లో లభించే దాదాపు అన్ని ఫీచర్లు ఈ హైబ్రిడ్ వెర్షన్‌లోనూ ఉంటాయి. అదనంగా హైబ్రిడ్ సిస్టమ్‌కు సంబంధించిన కొన్ని సరికొత్త ఫీచర్లను కియా చేర్చనుంది.
వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్)
స్మార్ట్ రీజనరేటివ్ బ్రేకింగ్ 3.0
స్టే మోడ్
కారు ప్యూర్ ఈవీ మోడ్‌లో నడుస్తున్నప్పుడు శబ్దం చేసే ఫ్రంట్-మౌంటెడ్ స్పీకర్
వీటితో పాటు టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌లు, స్పోర్టీ సీట్లు, ఏసీ కోసం ఫిజికల్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, పెద్ద 30 అంగుళాల ట్రినిటీ డిస్‌ప్లే, అదిరిపోయే అడాస్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.
భారత్‌లో కియా సెల్టోస్ హైబ్రిడ్ లాంచ్ ఎప్పుడు?
2027 నాటికి కియా సెల్టోస్ హైబ్రిడ్ భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో ఇది వస్తే, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైబ్రిడ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి కియా ప్రవేశించినట్లవుతుంది.
మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లతో పాటు త్వరలో రానున్న రెనో డస్టర్ హైబ్రిడ్, నూతన తరం హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్‌లు దీనికి ప్రధాన పోటీదారులుగా నిలవనున్నాయి.