OnePlus Turbo 6X : వన్‌ప్లస్ టర్బో 6ఎక్స్ సిరీస్ లాంచ్- క్రేజీ ఫీచర్లు, పెద్ద బ్యాటరీతో..
OnePlus Turbo 6X pro : వన్‌ప్లస్ సంస్థ చైనా మార్కెట్లో సరికొత్త 'టర్బో 6ఎక్స్' సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో బేస్ మోడల్ 7000ఎంఏహెచ్ బ్యాటరీతో రాగా, ప్రో మోడల్ ఏకంగా 8000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ఐపీ69 రేటింగ్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రముఖ గ్లోబల్ టెక్ బ్రాండ్ 'వన్‌ప్లస్' స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది! భారీ బ్యాటరీ బ్యాకప్, పవర్‌ఫుల్ ఫీచర్లు కోరుకునే వారి కోసం సరికొత్త ‘వన్‌ప్లస్ టర్బో 6ఎక్స్’, ‘వన్‌ప్లస్ టర్బో 6ఎక్స్ ప్రో’ స్మార్ట్‌ఫోన్లను చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. మీడియాటెక్ సంస్థ తీసుకొచ్చిన సరికొత్త 'డైమెన్సిటీ సూపర్' సిరీస్ చిప్‌సెట్లతో లాంచ్ అయిన మొదటి ఫోన్లు ఇవే కావడం విశేషం.

ఈ రెండు డివైజ్‌లలోనూ 144హెచ్‌జెడ్ హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, అదిరిపోయే బ్యాటరీ లైఫ్‌ను కామన్‌గా అందించినప్పటికీ.. స్క్రీన్ టెక్నాలజీ, బ్యాటరీ కెపాసిటీ, కెమెరా హార్డ్‌వేర్, వాటర్ రెసిస్టెన్స్ విషయంలో కంపెనీ వేర్వేరు ఫీచర్లను జోడించింది. బేస్ మోడల్ అయిన టర్బో 6ఎక్స్ ఫోన్ 7,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఎల్‌సీడీ ప్యానెల్‌తో రాగా.. హై-ఎండ్ మోడల్ టర్బో 6ఎక్స్ ప్రో వెర్షన్ ఏకంగా 8,000ఎంఏహెచ్ బ్యాటరీ, అమోలెడ్ స్క్రీన్‌తో పాటు అత్యుత్తమ ప్రొటెక్షన్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది.
వన్‌ప్లస్ టర్బో 6ఎక్స్ సిరీస్: ధరల వివరాలు..
ఈ సరికొత్త ఫోన్లు చైనాలో ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. జూన్ 15 నుంచి అక్కడ అధికారికంగా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
వన్‌ప్లస్ టర్బో 6ఎక్స్-
- 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,899 యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 26,800)
- 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లు (సుమారు రూ. 28,100)
- 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లు (సుమారు రూ. 32,300)
ఈ ఫోన్ వైట్, గ్రీన్ క్లౌడ్, స్టారీ బ్లాక్ రంగులలో లభిస్తుంది.
వన్‌ప్లస్ టర్బో 6ఎక్స్ ప్రో-
- 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లు (సుమారు రూ. 28,100)
- 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,099 యువాన్లు (సుమారు రూ. 29,500)
- 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,399 యువాన్లు (సుమారు రూ. 33,700)
ఈ ప్రో మోడల్‌ను హార్ట్‌బీట్ ఆరెంజ్, హార్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్ అదుర్స్!
వన్‌ప్లస్ టర్బో 6ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.72 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. అదే సమయంలో, టర్బో 6ఎక్స్ ప్రో మోడల్‌లో 6.78 ఇంచుల శాంసంగ్ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 1.5K రిజల్యూషన్, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఏకంగా 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. రెండు ఫోన్లలోనూ డీసీ డిమ్మింగ్ సపోర్ట్ ఉంది. గ్లోవ్స్ వేసుకున్నా, చేతులు తడిగా లేదా జిడ్డుగా ఉన్నా సరే స్క్రీన్ చాలా స్మూత్‌గా టచ్ అయ్యేలా ప్రత్యేక ఆప్టిమైజేషన్ చేశారు.
