భారత ఆటోమొబైల్ కస్టమర్లకు పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి ఉపశమనం అందించే దిశగా దక్షిణ కొరియా వాహన దిగ్గజం ‘కియా’ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా పెరుగుతున్న ఇథనాల్ వినియోగానికి అనుగుణంగా, తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్’ కాన్సెప్ట్‌ను అధికారికంగా ప్రదర్శించింది. ఇది భారత మార్కెట్ కోసం కియా తీసుకొచ్చిన మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ కావడం విశేషం.

ఇటీవలే ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ కారెన్స్ మోడళ్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్ సోరెంటో ఎస్‌యూవీలను ప్రకటించిన కియా, ఇప్పుడు ఫ్లెక్స్-ఫ్యూయల్ విభాగాన్ని కూడా విస్తరించడం ద్వారా భారత వినియోగదారుల వైవిధ్యమైన ఇంధన అవసరాలను తీర్చేందుకు సిద్ధమైంది.
ఏంటీ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ?
సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు (ఎఫ్ఎఫ్వీ) భిన్నమైనవి. ఇవి సాధారణ పెట్రోల్‌తో పాటు పెట్రోల్‌లో ఇథనాల్ కలిపిన వివిధ రకాల మిశ్రమాలతోనూ ఏలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తాయి. ఈ కియా సైరోస్ ఎఫ్ఎఫ్వీ కాన్సెప్ట్ సాధారణ పెట్రోల్ మొదలుకొని ఏకంగా 85 శాతం వరకు ఇథనాల్ కలిపిన 'ఇ85' ఇంధనంతో కూడా సమర్థవంతంగా ప్రయాణిస్తుంది.
భారత్‌లో మారుతీ సుజుకీ (వాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్) తర్వాత ఒక ప్యాసింజర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాన్ని అధికారికంగా ప్రదర్శించిన రెండో ఆటోమొబైల్ సంస్థగా కియా నిలిచింది.
ఇంజిన్ సామర్థ్యం, సాంకేతిక మార్పులు..
కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్‌లో 1.0-లీటర్, 3-సిలిండర్, డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇథనాల్ ఉపయోగించినప్పుడు వచ్చే పవర్, టార్క్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
ఇథనాల్ కంబషన్ ప్రక్రియ సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే భిన్నంగా ఉండటమే కాకుండా, ఇంజిన్ భాగాలను తుప్పు పట్టించే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని తట్టుకునేందుకు కియా ఇంజనీర్లు కీలక మార్పులు చేశారు:
{{/usCountry}}ఇథనాల్ కంబషన్ ప్రక్రియ సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే భిన్నంగా ఉండటమే కాకుండా, ఇంజిన్ భాగాలను తుప్పు పట్టించే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని తట్టుకునేందుకు కియా ఇంజనీర్లు కీలక మార్పులు చేశారు:
{{/usCountry}}ఈసీయూ కాలిబ్రేషన్: ఇంజిన్ కంట్రోల్ యూనిట్, ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ యూనిట్‌లను ఇథనాల్ మిశ్రమానికి అనుగుణంగా రీ-స్ట్రాటజీ చేశారు.
ఇంధన వ్యవస్థ అప్‌గ్రేడ్: ఇథనాల్ వల్ల ఫ్యూయల్ లైన్లు, ట్యాంక్ దెబ్బతినకుండా ప్రత్యేకమైన కోటింగ్, లోహాలను ఉపయోగించారు.
ట్రాన్స్‌మిషన్: సాధారణ టర్బో-పెట్రోల్ సైరోస్‌లోని 7-స్పీడ్ డీసీటీకి బదులుగా, ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌లో 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జతచేశారు.
అట్రాక్టివ్ డిజైన్, హైటెక్ క్యాబిన్..
బాహ్య రూపం పరంగా ఇది సాధారణ సైరోస్ ఎస్‌యూవీ తరహాలోనే గంభీరమైన 'టాల్-బాయ్' ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఐస్-క్యూబ్ ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, డీఆర్ఎల్‌లు, 17-ఇంచుల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, వెనుక భాగంలో ఎల్-షేప్ ఎల్ఈడీ లైటింగ్ ఈ కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి.
ఇంటీరియర్ విషయానికి వస్తే, డాష్‌బోర్డ్‌పై డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్ ప్రదర్శించే ట్రిపుల్-స్క్రీన్ సెటప్‌ను అందించారు. సెంటర్ కన్సోల్‌లో ఫిజికల్ బటన్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, సు విశాలమైన స్టోరేజ్ స్థలం లభిస్తాయి.
కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఈ కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ని 'కాన్సెప్ట్' మోడల్‌గా ప్రదర్శించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. అయితే త్వరలోనే దీని ప్రాడక్ట్ రెడీ వర్షన్‌ను భారత రహదారులపైకి తేనున్నట్లు కియా స్పష్టం చేసింది. అయితే లాంచ్ తేదీ, మైలేజ్ వివరాలు, పెట్రోల్ మోడల్ కంటే దీని ధర ఎంత ఎక్కువగా ఉంటుంది అనే వివరాలను రాబోయే రోజుల్లో వెల్లడించనుంది.