భారతీ స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఏడాది పొడవునా ఎదురుచూసే ఘట్టానికి సమయం ఆసన్నమైంది. దీపావళి 2026 నేపథ్యంలో ఇంకొన్ని గంటల్లో ముహూరత్ ట్రేడింగ్ ప్రారంభంకానుంది. ఈ ట్రేడింగ్‌లో తీసుకునే స్టాక్స్‌తో మంచి లాభాలు వస్తాయని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలో ముహూరత్ ట్రేడింగ్ వేళ కొనాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ SAHI రీసెర్చ్ వెల్లడించింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
ముహూరత్ ట్రేడింగ్ 2026 టైమింగ్స్..

ప్రతీయేటా దీపావళి నాడు నూతన హిందూ విక్రమ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజు ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఇక 'సంవత్ 2083' నూతన అధ్యాయానికి స్వాగతం పలుకుతూ దలాల్ స్ట్రీట్ దిగ్గజాలు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ని నిర్వహిస్తాయి. నవంబర్ 8, ఆదివారం రోజున సాధారణ మార్కెట్ సెలవు దినం అయినప్పటికీ, దీపావళి లక్ష్మీ పూజ శుభసమయంలో మధ్యాహ్నం 2:20 గంటల నుంచి 3:30 గంటల వరకు ఒక గంట పాటు ఈ ముహూరత్ ట్రేడింగ్ జరగనుంది.
సంవర్త్ 2083 కోసం SAHI రీసెర్చ్ ఎంచుకున్న 5 టాప్ స్టాక్స్..
నూతన సంవత్సరం ఆరంభంలో 1 నుంచి 6 నెలల స్వల్పకాలిక వ్యవధిలో మంచి రాబడులు అందించే 5 రక్షణ, రియల్ ఎస్టేట్, గ్రీన్ ఎనర్జీ, క్యాపిటల్ మార్కెట్, బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లను 'SAHI రీసెర్చ్' సిఫార్సు చేసింది. టెక్నికల్ ఇండికేటర్లు, చార్ట్ ప్యాటర్నులు అనుకూలంగా ఉన్న ఆ స్టాక్స్ వివరాలు ఇవే:
1. జెన్ టెక్నాలజీస్
బై: రూ. 1,700 - రూ. 1,740
{{/usCountry}}బై: రూ. 1,700 - రూ. 1,740
{{/usCountry}}స్టాప్-లాస్: రూ. 1,580
టార్గెట్ 1: రూ. 1,925 | టార్గెట్ 2: రూ. 2,030
విశ్లేషణ: స్వదేశీ రక్షణ సాంకేతిక పరిజ్ఞానం తయారీలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జెన్ టెక్నాలజీస్ గతంలో రూ. 2,627 గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వల్ల దిగివచ్చింది. ప్రస్తుతం డెయిలీ చార్ట్‌లో 'డబుల్ బాటమ్' ప్యాటర్న్ ఏర్పరచి, భారీ వాల్యూమ్‌లతో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ పాజిటివ్‌గా ఉండటంతో తిరిగి ఆల్-టైమ్ గరిష్టాల వైపు ప్రయాణించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
2. డీఎల్ఎఫ్
బై : రూ. 710 - రూ. 720
స్టాప్-లాస్: రూ. 620
టార్గెట్ 1: రూ. 790 | టార్గెట్ 2: రూ. 880
విశ్లేషణ: లగ్జరీ హౌసింగ్ విభాగంలో బలమైన డిమాండ్ ఉన్న డీఎల్ఎఫ్ గత కొద్ది నెలలుగా కన్సాలిడేషన్ ఫేజ్‌ను ముగించుకుని పైకి లేచింది. ధర తగ్గినప్పటికీ ఆన్-బ్యాలెన్స్ వాల్యూమ్ (ఓబీవీ) నిలకడగా పెరగడం సంస్థలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న అక్యుములేషన్‌ను సూచిస్తోంది. డెయిలీ ఇంకా వీక్లీ చార్ట్స్‌లో ఆర్ఎస్ఐ 60 దాటడం రాబోయే బలమైన ర్యాలీకి సూచిక.
3. అదానీ గ్రీన్ ఎనర్జీ
బై : రూ. 1,350 - రూ. 1,385
స్టాప్-లాస్: రూ .1,165
టార్గెట్ 1: రూ. 1,590 | టార్గెట్ 2: రూ. 1,800
విశ్లేషణ: రికవరీ సంకేతాలు ఇస్తూ రూ. 1,150-1,220 సపోర్ట్ జోన్ నుంచి బలంగా పుంజుకుంది. బోలింగర్ బాండ్స్ అప్పర్ బాండ్ దాటి ట్రేడ్ అవుతుండటంతో వొలటాలిటీ పెరిగి స్టాక్ వేగంగా ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపుదల, బ్యాటరీ స్టోరేజ్ విస్తరణ దీనికి అదనపు బలం.
4. బీఎస్ఈ
బై: రూ. 3,590 - రూ. 3,640
స్టాప్-లాస్: రూ. 2,990
టార్గెట్ 1: రూ. 4,000 | టార్గెట్ 2: రూ. 4,440
విశ్లేషణ: డెరివేటివ్స్ విభాగంలో మార్కెట్ వాటాను వేగంగా పెంచుకుంటున్న బీఎస్ఈ 2024 సెప్టెంబర్ నుంచి అప్‌ట్రెండ్‌లోనే సాగుతోంది. ప్రతిసారీ సపోర్ట్ లైన్‌ను తాకిన వెంటనే కొనుగోలుదారులు బలంగా ఎగబడుతున్నారు. ఆర్ఎస్ఐ 60 పైన కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో ఆకర్షణీయమైన రాబడులు ఇచ్చే అవకాశం ఉంది.
5. హెచ్డీఎఫ్సీ బ్యాంక్
బై: రూ. 720 - రూ. 740
స్టాప్-లాస్: రూ. 620
టార్గెట్ 1: రూ. 815 | టార్గెట్ 2: రూ. 870
విశ్లేషణ: విలీనం తర్వాత క్రమంగా లాభాల బాట పడుతున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గతంలో రూ. 1,020 గరిష్ట స్థాయి నుంచి కరెక్షన్ ఎదుర్కొని రూ. 680-700 కీలక డిమాండ్ జోన్‌కు వెళ్లింది. చారిత్రాత్మకంగా ఈ సపోర్ట్ జోన్ నుంచి ఎప్పుడూ పెద్ద ర్యాలీలు ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా అదే జరుగుతోంది! అయితే రిస్క్ మేనేజ్మెంట్ కోసం ₹620 ను స్టాప్-లాస్‌గా పరిగణించాలి.
"ఈ పవిత్ర సందర్భాన్ని కేవలం మూఢనమ్మకంతో చూడకుండా మీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోవడానికి, ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఉపయోగించుకోవాలి," అని విశ్లేషకులు సూచిస్తున్నారు.
స్టాక్ మార్కెట్లో సరికొత్త జోష్: వరుసగా 7వ రోజు లాభాలు
ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు తమ విజయ పరంపరను శ్రామికంగా కొనసాగించాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం మార్కెట్లకు కొండంత అండగా నిలిచింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో
బీఎస్ఈ సెన్సెక్స్ : ఒకే రోజు 1,718.01 పాయింట్లు (2.17%) ఎగబాకి 81,028.02 వద్ద ఆల్-టైమ్ గరిష్టాల సమీపంలో ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ: 493.75 పాయింట్లు (2.01%) లాభపడి కీలకమైన 25,000 మార్కును అధిగమించి 25,030.35 వద్ద స్థిరపడింది.