ప్రాసెసర్ విషయానికి వస్తే, బేస్ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ చిప్‌సెట్‌ను వాడగా, ప్రో మోడల్‌లో మరింత పవర్‌ఫుల్ డైమెన్సిటీ 7400 సూపర్ ఎస్‌ఓసీని అందించారు. ఈ రెండు ఫోన్లు గరిష్టంగా 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తాయి. అయితే, స్టాండర్డ్ మోడల్‌లో మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకునే సదుపాయం ఉండగా, ప్రో మోడల్‌లో మాత్రం ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ లేదు.
ఆండ్రాయిడ్ 16 ఫీచర్లు.. పవర్‌ఫుల్ ఏఐ టూల్స్
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతాయి. చైనా వెలుపల లేదా భారత మార్కెట్లోకి ఇవి వస్తే మాత్రం ఆక్సిజన్ ఓఎస్‌తో వచ్చే అవకాశం ఉంది. ప్రో వేరియంట్‌లో యూజర్ల కోసం అధునాతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లను జోడించారు. ఇందులో ఏఐ ట్రాన్స్‌లేషన్, ఏఐ రైటింగ్ అసిస్టెన్స్, ఏఐ వాయిస్ నోట్ జనరేషన్ వంటి అద్భుతమైన టూల్స్ ఉన్నాయి. గేమింగ్ ప్రియుల కోసం సైలెంట్ గేమ్ లాంచ్, వాయిస్ చేంజర్, కస్టమ్ గేమ్ కమాండ్స్ వంటి స్పెషల్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
కెమెరా, బ్యాటరీ సామర్థ్యం..
కెమెరా సెటప్: వన్‌ప్లస్ టర్బో 6ఎక్స్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంది. సెల్ఫీల కోసం ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. ఇక ప్రో మోడల్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలను అమర్చారు. దీని ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్. ఈ కెమెరాల్లో లైవ్ ఫొటోస్, పోర్ట్రెయిట్ టూల్స్, వింటేజ్ ఫిల్మ్ ఫిల్టర్లు వంటి ఆప్షన్లు ఉన్నాయి.
భారీ బ్యాటరీ: బ్యాటరీ పరంగా ఈ ఫోన్లు కొత్త రికార్డు సృష్టించాయి. బేస్ మోడల్‌లో 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 7,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ప్రో మోడల్‌లో ఏకంగా 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 8,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ప్యాక్ చేశారు.
మిలిటరీ గ్రేడ్ ల్యాబ్ టెస్ట్.. తిరుగులేని ప్రొటెక్షన్!
సెక్యూరిటీ కోసం బేస్ మోడల్‌కు సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను, ప్రో మోడల్‌కు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించారు. సాధారణ మోడల్ ఐపీ64 రేటింగ్‌తో దుమ్ము, చిన్నపాటి నీటి చినుకుల నుంచి రక్షణ ఇస్తుంది. కానీ, టర్బో 6ఎక్స్ ప్రో మోడల్ మాత్రం నెక్ట్స్ లెవెల్ ప్రొటెక్షన్‌తో వస్తోంది. దీనికి ఐపీ66, ఐపీ68, ఐపీ69 మరియు ఐపీ69కే వంటి నాలుగు రకాల అత్యుత్తమ రేటింగులు ఇచ్చారు. అంటే ఎంతటి దారుణమైన నీటి ఒత్తిడిని, వేడి నీటి స్ప్రేలను అయినా ఇది ఈజీగా తట్టుకోగలదు. అంతేకాదు, ఈ ప్రో మోడల్ ఏకంగా ఏడు రకాల మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ టెస్టులలో పాస్ అయి స్ట్రాంగ్ ఫోన్‌గా నిలిచింది.
ప్రస్తుతానికి ఈ వన్‌ప్లస్ టర్బో 6ఎక్స్, వన్‌ప్లస్ టర్బో 6ఎక్స్ ప్రో ఫోన్లు చైనాలోనే లాంచ్ అయినప్పటికీ, గతంలో వచ్చిన టర్బో సిరీస్ ఫోన్ల ట్రాక్ రికార్డ్ చూస్తే.. ఇవి త్వరలోనే గ్లోబల్, భారత మార్కెట్లోకి ‘నార్డ్’ బ్రాండింగ్‌తో అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


