ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని దేశ ప్రజలను నడిపించారు. కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక రెడ్ రోడ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని యోగాసనాలు వేశారు.

ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని “యోగా ఫర్ హెల్తీ యేజింగ్” అనే ప్రత్యేక ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, భావోద్వేగ స్థిరత్వం, వయసు పైబడిన వారు కూడా చురుగ్గా ఉంటూ మెరుగైన జీవన ప్రమాణాలను అందుకోవడంలో యోగా ఎంతగానో దోహదపడుతుందని ఈ థీమ్ స్పష్టం చేస్తోంది.
“హిమాలయాల నుంచి హిందూ మహా సముద్రం వరకు, ఈశాన్యం, బెంగాల్ నుంచి పశ్చిమాన ఉన్న సౌరాష్ట్ర వరకు మన దేశం యోగా ఎనర్జీతో నిండిపోయింది. యావత్ దేశం, ప్రపంచం ఒక్కటైంది. ఇది యోగాకి ఉన్న పవర్. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. ప్రపంచానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే రోజున బెంగాల్ ప్రజలు స్వచ్ఛత డ్రైవ్‌ని కూడా నిర్వహించాలని పిలుపునిస్తున్నాను,” అని ప్రధాని మోదీ అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో కోల్‌కతాలో నిర్వహించిన ఈ ఈవెంట్లో 30వేలకుపైగా మంది ప్రజలతో కలిసి మోదీ యోగా చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 ప్రాంతాలలో ఈ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందులో 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ కేంద్రాలు చురుగ్గా పాల్గొంటున్నాయి. సమాజంలో ఆరోగ్యం, సామరస్యం, సామూహిక సంక్షేమాన్ని పెంపొందించడంలో యోగా ఒక ప్రపంచ ఉద్యమంగా మారిందనడానికి ఈ వేడుకలే నిదర్శనం.
భారతదేశం పంపిన ప్రతిపాదనను అంగీకరిస్తూ 2015లో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ చారిత్రాత్మక ప్రాంతాలైన దిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, శ్రీనగర్, విశాఖపట్నం నుంచి ఈ వేడుకలను స్వయంగా ముందుండి నడిపిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో రాష్ట్రపతి ముర్ము..
{{/usCountry}}భారతదేశం పంపిన ప్రతిపాదనను అంగీకరిస్తూ 2015లో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ చారిత్రాత్మక ప్రాంతాలైన దిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, శ్రీనగర్, విశాఖపట్నం నుంచి ఈ వేడుకలను స్వయంగా ముందుండి నడిపిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో రాష్ట్రపతి ముర్ము..
{{/usCountry}}అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో గల చారిత్రాత్మక గ్యారిసన్ గ్రౌండ్‌లో యోగాసనాలు వేశారు. ఈ చారిత్రాత్మక వేదికపై ఒక దేశ ప్రథమ పౌరురాలు యోగా కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి.
రాష్ట్రపతి ముర్ము ప్రస్తుతం ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మధ్యప్రదేశ్‌లో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం గ్యారిసన్ గ్రౌండ్‌లో జరిగిన యోగా సెషన్‌కు ఆమె నేతృత్వం వహించారు.
యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది పీఎం మోదీయే: శిల్పా శెట్టి
భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా యోగాను విస్తృతంగా ప్రచారం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషిని ప్రముఖ నటి, ఫిట్‌నెస్ నిపుణురాలు శిల్పా శెట్టి కుంద్రా కొనియాడారు.
సరికొత్త ఫిట్‌నెస్ జీవనశైలికి మారుపేరుగా నిలిచే శిల్పా శెట్టి.. యోగా మూలాలు భారతదేశంలోనే ఉన్నాయని, ఈ సంప్రదాయాన్ని పాశ్చాత్య దేశాల ప్రజలు కూడా ఎంతో ఆసక్తితో స్వీకరిస్తుండటం చూస్తుంటే ఒక భారతీయురాలిగా గర్వంగా ఉందని పేర్కొన్నారు.
“యోగా భారతదేశానికి చెందినది కావడం, దానిని పాశ్చాత్య దేశాల ప్రజలు తమ జీవితాల్లోకి ఆహ్వానించడం నాకు ఎంతో గర్వకారణంగా అనిపిస్తోంది,” అని శిల్పా శెట్టి వ్యాఖ్యానించారు.
యోగాను సామాన్య ప్రజల చర్చల్లోకి తీసుకురావడమే కాకుండా.. ‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్’ వంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఇందులో భాగస్వాములయ్యేలా ప్రధాని మోదీ ప్రోత్సహించారని ఆమె అభినందించారు.
“మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రోజుల్లో యోగాకు ఇంత పెద్ద ఎత్తున అంతర్జాతీయ గుర్తింపు లభించిందంటే దానికి కారణం ఆయనే. ఇందుకోసం నేను మోదీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను,” అని శిల్పా శెట్టి చెప్పారు.