NIC recruitment 2026 : నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​- కేంద్ర సంస్థలో వివిధ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్..

Government Jobs alert : నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్​ఐసీ) వివిధ సైంటిస్ట్ ‘బి’ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. కంప్యూటర్ సైన్స్, ఐటీ, డేటా సైన్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 24లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Apr 1, 2026, 05:33:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిరుద్యోగులకు తీపి కబురు అందించింది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్​ఐసీ). కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఈ సంస్థ.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 'సైంటిస్ట్ బి' పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెక్నాలజీ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.

ఎన్​ఐసీ​ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..
ఎన్​ఐసీ​ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..

ఈ నేపథ్యంలో ఈ ఎన్​ఐసీ రిక్రూట్​మెంట్​ 2026కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఎన్​ఐసీ రిక్రూట్​మెంట్​ 2026- ముఖ్యమైన తేదీలు ఇవే..

నోటిఫికేషన్ ప్రకారం, ఎన్​ఐసీ రిక్రూట్​మెంట్​ 2026 దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది. అర్హత ప్రమాణాలను మార్చి 31వ తేదీని కటాఫ్ డేట్‌గా పరిగణిస్తారు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను ఎన్‌ఐసీ త్వరలోనే తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనుంది.

ఎన్​ఐసీ రిక్రూట్​మెంట్​ 2026- ఖాళీల వివరాలు..

మొత్తం ఖాళీలను ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించారు. అయితే, అవసరానికి అనుగుణంగా ఈ పోస్టుల సంఖ్యను పెంచే లేదా తగ్గించే అధికారం పూర్తిగా ఎన్‌ఐసీకి ఉంటుంది.

కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ: 168 పోస్టులు

డేటా సైన్స్ అండ్ ఏఐ: 50 పోస్టులు

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: 25 పోస్టులు

ఎన్​ఐసీ రిక్రూట్​మెంట్​ 2026- అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ (బీఈ/ బీటెక్) లేదా ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఈ (ఎంఈ/ ఎంటెక్​) లేదా ఎం.ఫిల్ పూర్తి చేసి ఉండాలి.

ఎన్​ఐసీ రిక్రూట్​మెంట్​ 2026- గేట్ స్కోర్ కీలకం..

ఎన్​ఐసీ రిక్రూట్​మెంట్​ 2026 కోసం అభ్యర్థులు 2024, 2025 లేదా 2026 సంవత్సరాల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో గేట్ అర్హత సాధించి ఉండాలి. ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, సైబర్ లా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ వంటి అనుబంధ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి కూడా ప్రాధాన్యత ఉంటుంది.

ఎన్​ఐసీ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు రుసుము..

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 800 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (పీడబ్ల్యూబీడీ), మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎన్​ఐసీ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు చేయడం ఎలా?

అర్హత కలిగిన అభ్యర్థులు recruitment.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ కింది నాలుగు దశల్లో తమ అప్లికేషన్ పూర్తి చేయవచ్చు:

స్టెప్​ 1- రిజిస్ట్రేషన్: ముందుగా వెబ్‌సైట్‌లో ప్రాథమిక వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.

స్టెప్​ 2- వివరాల నమోదు: ఆన్‌లైన్ ఫామ్‌ను పూర్తి చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

స్టెప్​ 3- ఫీజు చెల్లింపు: అభ్యర్థి వర్గాన్ని బట్టి నిర్ణీత ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

స్టెప్​ 4- కన్ఫర్మేషన్: దరఖాస్తు పూర్తయిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More